మన వ్యవసాయం

Crops Importance in Agriculture: వ్యవసాయంలో ఎర పంటలు, కంచె పంటల ప్రాముఖ్యత

2
Trap Crops
Trap Crops

Crops Importance in Agriculture: ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న జనాభా అవసరాలకు సరిపడా ఆహార ఉత్పత్తులను సాధించే క్రమంలో తమకు ఉన్న అనుభవంతో గాని తోటి రైతులు చేపడుతున్న యాజమాన్య పద్ధతులు చూసుకొని కొన్ని సందర్భాల్లో సిఫారసు చేసిన మోతాదుకు మించి రసాయన ఎరువులు, పురుగు మందులు వాడడం వల్ల పర్యావరణం సమతుల్యత లోపించడంతోపాటు పురుషులలో రసాయనాలను తట్టుకునే శక్తి అధికం కావడంతో పాటు సాగు ఖర్చులు పెరగడం జరుగుతుంది.

Crops Importance in Agriculture

Crops Importance in Agriculture

అంతేకాకుండా మన దేశంలో హరిత విప్లవం మొదలైన తరువాత అధిక మోతాదులో ఎరువులు వాడటం వలన పంటలను ఆశించే చీడపీడలు పెరగడం గమనించడం జరిగింది. దీనివలన రైతులు వివిధ రకాల పురుగుమందులను చీడపురుగులను నియంత్రించడానికి విచక్షణారహితంగా మరియు అవగాహన లోపంతో వినియోగిస్తున్నారు. అందువలన పురుగు మందుల ప్రభావం ఉత్పత్తుల నాణ్యతపై పర్యావరణం మీద అధికంగా ఉండటం వలన పురుగు మందులు వాడకుండా ఇతర పద్ధతుల ద్వారా నియంత్రించవలెను. సమగ్ర సస్యరక్షణ భాగంలో ఎర పంటలు, కంచె పంటలు పెంచడం ద్వారా పురుగు వల్ల మరియు పురుగు మందుల వలన కలిగే నష్టాన్ని తగ్గించుకోవచ్చు.

Also Read: Pulses Crops: పప్పుధాన్యాల పంటలలో నేల మరియు సీడ్‌బెడ్ తయారీలో మెళుకువలు

ఎర పంటలు:
కొన్ని రకాల పురుగులు కొన్ని పంటలు మాత్రమే ఎక్కువగా ఆశిస్తాయి. కావున ఆ పంటలను పురుగులు ఆకర్షించడానికి ఎరగా వాడాలి. వీటిని ఎర పంట అంటారు. ఎర పంటను ఎన్నిక చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించ వలసి ఉంటుంది. ఎర పంటను పురుగు ఉనికికి తగ్గట్టుగా ఎన్నిక చేయవలసి ఉంటుంది. ఎర పంట అనేది చీడపురుగులను ఆకర్షించేదిగా ప్రధాన పంటను అన్ని దశలలో కాపాడే విధంగా మరియు తక్కువ విస్తీర్ణంలో సాగు చేయడానికి అనువుగా ఉండాలి. ఎర పంటను వాడడం వలన పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడానికి కాకుండా పురుగు మందుల వినియోగం తగ్గించవచ్చు. ఎరపంటలను ప్రధాన పంటలో వేసినప్పుడు ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి.

ప్రధాన పంట           ఎరపంట                     ఆకర్షించబడే కీటకాలు
పత్తి                       బంతి                           శనగపచ్చ పురుగు
పత్తి                       ఆముదం                       పొగాకులద్దె పురుగు
పత్తి                       బెండ                            మచ్చల కాయతొలుచు పురుగు, పచ్చదోమ
మొక్కజొన్న             జొన్న                            కాండం తొలుచు పురుగు
క్యాబేజీ                   ఆవాలు                          డైమండ్‌బ్యాక్‌మాత్‌
టమాట                  ఆముదం                         పొగాకులద్దె పురుగు
టమాట                  బంతి                             శనగపచ్చ పురుగు
పొగాకు                   ఆముదం                        పొగాకు లద్దె పురుగు
వేరుశనగ                అలసంద                         ఎర్రగొంగళి పురుగు

కంచె పంటలు:
వీటిని రక్షక పంటలు అని కూడా అంటారు. ముఖ్యంగా వీటిని పొలంలో ముఖ్య పంటకు చుట్టూ గాని గట్టు వెంబడి గాని కొద్ది వరుసలలో వేస్తారు. ఈ పంటలు పురుగులను, శిలీంధ్ర బీజాలను ఒక పొలం నుండి ఇంకొక పొలానికి రాకుండా అడ్డుకోవడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఇవి ముఖ్య పంట కన్నా ఎత్తు పెరిగేవిగా ఉండాలి.

  • మినుము, పెసర పంటలలో మంచి పంటలను వేసి తెగుళ్ళను వ్యాప్తి చేసే తెల్ల దోమ త్రిప్స్‌ వంటి రసం పీల్చు పురుగుల ఉధృతిని వలసను నిరోధించవచ్చు.
  • వేరుశనగ పంటలో జొన్న, సజ్జ వంటి కంచె పంటలను వేయడం ద్వారా తామర పురుగుల ఉధృతి తగ్గుతుంది.
  • మిరప పంట చుట్టూ జొన్న లేక సజ్జ వంటి పంటలను వేయడం ద్వారా తామర పురుగుల వలన వ్యాప్తి చెందే వైరస్‌ తెగుళ్ళను నివారించవచ్చు.
  • ఈ విధంగా వ్యవసాయంలో రక్షక, ఎర పంటలు వేసి పురుగులు మరియు తెగుళ్ల వలన కలిగే నష్టాన్ని తగ్గించుకోవచ్చు.

డా. యస్‌. ఓం ప్రకాశ్‌, శాస్త్రవేత్త (కీటకశాస్త్రం), డా. ఎమ్‌. రాజేంద్రప్రసాద్‌, డా. ఎమ్‌. ఉమాదేవి, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం, పొలాస, జగిత్యాల

Also Read: Aerobic Rice Cultivation: ఆరుతడి పద్ధతిలో వరి సాగు

Leave Your Comments

Pulses Crops: పప్పుధాన్యాల పంటలలో నేల మరియు సీడ్‌బెడ్ తయారీలో మెళుకువలు

Previous article

Insect Management: కోకో పంటలో కీటకాల యాజమాన్యం

Next article

You may also like