Organic Farming: పురుగు మందులు చేయకుండా వ్యవసాయం చేయాలంటే క్రింది రాజీలేని సూత్రాలను పాటించాలి.
1. వేసవి దుక్కులు:
ఎప్పుడు: మే, జూన్ తొలకరి వర్షాలు పడిన తర్వాత.
2. సామూహిక పంటలు:
ఎప్పుడు: తొలకరి వర్షం పడిన రోజు సాయంత్రం 6-7 గం||ల మధ్య లో మంటలు వేయాలి.
ఎందుకు: రెక్కపురుగులు (ముఖ్యంగా ఏర్రగొంగలు పురుగు) మంటలు ఆకర్షించబడి అందులో పడి చనిపోతాయి.
ఎలా: రైతులు ఎవరి పొలాల్లో వారు మంటలు పెట్టాలి..
3. విత్తన శుద్ది:
ఎప్పుడు: విత్తనా లు నాటేముందు మరియు నారు నాటే ముందు.
ఎందుకు: విత్తనాలు పురుగుల తాకిడి తట్టుకోవటానికి /తెగుళ్ళును నివారించటానికి.
ఎలా: బీజామృతం లో గానీ లేద అవు మూత్రంతో కాని విత్తన శుద్ధి చేయాలి.
4. జిగురు పూసిన పసుపు, తెలుపు పళ్లలు:
ఎప్పుడు: ఈ పళ్ళలను వరినాట్లు వేసిన తరవాత మరియు కూరగాయలు మరియు మెట్ట పంటల లో విత్తనాలు మొలకె త్తిన తరువాత పంటల్లో పెట్టాలి.
ఎందుకు: చిన్న చిన్న రసం పీల్చే పురుగులు యొక్క ఉద్ధృతిని తెలుసుకోవటానికి మరియు వాటిని నివారించటానికి దోహదపడుతుంది.
ఎలా: పసుపు , తెలుపు పళ్లులకు గ్రీస్ లేదా ఆముదం పూసి మొక్కలు కన్నా కొంచెం ఎత్తులో పెట్టుకోవాలి.
Also Read: 10వ తరగతి డ్రాపౌట్ కానీ పద్మశ్రీ !
5. పక్షి స్థావరాలు:
ఎప్పుడు: వరి లో నాట్లు వేసిన 10-15. రోజుల తరువాత ,మెట్ట పంటలలో విత్తనాల మొలకెత్తిన 15-20 రోజుల తరువాత పక్షి స్థావరాలు పెట్టాలి.
ఎందుకు: గొంగళి పురుగు (శత్రు) పక్షు ఏరుకొని తినడం వలన పురుగు ఉధృతి తగ్గుతుంది.
ఎలా: ఎకరానికి 15 -20 పంగాల కర్రలు (పక్షి స్థావరాలు)ను పంట కంటే కొంచం ఎత్తులో పెట్టాలి.
జాగ్రత్తలు: కంకి ఏర్పడిన తరువాత లేదు గింజ కట్టే దశలో పక్షి స్థావరాలు తొలగించాలి.
6. రక్షక పంటలు సరిహద్దు పంటలు:
ఎప్పుడు: విత్తనాలు చల్లడానికి 7-10 రోజులనుండి జొన్న మొక్కజొన్న మొదలగు రక్షక పంటల విత్తనాలు చల్లుకోవాలి.
ఎందుకు: పురుగులు , తెగుళ్ళు వ్యాప్తిని నివారించటానికి మరియు మిత్రా పురుగులకు స్థావరాలుగా ఉపయోగపడుతాయి.
ఎలా: పంటల చుట్టూ జొన్న, మొక్కజొన్న విత్తనాలను 3-4 వరుసలలో చల్లుకోవాలి.
7. లింగాకర్షక బుట్టలు:
ఎప్పుడు: ఏ పంట అయన పూత దశలో, వరి లో అయితే నాట్లు వేసిన నెల రోజుల తరువాత
ఎందుకు: వరిలో కాండం తొలిచే పురుగు, వంగాలో తలనాత్త పురుగు , అపరాలలో శనగపచ్చ పురుగు, మిరపలో పొగాకు లాద్దే పురుగు నివారించటానికి .
ఎలా: ఎకరాకు 10-15 లింగకర్షిక బుట్టలను పొలం అంత విస్తరించేట్లు పెట్టాలి.
8:ఎర పంట:
ఎప్పుడు: ముఖ్య పంట విత్తనాలు చల్లేటపుడు బంతి , ఆముదం మో|| పురుగు గుడ్లను ఎరా పంటల ఆకుల పై పెడతాయ్ వాటిని నాశనం చేయడం ద్వారా పురుగుల ఉద్దృతిని నివారించవచ్చు
ఎలా: పంట నలుమూలలా ఎరా పంటలు ఉండేట్లు విత్తానాలు చల్లుకోవాలి.
9. కొసలు తుంచి నాటడం:
ఎప్పుడు: వరి లో నాట్లు వేసేముందు
ఎందుకు: కాండం తొలిచే పురుగు నివారణకు
ఎలా: నాతేముందు కొనను తుంచలి
10. కాలి బాటలు:
ఎప్పుడు: నాట్లు వేసే సమయంలో
ఎందుకు: దోమ పాటు నియంత్రించడానికి
ఎలా: ప్రతి 2మీ.లకు 20సేం. మీ. కాలి బాటలు వదలాలి.
Also Read: సేంద్రియ వ్యవసాయంతో వరిలో అధిక దిగుబడి సాధించిన మహిళా రైతు