చీడపీడల యాజమాన్యంమన వ్యవసాయం

Mechanical Methods for Pest Control: యాంత్రిక పద్ధతులు ఉపయోగించి చీడ పురుగులను ఎలా అరికట్టాలి.!

1
Pests
Pests

Mechanical Methods for Pest Control: చిన్న పరికరాలు లేక, చేతి పనిముట్లు ఉపయోగించి చీడ పురుగులు అరికట్టే పద్ధతులే యాంత్రిక పద్ధతులు.

ఎరలు:

దీపపు ఎరలు: వరినాశించు ‘కాండము తొలుచు పురుగు, దోమ పోటు పురుగు, ఉల్లికోడు పురుగులు కాంతి వంతమైన దీపాలకు ఆకర్శించ బడుతాయి. అందువలన, పొలాలలో దీపపు ఎరలు వాడినచో ఈ పురుగులను కొంత మేరకు తగ్గించ వచ్చు. అయితే ఆ ప్రాంతములోని రైతులందరు సామూహికంగా దీపపు ఎరలు వాడాలి.

మంటలు: వేరుశనగ పైరును నష్టపరిధి ఎర్ర గొంగళి పురుగు మంటలకు ఆకర్షించ బడుతుంది. అందు వలన చెత్త చెదారంతో గాని, పనికి రాని రబ్బరు టైర్లు గాని ఉపయోగించి వేరుశనగ పొలాల గట్లపై రాత్రులందు మంటలు పెడితే, రెక్కల పురుగులు ఆకర్శించబడి మంటలలో పడి చనిపోతాయి.

లింగాకర్షణ బుట్టలు: ప్రత్తికాయ తొలచు శనగపచ్చ పురుగు, పొగాకు లద్దెపురుగు, లింగాకర్షణ రసాయనాలతో కూడిన ఎరబుట్టలను పెట్టి పురుగు సంతతిని తగ్గించ వచ్చు. ఎకరాకు 4 లేదా 5 బుట్టలను పెడితే సుమారుగా 30% పురుగుల ఉధృతిని తగ్గించ వచ్చు. ఈ ఎరలకు మగ రెక్కల పురుగులు ఆకర్శింపబడి బందింప బడతాయి. అప్పుడు ఆడరెక్కల పురుగులకు సరిపడ మగ పురుగులు లేక సంయోగానికి అంతరాయం కల్గుతుంది. ఈ ఎరల వలన పురుగుల ఉనికిని కూడా అంచనా వేయవచ్చు.

Mechanical Methods for Pest Control

Mechanical Methods for Pest Control

Also Read: Ideal Tillage: మంచి విత్తన మడి కి నేలను ఎలా దున్నాలి.!

పసుపు వల్లెం ఎరలు: ఆముదం నూనె రాసిన పసుపు రంగు వల్లెం ఎరలను వాడి ప్రత్తిలో తెల్ల దోమ ఉనికిని గమనించవచ్చు.

ఏరివేయుట: పొగాకు లద్దె పురుగు తల్లులు ప్రత్తి, పొగాకు, మిరప పై గుడ్లను గుంపులు గుంపులుగా పెట్టు తుంది. ఇవి కంది బెడల వలె ఉంటుంది. కాబట్టి తేలికగా గుర్తించ వచ్చు. ముఖ్యముగా ఆకు క్రింది భాగాన్ని పరిశీలించి, గుడ్లను ఏరి నల్చివేయాలి. లేదా గ్రుడ్ల నుండి రాగానే చిన్న గొంగళి పురుగులు అదే ఆకు మీద నున్న పచ్చటి పదార్ధాన్ని గోకి ఆకును జల్లెడగా మారుస్తాయి. అలాంటి జల్లేడాకులను ఏరి నలిపి వేసిగాని లేక మందు ద్రావణం వేసిగాని, దాని సంతతిని చాలా వరకు అరి కట్టవచ్చు. అదే విధముగా కొబ్బరిలో రైనో సిరస్ బీటిల్ని ఇనుప చువ్వతో లాగి చంపవచ్చు.

విషపు ఎరలు: పొగాకు లద్దె పురుగులు పెద్దవైనపుడు పగలంతా భూమిలో దాగుకొని సాయంకాలం, రాత్రులు పైరు పైకి వచ్చి నష్ట పరుస్థాయి. అందువలన సాయం కాలం, విషంతో కూడిన తవుడు వుండలను ఎరగా వాడినచో గొంగళి పురుగులు తవుడు వుండలను తిని చనిపోతాయి. ఎకరాకు 5కిలోల తవుడుకి అరకిలో కార్బరిల్ (సెవిన్ 50%) పొడి మందు, అరకిలో బెల్లం కలిపి తగిన మేరకు నీరు వాడి చిన్న చిన్న ఉండలుగా చేసి సాయంత్రం సమయంలో పాలములో చల్లాలి.

కందకములు: వేరు శనగ నాశించే ఎర్రగొంగళి పురుగులు, పొగాకు లద్దె పురుగులు, ఒక పొలము నుండి మరొక పాఠానికి గుంపులు గుంపులుగా పయనిస్తాయి. అటువంటి పరిస్థితిలో పొలం చుట్టూ లోతైన నాగలి సాలు లేక కందకము తీసి బి. హెచ్.సి, డి.డి.టి, కార్బరిల్ లేదా ఫాలిడాల్ లాంటి ఏదో ఒక పొడి మందును చల్లితే పురుగులు ఆ కందకములో పడి విషం అంటుకుని చనిపోవు తాయి.కందకములో పడి విషం అంటుకుని చనిపోవుతాయి.

అడ్డుకట్టలు: మామిడి చెట్ల కాండము చుట్టూ జిగట పదార్థం పూసిగాని, మైనపు కాగితం చుట్టి, చెట్టు మొదలు నుండి చెట్టు పైకి గాని, పై నుండి మొదలుగాని పిండినల్లి లాంటి పురుగు ప్రాకకుండా చేయ వచ్చు. అదే విధంగా కొబ్బరి చెట్ల పైకి ఎలుకలు ఎక్కకుండా ఉండాలంటే, కాండము మొదలుపై ఇనుప తీగలు లేక ఇనుప రేకు కోణాకారంలో అమర్చాలి.

Also Read: Wanaparthy Tirumalayya Gutta: వనపర్తికి తలమానికం తిరుమలయ్య గుట్ట.!

Leave Your Comments

Stiff Sickness in Cattles: ఆవులలో మూడు రోజుల అస్వస్థత వ్యాధి ఎలా వస్తుంది.!

Previous article

Primary Tillage: ప్రాథమిక దుక్కి ఎప్పుడు చెయ్యాలి.!

Next article

You may also like