మన వ్యవసాయంవ్యవసాయ వాణిజ్యం

మెంతి సాగుతో రైతులకు ఆదాయం

0
menthi-curry-cultivation-which-gives-income-to-the-farmers

భారత దేశంలో అనేక వంటకాల్లో ఉపయోగించే ఆకుకూరల్లో పుష్కలమైన పోషకాలు ఉంటాయి. అందులో మెంతి కూడా ఒకటి. వీటి దినిసులతో పాటు ఆకులను కూడా విరివిగా కూరల్లో వినియోగిస్తుంటారు. వీటి ఆకుల్లో ప్రొటీన్​, విటమిన్​ సీలు పుష్కలంగా లభిస్తాయి. మెంతులను సుగంధ ద్రవ్యాల్లోనూ ఉపయోగిస్తుంటారు. దీంతో పాటు, మలబద్దకం, అజీర్ణం వంటి సమస్యలకు వీటి మొక్కలను ఔషధంగా ఉపయోగిస్తుంటారు. క్యాన్సర్​, మధుమేహంతో పాటు టెస్టోస్టిరాన్​ హార్మోన్​ పెంపొందించి, బరువును తగ్గించేందుకు కూడా మెంతులు ఉపయోగపడతాయి.

menthi-curry-cultivation-which-gives-income-to-the-farmers

ఈ పంటను కూడా మనదేశంలోనే పుష్కలంగా పండిస్తుంటారు. ఇక్కడ నుంచే జపాన్​, శ్రీలంక, కొరియా వంటి దేశాలకు మెంతిని ఎగుమతి చేస్తుంటారు. ఉత్తరాది రాష్ట్రాలైన గుజరాత్​, రాజస్థాన్​, మహారాష్ట్రల్లో ఈ పంటను ఎక్కువగా సాగు చేస్తారు. ఇటీవల కాలంలో కూరగాయల ధరలు అధికంగా పెరుగుతున్న నేపథ్యంలో తక్కువ ధరకు లభించే ఆకు కూరలవైపు అంతా మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలోనే మార్కెట్​ల ఆకు కూరలకు మంచి డిమాండ్​ ఏర్పడింది. రైతులు కూడా ఆకుకూరల సాగు వైపు దృష్ట సారిస్తున్నారు. మన దేశంలో ప్రతి ఒక్కరూ ఈ మెంతికూర మెనూలో భాగంగా మారిపోతుంది.

అయితే, వీటిని సాగు చేయడం పెద్ద కష్టమేం కాదు. ఈ పంటతో రైతులు కూడా మంచి ఆదాయాన్ని పొందవచ్చు. వీటి విత్తనాలు విత్తన వెంటనే మొలకెత్తేలా చూసుకోవాలి. క్రమం తప్పకుండా నీళ్లు పోయాల్సి ఉంటుంది. అలాగని అతిగా నీరు పెట్టినా ప్రమాదమే.. ఎందుకంటే, అధికంగా ప్రేమ ఉంటే మొక్కలు పెరిగే అవకాశం ఉండదు.  ఆ తర్వాత ఓ వారం రోజులు గ్యాప్ ఇచ్చి.. మళ్లీ నీళ్లు పెడుతూ ఉండాలి. అలా నెల రోజుల్లోనే 4 సెంటీమీటర్ల పొడవు ఉన్న చిన్న చిన్న మొలకలు వస్తాయి. ఆ తర్వాత 15 రోజుల్లోనే మొక్కలుగా మారి కోతకు సిద్ధంగా మారిపోతాయి.

Leave Your Comments

మామిడి పూత దశలో తీసుకునే జాగ్రత్తలు…

Previous article

ఖమ్మం మిర్చి రైతుకు తీరని నష్టం

Next article

You may also like