మత్స్య పరిశ్రమమన వ్యవసాయం

Mud Crab Farming: పీత పిల్లలను నీటిగుంటలలో పెంచుతున్నారా ఒక్కసారి వీటిని గమనించండి

0
Mud Crab
Mud Crab

Mud Crab Farming: మాంసాహారంగా పీతలను చాలామంది ఇష్టపడతారు. ముఖ్యంగా వీటికి విదేశీ మార్కెట్లో మంచి గిరాకీ వుంది. అంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల తీరప్రాంతాలలో, వాణిజ్యస్థాయిలో పీతల పెంపకం బాగా పుంజుకుంటున్నది.

Mud Crab Farming

Mud Crab Farming

  • కేవలం 0.025-0.2 హెక్టార్ల విస్తీర్ణం కలిగి, 1 నుంచి 1.5 మీటర్ల లోతున నీరుండే నీటి గుంటలను ఉపయోగించాలి.
  • చిన్న చిన్న అలల నీటి గుంటలను పీతలను బాగా పెద్దవిగా పెంచడానికి ఉపయోగించవచ్చు.
  • లేత పెంకుగల పీత పిల్లలను గుంటలో వదలడానికి ముందుగా, గుంటను తగిన విధంగా సిద్ధంచేసుకోవాలి. గుంటలోని నీటిని తొలగించి, గుంటను ఎండనిచ్చి, గుంట అడుగున తగినంత సున్నం చల్లి సిద్ధపరచాలి.
  • గుంట గట్టుకు రంధ్రాలుగాని, చీలికలు గాని లేకుండా జాగ్రత్త వహించాలి. పీతలు సహజంగా తూములగుండా తప్పించుకోవాలని చూస్తుంటాయి. అందువల్ల తూము చుట్టూ కట్టుదిట్టం చేసుకోవాలి. నీరు గుంటలోకి వచ్చే చోట, గుంట గట్టు లోపలివైపున తడికలతో గట్టును మరింత గట్టిపరచాలి .
Mud Crab

Mud Crab

  • ఇంతేకాకుండా, పీతలు గుంటనుంచి తప్పించుకు పోకుండా గట్టుచుట్టూ వెదురు గడలు పాతి, వాటికి వలలు కట్టాలి. ఆ వలలు గుంట లోపలికే వంగి వుండాలి.
  • స్థానిక చేపల వ్యాపారుల నుంచో / పీతల వ్యాపారుల నుంచో మృదువైన పై పెంకు పీత పిల్లలను కొనుగోలుచేసి, వాటి సైజుకు తగినట్టుగా, గుంటలో చదరపు మీటరు విస్తీర్ణానికి 0.5-2 పీత పిల్లల వంతున, ఉదయం పూట వదలాలి.
  • 550 గ్రాములు, అంతకు మించి బరువు కలిగిన పీతలకు మార్కెట్లో గిరాకీ ఎక్కువ, అందువల్ల ఈ సైజు పీతలను పెంచడం మంచిది. ఈ సైజువైతే, గుంటలో చదరపు మీటరుకు ఒక పీత మించకుండా జాగ్రత్తపడాలి.
  • గుంటవున్న ప్రదేశాన్ని, నీటి లభ్యతను దృష్టిలో వుంచుకుని, గుంటలో పీతలను వదులుతూ, పైపెంకు గట్టిపడిన పీతలను గుంటనుంచితొలగిస్తూ, మొత్తంమీద, పీతలను బాగా పెద్దవిగా పెంచే ప్రక్రియను సంవత్సరానికి 6-8 సార్లు సాగించవచ్చు.
  • గుంట పెద్దదైతే, దానిని కొన్ని అరలుగా విభజించుకుని, ఒక్కొక్క సైజు పీతలను ఒక్కొక్క అరలో పెంచవచ్చు. దాణాలో హెచ్చుతగ్గులను పాటించడానికి, సైజునుబట్టి పీతలను అమ్మకానికి తీయడానికి, నిర్వహణకు మరింత సులువుగా వుంటుంది.

Also Read:  ఈ పీతల రక్తం లీటర్ ధర రూ.12 లక్షలపైనే

Mud Crabs

Mud Crabs

  • గుంటలో పీతలను వదిలే విషయంలో, ఒకదఫాకు, మరో దఫాకు మధ్య వ్యవధి ఎక్కువగా వున్నప్పుడు, ఒకరకం సైజుల పీతల నన్నిటిని ఒకే అరలో పెంచవచ్చు.
  • మగ, ఆడ పీతలను వేరువేరు అరలలో పెంచడంకూడా మంచిదే. ఇందువల్ల మగపీతల దాడులను అరికట్టడానికి వీలవుతుంది. పీతలు సేదదీరడానికి పాత టైర్లు, బుట్టలు, పెంకులవంటివి గుంటలో వుంచడం మంచిది. ఒకదానిపై ఒకటి దాడిచేయడాన్ని, చంపుకోడాన్ని కొంత తగ్గించవచ్చు.

Also Read: నర్సరీ పీతల పెంపకంలో యజమాన్యం.!

Leave Your Comments

Solapur Mandi: ఉల్లి రైతులకు తలనొప్పిగా మారిన సోలాపూర్ మార్కెట్

Previous article

Watermelon Stolen: పూణెలో 20 టన్నుల పుచ్చకాయ చోరీ.. రైతుకు లక్షల్లో నష్టం

Next article

You may also like