Marek’s Disease in Poultry: లక్షణాలు – నరాల సంబంధిత లక్షణాలు:- మారెక్స్ అనే శాస్త్రవేత్త 1907వ సంవత్సరంలో ఇటువంటి లక్షణాలను హంగరీ ప్రాంతంలోని కోళ్ళలో గుర్తించాడు. 16 నుంచి 20 వారాల వయస్సు గల కోళ్ళలో ఈ రకమైన లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. స్కియాటిక్ నరాలు మరియు బ్రేకియల్ నరాలు దెబ్బతినడం వలన కాళ్ళ పక్షవాతం మరియు రెక్కలు వాలిపోవడం వంటి లక్షణాలు ప్రధానంగా కలుగుతుంటాయి. వేగస్ మరియు సిలియాక్ నరములు కూడా ఈ వ్యాధి మూలంగా ప్రభావితం అవుతాయి. ఈ వ్యాధి బారిన పడిన కోళ్ళు సరిగ్గా నిలబడలేవు. మెడ డొక్కలోనికి పెట్టుకొని ఉంటాయి. గ్రీనిష్ డయేరియా ఉండవచ్చు.
తీవ్రమైన లేదా విజరల్ దశ:- ఈ దశలో ముఖ్యంగా శరీరం లోపలి భాగాలు బాగా దెబ్బతింటాయి. ఫలితంగా కోళ్ళలో డిప్రెషన్, డ్రుపినెస్, ఆన్లైనెస్, డీహైడ్రేషన్, అనీమియా, అమాషియోషన్ లక్షణాలను కలిగి ఉంటుంది. సాధారణంగా ఈ రకమైన వ్యాధి లక్షణాలు 3-4 వారాల వయస్సులో గల కోళ్ళలో కనిపిస్తాయి. ఈ దశలో మోర్టాలిటీ 60 శాతం వరకు ఉండవచ్చు. లేయర్స్ మరియు పుల్లెట్స్లోలో అండాశయం కాలిఫ్లవర్ మరియు మల్బరీ పండ్లు వలే రూపాంతరం చెంది ఉంటాయి. బర్సా అవయవము పూర్తిగా కుశించుకొనిపోయి ఉంటుంది.
Also Read: Buffalo Types: గేదెల రకాలు మరియు వాటి లక్షణాలు.!
ట్రాన్సిషనల్ పారలైటిక్ ఫామ్:- ఇది 5-18 వారాల వయస్సు గల కోళ్ళలో ఎక్కువగా కన్పిస్తుంది. ఈ దశలో కోళ్ళలో ఉన్నట్టుండి అకస్మాత్తుగా కాళ్ళు, రెక్కలు మరియు మెడ కండరాల పక్షవాతం కలుగుతుంది. ఈ లక్షణాలు మామూలుగా 24-48 గంటలు ఉండి, తరువాత తగ్గిపోతుంటాయి.
ఆక్యులార్ దశ:- కళ్ళు పూర్తిగా కనిపించకుండా పోయి ఉంటుంది. కళ్ళు గ్రే లేదా పెర్ల్ కలర్లో ఉంటాయి. ఇది Mononuclear cell infiltration వలన కలుగుతుంది. ఐరిస్ తడి లేకుండా ఉండును.
చర్మమునకు సంబంధించిన దశ:- ఈ దశలో చర్మము మీద తెల్లటి కణితలు వంటివి గమనించవచ్చు. అవి రాను రాను గోధుమ రంగులోకి మారి, పొక్కులుగా ఊడి పోతుంటాయి.
మస్కులార్ ఫామ్- బాహ్య మరియు అంతర కండరాలు (పెక్టోరల్ కండరాలు) ఈ వ్యాధి బారీన పడును. కండరాలలో తెల్లటి గ్రే కలర్లో చిన్న చిన్న నాడ్యుల్స్ను గమనించవచ్చు.
వ్యాధి కారక చిహ్నములు:- సరాలు సైజు వాటి సాధారణ సైజు కన్నా 2-3 రెట్లు పెరిగి, దళసరిగా మారి ఉంటాయి. సిలియాక్, క్రేనియల్, మిసెంట్రిక్ మరియు స్కియాటిక్ నరాలు ఎక్కువగా ఈ వ్యాధికి గురి అవుతుంటాయి. కండరాలలో తెల్లటి గడ్డలు ఏర్పడి అవి ఆరెంజ్ రంగులోకి మారి ఉంటాయి. బర్సా అవయవము క్షీణించిపోయి ఉంటుంది. చర్మము పై తెల్లటి కణితలు ఉండి, స్కాట్స్ అనేవి గోధుమ రంగులో ఉంటాయి. అండాశయములో కాలిఫ్లవర్ వంటి గడ్డలు ఉండవచ్చు.
వ్యాధి నిర్ధారణ:- వ్యాధి యొక్క చరిత్ర, లక్షణాలు, వ్యాధి కారక చిహ్నముల ఆధారంగా మరియు ప్రయోగశాల పరీక్షల ఆధారంగా ఈ వ్యాధిని నిర్ధారించవచ్చు.
చికిత్స:- ఇది ఒక వైరల్ వ్యాధి కనుక, దీనికి ఎటువంటి చికిత్స వేయలేము.
విచారణ:- ఈ వ్యాధిని నివారించడానికి కోళ్ళ ఫారమ్ యాజమాన్యం బాగా చెయ్యాలి. వ్యాధి సోకిన వాటిని గుర్తించి, వెంటనే మంద నుండి పేరు వేయాలి. ఫారమ్ ఎప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఫార్మలిన్తో గాని, ఇల్లు పరిశుభ్రం చేయడానికి వాడే రసాయనాలతో క్లీనింగ్ చేయాలి. వ్యాధిగ్రస్త కోళ్ళతో కలుషితమైన ఆహారము మరియు నీటిని కోళ్ళకు అందించకూడదు. ఫారమ్ పాత్రలు మరియు పరికరాలు వంటివి కలుషితమైన కాకుండా చూసుకోవాలి. సందర్శకులని ఫారమ్ లోనికి అనుమతించకూడదు.
టీకాలు:- ఈ వ్యాధికి మూడు రకాల టీకాలు సాధారణంగా ఉపయోగిస్తుంటారు. ఉదా:- అల్యూమినియేటెడ్ ఎం.డి. వ్యాక్సిన్ (Alluminated M.D Vaccine), ఎపైరులెంట్ ఎం.డి. వ్యాక్సిన్ (Avirulent M.D Vaccine) మరియు టర్కీ హెర్పిస్ వైరస్ (హెచ్.వి.టి) టీకా. ఈ మూడింటిలో హెచ్.వి.టి. వ్యాక్సిన్ అనేది ఎక్కువగా ఉపయోగిస్తారు. ఈ టీకాను హాచరీలోనే మొదటి రోజు పిల్లలకు ఇవ్వవలసి ఉంటుంది.
Also Read: Ranikhet Disease in Poultry: కోళ్లలో కొక్కెర తెగులు ఎలా వస్తుంది.!