Natural Farming: సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు అమలు చేస్తున్న పథకం కింద సింథటిక్ రసాయన ఎరువుల వాడకాన్ని నిషేధిస్తున్నట్లు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తెలిపారు. బదులుగా, బయోమాస్ మల్చింగ్, ఆవు పేడ-మూత్ర సూత్రీకరణలు మరియు ఇతర మొక్కల ఆధారిత ఎరువులను వ్యవసాయానికి ఉపయోగిస్తారు.అదే సమయంలో సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి నడుస్తున్న BPKP పథకం కింద కేంద్ర ప్రభుత్వం రైతులకు హెక్టారుకు 12200 రూపాయల చొప్పున 3 సంవత్సరాలకు ఆర్థిక సహాయం అందిస్తుంది.
ఇకపోతే భవిష్యత్తు సేంద్రియ వ్యవసాయానిదే. మన సంప్రదాయ వ్యవసాయ విధానాలపై రైతులు దృష్టిపెట్టాలి. భూసారాన్ని కాపాడుకుంటూ..సంప్రదాయ పద్ధతుల్లో చక్కటి ఫలితాలు సాధిస్తున్న రైతులను స్ఫూర్తిగా తీసుకోవాలి. రైతు సమస్యల పరిష్కారానికి ప్రభుత్వాలు చొరవ చూపాలి అప్పుడే అద్భుత ఫలితాలను చూడవచ్చు. ఇక వ్యవసాయాన్ని లాభసాటిగా చేయడమే పరిశోధనల అంతిమ లక్ష్యం కావాలి.
సహజ వ్యవసాయం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని మెరుగైన ఉత్పత్తులను తీసుకురావచ్చు. కేంద్ర బడ్జెట్ 2022లో దేశవ్యాప్తంగా రసాయన రహిత సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని ప్రభుత్వం ప్రకటించింది. గంగా నది వెంబడి ఐదు కిలోమీటర్ల పరిధిలోని పొలాల కారిడార్‌తో ఇది ప్రారంభం కానుంది. కాగా వ్యవసాయరంగంలో మార్పులతోపాటు పౌష్టికాహారాన్ని ఇచ్చే పంటలపైనా దృష్టిసారించాల్సిన ఆవశ్యత ఎంతైనా ఉంది.
సహజసిద్ధంగా ఏ రాష్ట్రంలో ఎంత విస్తీర్ణంలో సాగు చేస్తున్నారో తెలుసుకోండి
రాష్ట్రం హెక్టారులో విస్తీర్ణం లక్ష రూపాయల్లో నిధులు కేటాయించారు
ఆంధ్రప్రదేశ్ 100000 750.00
ఛత్తీస్‌గఢ్ 85000 1352.52
కేరళ 84000 1336.60
హిమాచల్ ప్రదేశ్ 12000 286.42
జార్ఖండ్ 3400 54.10
ఒడిశా 24000 381.89
మధ్యప్రదేశ్ 99000 787.64
తమిళనాడు 2000 31.82
మొత్తం 409400 4980.99