Neem seed వివిధ రకాల వృక్ష సంబంధ కషాయాలు వాడటం ద్వారా పురుగుల బారి నుండి పంటలను కాపాడుకోవచ్చు. వీటి వినియోగం వల్ల పర్యావరణానికి హాని ఉండదు. మిత్ర పురుగులకు నష్టం ఉండదు. వృక్ష సంబంధ కషాయాలు వాడటం వల్ల పు రుగుల జీవిత చక్రంలోని వివిధ దశలోను నిర్మూలించవచ్చు.
తయారు చేసే పద్ధతి :
నీడలో బాగా ఎండిన 5 కిలోల వేపగింజలను 10 లీటర్ల నీళ్ళలో 4 గంటలు నానబెట్టాలి. ఆ తరువాత వేపగింజల పప్పు ను మెత్తగా రుబ్బి ఒక మూటలో కట్టి కనీసం 10-12 గంటలు నానబెట్టాలి. ఈ విధంగా నానబెట్టిన తర్వాత ఆ నీటిలో మూటను ముంచి పట్టుకొని 15-20 నిమిషాల పాటు పిండుతూ ద్రావణం తీయాలి. ఈ ద్రావణం ఘాటైన వేప వాసనతో పాల లాగా ఉంటు ంది. ఈ ద్రావణాన్ని పలుచటి గుడ్డలో వడపోసి 100 గ్రాముల సబ్బుపొడి కలపాలి. ఈ విధంగా తయారయిన ద్రావణాన్ని 100 లీటర్ల నీటిలో కలిపి ఒక ఎకరం పొలంలో సాయంత్రం పూట పిచికారి చేయాలి. పంట దశను బట్టి, పురుగుల ఉధృతిని బట్టి వేప కషాయం మోతాదు పెంచుకోవాలి.
నివారించబడే పురుగులు :
రసం పీల్చు పురుగులు, ఆకు ముడత పురుగులు, ఆకు తినే పురుగులు, శనగపచ్చ పురుగు, పొగాకు లద్దె పురుగు.
పనిచేసే విధానం :
- ఈ కషాయాన్ని గుడ్లు దశలో పిచికారి చేస్తే గుడ్లు పొదగబడకుండా చెడిపోతాయి.
- లార్వా దశలో పిచికారి చేస్తే పురుగు ఆహారం తినడం మానివేసి నెమ్మదిగా చనిపోతుంది. అంతే కాకుండా లార్వా 5 నుండి ప్యూపా దశ అభివృద్ధి చెందకుండా చేస్తుంది.
- కోశస్థ దశ నుండి రెక్కల పురుగు విడుదల కాకుండా కూడా చేస్తుంది.
లాభాలు
- పంట పూత దశలో ఈ కషాయం పిచికారి చేస్తే తల్లి పురుగులు వేప వాసనకి పంటపై గుడ్లు పెట్టవు.
- వేప ద్రావణం చల్లిన ఆకులు చేదుగా ఉండటం వలన లద్దె పురుగులు ఆకులను తినలేవు.
- ఈ ద్రావణం పురుగు గుడ్డు దశమీద, లద్దె పురుగు దశమీద బాగా పనిచేస్తుంది. వేపలో ఉండేటటువంటి “అజాడిరెక్టిన్ ” అనే మూల పదార్ధం పురుగు జీవిత దశలపై ప్రభావాన్ని చూపిస్తుంది.
- ఈ ద్రావణం మానవుల ఆరోగ్యానికి, మిత్ర పురుగులకు, పర్యావరణానికి హాని చేయదు.
ఈ ద్రావణాన్ని అన్ని పంటలలో వాడవచ్చు. వరి పంటలో 1-2 సార్లు మిరప, ప్రత్తి వంటి పంటలలో పురుగు తీవ్రతను బట్టి 3-4 సార్లు వేరుశనగ, ప్రొద్దు తిరుగుడు, కూరగాయ పంటల్లో 1-2 సార్లు వాడవ