Organic Farming Certificate Courses
- స్వయం సేంద్రీయ వ్యవసాయం మరియు ధృవీకరణ
ఎటువంటి రసాయన ఎరువులు లేకుండా బయోఫెర్టిలైజర్‌లను వినియోగించి సేంద్రియ వ్యవసాయం గురించి నేర్పిస్తారు . దీని వల్ల రైతులు ఆర్ధికంగా ఎలా ఎదుగుతారు అన్న విషయాలపై చర్చిస్తారు.
కోర్సు వ్యవధి: 8 వారాలు
మోడ్: ఆన్‌లైన్
సర్టిఫికేషన్: పూర్తయిన తర్వాత మీరు పార్టిసిపేషన్ సర్టిఫికేట్ అందుకుంటారు
2. ఆర్గానిక్ కంటైనర్ గార్డెనింగ్, ది ఇండియన్ వే
ఈ కోర్సులో సేంద్రీయ వ్యవసాయం, కంటైనర్ గార్డెనింగ్ గురించి విశ్లేషిస్తారు. తోటను ప్రారంభించే ముందు పరిగణించవలసిన విషయాల గురించి వివరిస్తారు. అదేవిధంగా కంటైనర్‌లను ఎలా సిద్ధం చేయాలి, కుండీలో మట్టిని కలపడం మరియు సేంద్రీయ ఎరువులు తయారు చేయడం, అలాగే కంపోస్టింగ్, తెగులు నిర్వహణ గురించి సమగ్రం వివరిస్తారు.
కోర్సు వ్యవధి: 2 గంటల వీడియో ఆన్ కమాండ్
మోడ్: ఆన్‌లైన్
సర్టిఫికేషన్: పూర్తయిన తర్వాత మీరు పార్టిసిపేషన్ సర్టిఫికేట్ అందుకుంటారు
3. IGNOU నుండి సేంద్రీయ వ్యవసాయంలో సర్టిఫికేట్
ఈ కార్యక్రమం APEDA, భారత ప్రభుత్వం సహాయంతో నడుస్తున్నది. రసాయన ఎరువులు మరియు పురుగుమందులు, నేల జీవశక్తి గురించి సమాచారం అందుతుంది.
కోర్సు వ్యవధి: 6 నెలలు
మోడ్: ఓపెన్ డిస్టెన్స్ లెర్నింగ్
అవసరాలు: కనీసం 12వ తరగతి ఉత్తీర్ణత
4. NPTEL- స్థిరత్వం కోసం సేంద్రీయ వ్యవసాయం
కోర్సు వ్యవధి: 8 వారాలు
మోడ్: ఆన్‌లైన్
సర్టిఫికేషన్: ఈ కోర్సు పూర్తయిన తర్వాత మీరు సర్టిఫికేట్ అందుకుంటారు
5. శ్రీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ ట్రస్ట్ నుండి ఆర్గానిక్ ఫార్మింగ్ సర్టిఫికేట్
ఈ కేంద్రం 100 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఇది బెంగుళూరు ఆశ్రమంలోని ఆర్ట్ ఆఫ్ లివింగ్ లో అద్భుతమైన క్యాంపస్. ఇది ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణగా కూడా ఉంది. ఇది నాలెడ్జ్ మరియు ఆధ్యాత్మికతకు కేంద్రం. సురక్షితమైన ఆహారాన్ని ప్రోత్సహించడానికి ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరూ ఈ కోర్సును తీసుకోవాలి. గ్రామీణ యువత, సీనియర్ హైస్కూల్ గ్రాడ్యుయేట్లు మరియు భావి సేంద్రీయ రైతులకు శిక్షణ ఇవ్వబడును.
కోర్సు వ్యవధి: 6 నెలల నుండి 2 సంవత్సరాల వరకు
మోడ్: డిస్టెన్స్ మోడ్
అవసరాలు: 10+2