పుట్టగొడుగులు అనేవి వృక్ష రాజ్యంలో ఫంగై జాతికి చెందిన మొక్కలు. కాని పత్ర హరితం లేకపోవడం ఇతర మొక్కలు ఆకుపచ్చగా కాకుండా తెల్లగా ఉంటాయి. ఈ పుట్టగొడుగులలో ఎన్నో రకాలు ఉన్నాయి. ప్రకృతిలో మనకు లభించే పుట్టగొడుగులలో కొన్ని తినదగినవి కాగా మరికొన్ని విషపూరితమైనవి. మన రాష్ట్రంలో చిన్నమరియు సన్నకారు రైతులు తక్కువ ఖర్చుతో తేలిగ్గా పెంచుకోదగిన పుట్టగొడుగులు,పాల పుట్టగొడుగులు మరియు వరిగడ్డి పుట్టగొడుగులు. పుట్టగొడుగులలో అనేక పోషక విలువలు ఉన్నాయి. ముఖ్యంగా మాంసకృత్తులు,పీచు పదార్ధాలు మరియు అమైనో ఆమ్లాలు అధికంగా ఉండటం వలన వీటి పెంపకము ప్రాధాన్యతను సంతరించుకుంటూ ఉన్నది.
Also Read : యాసంగిలో – వేరుశనగ పంట యాజమాన్యం
పుట్టగొడుగుల ప్రాముఖ్యత :
-
వ్యవసాయం నుండి వచ్చిన వ్యర్ధ పదార్థాలతో పుట్టగొడుగులను చాలా తేలికగా తక్కువ సమయంలో పెంచవచ్చు.
-
పుట్టగొడుగుల సారవంతమైన నేల మరియు సూర్యరశ్మి లేకపోయినా పెరుగుతాయి.
-
పుట్టగొడుగుల పెంపకం వలన గ్రామీణ ప్రజలకు ఉపాధి అవకాశాలు కలుగుతాయి.
-
పుట్ట గొడుగులలో గర్భిణీ స్త్రీలకు అవసరమయ్యే ఫోలిక్ యాసిడ్ అధికంగా ఉంటుంది. అందువలన రక్తహీనతను నివారిస్తుంది.
-
వీటిలో 80-90 శాతం నీరు, మరియు 8-10 % శాతం పీచు పదార్ధం ఉండటం వలన అధిక రక్తపోటు మరియు ఇతర జీర్ణ సమస్యలతో బాధపడేవారికి మంచి ఆహారం.
పోషక విలువల పట్టిక
పుట్ట గొడుగు రకం | పిండి పదార్ధం (గ్రా/) | పీచు (గ్రా) | ప్రోటీన్ (గ్రా) | కొవ్వు (గ్రా)
|
శక్తి (కి/ కె) |
ముత్యపు చిప్ప పుట్ట గొడుగులు | 57.60 | 8.70 | 30.40 | 2.20 | 265 |
పాల పుట్టగొడుగులు | 64.26 | 3.40 | 17.69 | 4.10 | 391 |
వరి గడ్డి పుట్టగొడుగులు | 54.80 | 37.50 | 37.50 | 2.60 | 305 |
మటన్ పుట్ట గొడుగులు | 46.17 | 20.90 | 33.48 | 3.10 | 499 |
డా. కె.భాగ్యలక్ష్మి , గృహ విజ్ఞాన శాస్త్రవేత్త ,డా .సి.హెచ్ .సునీత , ఉద్యాన వన శాస్త్రవేత్త , కె.వి.కె ఆముదాలవలస
Also Read : జాతీయ వ్యవసాయ విద్యా దినోత్సవం…