మన వ్యవసాయంరైతులు

Success story: బహుళపంట సాగుతో మేలు… బంగారం పండిస్తున్న ఆదర్శ రైతు బసవరాజు

1

Multiple cropping నేటి తరంలో రైతులు కూడా అద్బుతాలు సృష్టిస్తున్నారు. వారసత్వంగా వచ్చిన భూమిలో బంగారాన్ని పండిస్తున్నారు. వారసత్వంగా వచ్చిన భూమిలో వివిద రకాల పంటలు సాగు చేస్తూ అందరికి ఆదర్శంగా నిలుస్తున్నాడో రైతు.

పకృతి సహకరించి, వాతావరణం అనుకూలిస్తే రైతులు అద్బుతాలు సాధిస్తాడంటున్నారు బసవరాజు అనే రైతు.

కర్నూలు జిల్లా కణేకల్లు మండలం గోపలాపురంకు చెందిన బసవరాజు అనే రైతు వారసత్వంగా వచ్చిన భూమితో ప్రస్తుతం వంద ఎకరాల వరకు భూమిని సంపాధించి వాటిలో వివిధ రకాల పంటలు సాగు చేస్తూ మంచి లాభాలను ఆర్జిస్తున్నాడు.

గోపలాపురంలో బసవరాజుకు వంద ఎకరాల పొలం ఉంది. వీటిలో బత్తాయి, దిల్లీ వెరైటి కళింగర, కర్బూజ, బొప్పాయితోపాటు వివిధ వెరైటీల పంటలు సాగు చేస్తున్నాడు. సాగు చేయడమే కాదు వేసిన ప్రతిపంటలోనూ లాభాలు వచ్చే విధంగా ప్రణాళికబద్దంగా వ్యవసాయం చేస్తున్నాడు. దీంతో రైతు బసవరాజు పంట పండింది. అయితే ఏ పంట వేసినా ముందుగానే వాతావరణ పరిస్థితులతోపాటు, మార్కెట్ మీద కూడా అంచనా ఉండాలంటున్నాడు ఈ రైతు. ఉన్న భూమిలో అనేక రకాల పంటలు సాగు చేస్తూ అందరికి ఆదర్శంగా నిలుస్తున్నాడు.

అన్నిఅనుకూలిస్తే రైతులు అన్ని విదాల బాగుంటారు అని అంటున్నారు బసవరాజు. కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో రైతులందరూ చాలా దెబ్బతిన్నారని, ప్రభుత్వం కూడా రైతులకు మార్కెటింగ్ పై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. మొదట్లో దానిమ్మ పంట సాగు చేసి వాటిని ఎక్స్పోర్ట్ చేసినపుడు కూడా అందరూ ఆశ్చర్యపోయారని, కానీ వాటిని సాగు చేసేందుకు అవసరమైన మెళుకవలు , జాగ్రత్తలు తీసుకొనే విషయంలో హర్టికల్చర్ అధికారులు బాగా సహకరిస్తున్నారన్నారు.

ప్రస్తుతం బ్యాడిగ మిర్చి మాత్రం పూర్తిగా నష్టపోయినట్లు బసవరాజు తెలిపారు. అధిక వర్షాలు కురవడంతో ఈసారి బ్యాడిగ మిర్చి బాగా నష్టం వచ్చిందన్నారు. రైతులు కూడా ఏదో ఒక పంటలో లాభం వచ్చిందని అందరూ అదే పంటను సాగు చేయకుండా, డిపరెంట్ గా ఆలోచించి పంటలు సాగు చేయాలంటున్నారు బసవరాజు. ఇటీవలే బసవరాజుకు ఉత్తమ రైతు అవార్డుతో సత్కరించింది ప్రభుత్వం.

ఏ పంటలను సాగు చేసిన వాటికి సంబంధించి పంట సాగులో మెళుకవళు, మార్కెటింగ్ సదుపాయంతోపాటు వీలైనంత వరకు సేంద్రీయ ఎరువుల సాగు కూడా కీలకమన్నారు బసవరాజు. పంటలన్నీ సక్సెస్ అయ్యే అవకాశాలు తక్కువని, కానీ వివిధ రకాల పంటలు సాగు చేస్తున్న సమయంలో కనీసం రెండు పంటలైనా బయటకు పడేస్తున్నాయుంటన్నారు బసవరాజు.

సక్సెస్ వెనుక అనేక అపజయాలు కూడా ఉంటాయన్నది, రైతుల జీవితం అంత బాగేమి లేదంటున్నారు బసవరాజు. చిన్న, సన్నకారు రైతలు పరిస్థితి దయనీంగా ఉందంటున్నారు బసవరాజు. అందుకే చిన్న రైతులు ఏ పంట వేసినా పలు జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు

Leave Your Comments

Benefits from Mushroom: పుట్టగొడుగులతో పుట్టెడు లాభాలు

Previous article

Farmer Success story: తక్కువ సమయం లో అధిక దిగుబడి సాధిస్తున్న రైతు

Next article

You may also like