ఉద్యానశోభమన వ్యవసాయం

Nutrient Management in Mango: మామిడి పంట లో ఎరువుల యాజమాన్యం.!

0
Nutrient Management in Mango
Nutrient Management in Mango

Nutrient Management in Mango: మన రాష్ట్రంలో మామిడి షుమారుగా 7,64,495 ఎకరాల విస్తీర్ణంలో సాగుచేయబడుతూ 24,45,824 టన్నుల మామిడి పండ్లు ఉత్పత్తి చేయబడుతుంది. మామిడిని ప్రధానంగా కృష్ణా, ఖమ్మం, విజయనగరం, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, శ్రీకాకుళం, కరీంనగర్‌, విశాఖపట్నం, చిత్తూరు, కడప, అదిలాబాదు మరియు నల్లగొండ జిల్లాల్లో విస్తారంగా సాగుచేస్తారు.  దేశపు ఉత్పత్తిలో షుమారు 24 శాతం వాటా మన రాష్ట్రానిదే.

Nutrient Management in Mango

Nutrient Management in Mango

Also Read: Equipment’s for mango harvesting: మామిడి కాయల్ని కోసే కొన్ని పరికరాలు

ఎరువుల యాజమాన్యం:

తక్కువ వర్షపాతం గల ప్రదేశాల్లో ఎరువులను వర్షకాలం మొదట్లలోనూ రెండవసారి వర్షాకాలం చివర్లోనూ వేయాలి. వర్షపాతం ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో వర్షాకాలం చివర్లో వేసుకోవాలి. తేలిక పాటి భూముల్లో తగినంత చెరువు మట్టిగాని, ఎర్రమన్నుగాని కంపోస్ట్ గాని వేయాలి. ఒక్కో మొక్కకు మొదటి సంవత్సరం 100 గ్రాముల నత్రజని, 100 గ్రాముల భాస్వరం, 100 గ్రాముల పొటాష్ నిచ్చే ఎరువులు వేయాలి. నత్రజనిని 50% పశువుల ఎరువుల రూపంలో అందించాలి. మిగిలిన 50% రసాయనిక ఎరువుల రూపంలో అందించాలి. పెద్ద చెట్లకు నత్రజని ఒకసారి సెప్టెంబర్లో రెండవసారి వేసుకోవాలి. కాపుకు రాని తోటల్లో సిఫారసు చేసిన ఎరువులను 2 సమపాళ్ళుగా విభజించి జూలైలో ఒకసారి విభజించి సెప్టెంబర్లో రెండవసారి వేసుకోవాలి. కాపుకు రాని తోటల్లో సిఫారసు చేసిన ఎరువులను 2-3 నెలలకు ఒకసారి వేయాలి. మామిడి కోత అయిన వెంటనే సిఫారసు చేసిన 2/ 3 వంతు ఎరువులు వేయాలి. మిగతా 1/3 పై భాగం ఎరువులను కాయ ఎదుగుదల దశలో (ఫిబ్రవరి-మార్చి) వేయాలి.

Nutrient Management in Mango Crop

Nutrient Management in Mango Crop

సాధారణంగా మొక్కల ఎదుగుదల దశలో వివిధ సూక్ష్మ పోషక పదార్థాల లోప నివారణకు లీటరు నీటికి 5 గ్రాముల జింక్ సల్ఫేట్ +2.5 గ్రాముల ఫెర్రస్ సల్ఫేట్ + 2 గ్రాముల బోరాన్ + 2 గ్రాముల కాపర్ సల్ఫేట్ కల్పి సంవత్సరానికి 2 లేదా 3 సార్లు (జూన్-జూలై సెప్టెంబర్-అక్టోబర్, డిసెంబర్-జనవరి నెలల్లో పిచికారి లేదా మొక్కలు కొత్త చిగుళ్ళు తొడిగినపుడు 2 లేదా 3 సార్లు పిచికారి చేయాలి. పత్రశ్లేషణ ద్వారా అక్టోబర్ మాసంలో పోషక విలువలను బట్టి పొటాషియం నైట్రేట్ 10 గ్రాముల చొప్పున 1 లీటరు నీటిలో కలిపి చెట్లపై పిచికారి చేయాలి.

Also Read: Bud and fruit dropping in trees: కాయ, పిందె రాలుట కు కారణాలు మరియు అరికట్టే పద్ధతులు

Leave Your Comments

C:N Ratio Importance: మొక్కల పెరుగుదల లో కర్బన నత్రజని నిష్పత్తి పాత్ర.!

Previous article

Principles of Raising forest Nursery: అటవీ మొక్కల నారుమళ్ళ పెంపకంలో సూత్రాలు

Next article

You may also like