మన వ్యవసాయంసేంద్రియ వ్యవసాయం

Tholakari Suggestions: తొలకరి -సలహాలు-సూచనలు

0
Tholakari
Tholakari

Tholakari Suggestions: ఖరీఫ్‌ 2022-2023 త్వరలోనే మొదలవుతుంది అందువలన రైతులు గత అనుభవాలను, ఆర్థిక, వ్యవసాయ వనరులను దృష్టిలో ఉంచుకొని గతంలో చేసిన పొరపాట్లు తిరిగి చేయకుండా ఈ తొలకరికి సరైన సన్నాహాలు చేసుకున్నట్లయితే లాభాలు పొందడం జరుగుతుంది. ముందుగా పంటలు, మరియు వాటి రకాలు ఎన్నుకోవడంలో రైతులు జాగ్రత్త చూపాలి మనకున్న నేల రకం, నీటి సదుపాయం, మన పెట్టుబడి, ఇతర కుటుంబ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పంటను ఎంపిక చేసుకోవాలి. రైతులు ముఖ్యంగా తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే వ్యవసాయ ప్రణాళికను వారి అనుగుణంగా తయారు చేసుకోవాలి. ప్రతి సారి వేరే వాళ్లను అనుసరించరాదు కొన్ని దీర్ఘకాలిక స్వల్పకాలిక ఆదాయ వనరులను సృష్టించే విధంగా ఉండాలి.

Tholakari Suggestions

Tholakari Suggestions

Also Read: Timber Plantations: లాభసాటిగా కలప మొక్కల పెంపకం.!

. ముందుగానే నేల సారవంతన్ని  బాగా అభివృద్ధి చేయాలి

. వీలైనంతవరకూ చెరువు మట్టిని పంట పొలాలకు తోలుకోవాలి

. పశువుల ఎరువు లేదా కోళ్ల ఎరువు లేదా గొర్రెలు ఎరువును వ్యవసాయంలో వాడుకోవాలి

. ఒకటి లేదా రెండు నీటి తడులు ఇచ్చే అవకాశం ఉన్నచోట వేసవిలో పచ్చిరొట్ట ఎరువులు అనగా జీలుగా,పిల్లిపెసర,కట్టెజనుము లాంటి పంటలు పూత దశకు చేరుకునే ముందు రోటవేటర్‌ సహాయంతో నేలను కలియదున్నాలి

. స్థూల పోషకాలు మాత్రమే కాకుండా సూక్ష్మ పోషకాలను సంబంధించిన ఎరువులను కూడా నెలలో వేయాలి

. పంటల్లో మన పరిస్థితులకు అనువైన రకాలను అలాగే మన ప్రాంతంలో ఆశించే చీడపీడలను తట్టుకునే రకాలను ఎంచుకోవాలి

. ఎండాకాలంలో మట్టి నమూనా పరీక్షలు చేయించాలి

. వాతావరణ సూచనలు, భూగర్భజలాల వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకొని వాటికి అనువైన పంటలను సాగు చేయాలి

. తరచుగా కిసాన్‌ కాల్‌ సెంటర్‌ లేదా మండల వ్యవసాయ అధికారి లేదా ఎరువాక  కేంద్రాలను సంప్రదీచవలేను

. ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైతు సమన్వయ సమితులు సహాయాన్ని మార్కెటింగ్‌  గిడ్డంగులు మరియు పంట రుణాల వంటి వాటిని రైతుకు వినియోగించుకోవాలి

. రైతులు ముఖ్యంగా విత్తనాలు అధీకృత డీలర్లు దగ్గరే కొనాలి అలాగే రసీదు తీసుకుని  భద్రపరుచుకోవాలి

. సమగ్ర సుస్థిర వ్యవసాయం లో భాగంగా పందిరి కూరగాయలు, పెరటి కోళ్ళు పెంపకం పాడి గేదెల పెంపకం మొదలైనవి చేపట్టాలి.

పంటల ఎన్నిక:
ఏక  పంటకు  బదులుగా  బహుళ పంటల పద్ధతిని ఎన్నుకోవాలి. దీర్ఘకాలిక పంటలకు బదులుగా రెండు నుండి మూడు స్వల్పకాలిక  పంటలు తక్కువ పెట్టుబడి అవసరం అనుకున్న పంటలు ఎన్నుకోవాలి.  అంతర పంటల సాగుకు  ప్రాధాన్యమివ్వాలి. పంటల  మార్పిడి లేదా రకాల మార్పిడి చేయాలి. ఈ విధంగా రైతులు సరైన ప్రణాళిక ఖరీఫ్‌కు ముందుగా రూపొందించుకొని పంటలపై పెట్టుబడిని తగ్గించుకొని పంటల ఉత్పత్తి, ఉత్పాదకతను పెంచుకుని వ్యవసాయంతో పాటు వ్యవసాయ అనుబంధరంగాలపై కూడా దృష్టిని సాధించి వ్యవసాయాన్ని ఖరీఫ్‌లో  పండగలా చేసుకోవాలి.

డా.పి. అమర జ్యోతి, డా.బి.మౌనిక, డా.జి. నవీన్‌ కుమార్‌, డా.డి. చిన్నం నాయుడు
కృషి విజ్ణాన కేంద్రం, ఆమదాలవలస, శ్రీకాకుళం.

Also Read: Green Manure Cultivation: పచ్చి రొట్ట పైర్లసాగుతో భూమికి సారం- రైతుకు లాభం

Leave Your Comments

Soil Testing: భూసార పరీక్ష గురించి సందేహాలు- సలహాలు.!

Previous article

Silage: పచ్చిమేతను పాతర (సైలేజి) వేసుకోవడం ఎలా?

Next article

You may also like