మన వ్యవసాయం

Marigold Farming: బంతి సాగు

0
Marigold Farming
Marigold Farming

Marigold Farming:

వాతావరణం: బంతి మొక్క మరియు పువ్వుల పెరుగుదల మరియు దిగుబడి కోసం ఎక్కువ వ్యత్యాసము లేని వాతావరణం అవసరం.వాతావరణ పరిస్థితుల్ని బట్టి బంతిని జులై మొదటి వారం నుండి ఫిబ్రవరి మొదటి వారం వరకు నాటితే అక్టోబరు నుండి ఏప్రిల్ మాసం వరకు మార్కెట్కు పూల సరఫరాని  చేయవచ్చు. సెప్టెంబరులో నాటిన పంట నుండి అధిక పూల దిగుబడి వస్తుంది. వర్షాకాలంలో పూలపై అధికవర్షం పడిన ఎడల లేదా వేసవిలో అధిక ఉష్ణోగ్రత వలన పూల నాణ్యత దెబ్బతింటుంది.

Marigold Farming

Marigold Farming

నేలలు: ఇసుక నేలలు లేదా నీరు త్వరగా ఇంకిపోయే స్వభావం గల  నేలల్లో బంతి పూలను సాగు చేయవచ్చు. ఉదజని సూచిక 7.0 -7.5 మధ్య గల నేలలు అనుకూలం. సారవంతమైన గరప నేలలు బంతికి అత్యంత అనుకూల మైనది. సాగుచేసే ప్రదేశంలో నీడ ఉండకూడదు. నీడలో బాగా పెరుగుతుంది. కాని పూలు పూయవు.

రకాలు:

ఆఫ్రికన్ బంతి: ఇది ఎత్తుగా ధృడమైన మొక్క దీనిలో ఒంటి రెక్క నుండి మద్దగా, పెద్దగా, వుండే రకాలు వున్నాయి. పూలు పువ్వులు నిమ్మ పసుపు నుండి పసుపు మరియు బంగారు నుండి నారింజ రంగు వరకు అనేక వర్గాల్లో ఉంటాయి.

ఫ్రెంచ్ మేరీగోల్డ్: ఇవి పొట్టిగా, గుబురుగా పెరిగి అనేక ఒంటి రేఖ లేదా ముద్దగా వుండే పూలుపూస్తాయి. పూలు పసుపు, నారింజ, ఎరుపు వర్ణం కల గోధుమ, , బంగారు పసుపు మరియు వివిధ రంగులు మిళితమై ఉంటాయి. వ్యాపార సరళిలో సాగుకి ఆఫ్రికన్ బంతి కన్నా, ప్రెంచి బంతికి ఎక్కువ డిమాండ్ ఉంది. ఇవే కాకుండ మేలు రకాలు అయినపూసా, నారింగ గైండా, పూసా బసంతిగైండా, యండియు-1 రకాలు కలవు.

Mariegold

Mariegold

విత్తన మోతాదు విత్తే పధ్ధతి: ప్రతి ఎకరానికి సరిపడ నారు పెంచడానికి 800-1000 గ్రా. విత్తనం అవసరం. విత్తనాలను ఎత్తైన మడులు తయారుచేసి విత్తాలిమడులు తయారు చేసే సమయంలో 8-10కిలోల బాగా చివికిన పశువుల ఎరువు 1 చదరపు మీటరుకి వేయాలి. విత్తడానికి మొదలు ఫాలిడాల్ పొడి చల్లితే చీమలు, చెదల నుండి రక్షించవచ్చు. సాధారణంగా 5–7 రోజుల్లో విత్తనాలు మొలకెత్తుతాయి.

కత్తిరింపులు: కొన్ని బంతి రకాల్లో విత్తనం ఏర్పడదు. రకాలను కాండపు మొక్కలను నాటి ప్రవర్ధనం చేయాలి.దీని కొరకు కొమ్మల చివర ఒకటి లేక రెండు జతల ఆకులు గల మృదువైన 10 సెం.మీ. పొడవుగల భాగాన్ని కత్తిరించి, వుంచి తేమగల ఇసుకలో (కుండి లేక మడుల్లో నాటాలి. వ్రేళ్ళు బాగా రావడానికి  కొమ్మ  కత్తిరింపుల మొదటి భాగాన్ని సెరాడిక్ బి లేదా రూటెక్స్ హార్మోన్ పొడితో మంచిన తరువాత నాటాలి. నాటిన వెంటనే కుండలను నీడ లోనికి మార్చాలి. ఒకవేళ మడిలో నాటిన నీడ కల్పించాలి. ఇసుకలో చెమ్మ ఆరిపోకుండా క్రమం తప్పక నీరు అందించాలి. నాటిన 8–10 రోజుల్లో  వేరు వ్యవస్థ ఏర్పడిన తరువాత వీటిని నాటుకోవాలి.

Also Read: బంతి సాగుతో అధిక లాభాలు

నాటే విధానం: 3-4 ఆకులు గల నెల వయస్సు మొక్కలు నాటడానికి అనుకూలం. నారుని సాయంకాలం వేళలో నాటుకుంటే బాగా పాతుకుంటాయి. ఆఫ్రికన్బంతి మొక్కల్ని 40X30 సెం.మీ దూరంలోను, కత్తిరింపులను 30×20 సెం.మీ. దూరంలోను నాటుకోవాలి. ఫ్రెంచ్ బంతి మొక్కల్ని 20×20 సెం.మీ. దూరంలో, కత్తిరింపులను 20X20 సెం.మీ. దూరంలో నాటితే పూల దిగుబడి బాగా వుంటుంది.

Marigold Bloom

ఎరువులు: చివరి దుక్కిలో ఎకరానికి 20 టన్నుల చొప్పున బాగా చిలికిన పశువుల ఎరువు వేసి కలియ దున్నాలి. దీనితో బాటుగా నత్రజని 20-40 కిలోలు, భాస్వరం 80 కిలోలు మరియు పొటాష్ 80 కిలోలు నిచ్చే ఎరువులు వేయాలి. నాటిన 37 రోజులకి నత్రజని 20-40 కిలోలు పైపాటుగా వేసి నీరు పెట్టాలి.

నీటి యాజమాన్యం: మొక్క శాఖీయ పెరుగుదల సమయంలోను మరియు పూత దశలోను నేలలో తగినంత తేమ వుండేలా చూడాలి. దశలోనైనా మొక్కలు నీటి ఎద్దడికి గురైతే, మొక్క పెరుగుదల మరియు పూల దిగుబడి తగ్గుతుంది.

పించింగ్: ఎత్తుగా పెరిగే ఆఫ్రికన్ బంతి రకాల్లో నిటారుగా పెరుగుతున్న బంతి మొక్క కాండపు చివరి భాగాన్ని ముందుగానే గిల్లివేస్తే, అనేక ప్రక్క కొమ్మలు తొందరగా ఏర్పడతాయి. కొమ్మలపై పూలు ఏర్పడి పూలదిగుబడి పెరుగుతుంది. నాటిన 40వరోజు పించింగ్ చేస్తే పూల దిగుబడి పెరుగుతుంది. మామూలుగా గుబురుగా పెరిగే రకాలకు పించింగ్ అవసరం లేదు.

పూలకోత: బంతి పూలను బాగా విచ్చుకున్న తరువాత కోయాలి. పూలను ఉదయం కాని సాయంత్రం కాని కోయాలి. కోతకు ముందు నీటి తడియిస్తే పూలు కోత తరువాత ఎక్కువ కాలం తాజాగా వుండి నిలువ వుంటాయి. సకాలంలో పూల కోతలు చేసూ వుంటే పూల దిగుబడి పెరుగుతుంది.

దిగుబడి:  సాధారణంగా ఎకరానికి 4-5 టన్నుల వరకు పూల దిగుబడి ఉంటుంది.

Also Read: బంతిపూల సాగుతో అధిక లాభాలు గడిస్తున్న యువరైతు..

Leave Your Comments

Poultry Farming: పౌల్ట్రీలో వ్యాధుల నివారణ సూత్రాలు మరియు టీకా వివరాలు

Previous article

World Food Prize 2021: భారత సంతతికి ప్రపంచ ఆహార బహుమతి

Next article

You may also like