Mango Cultivation: మన రాష్ట్రంలో మామిడి షుమారుగా 7,64,495 ఎకరాల విస్తీర్ణంలో సాగుచేయబడుతూ 24,45,824 టన్నుల మామిడి పండ్లు ఉత్పత్తి చేయబడుతుంది. మామిడిని ప్రధానంగా కృష్ణా, ఖమ్మం, విజయనగరం, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, శ్రీకాకుళం, కరీంనగర్, విశాఖపట్నం, చిత్తూరు, కడప, అదిలాబాదు మరియు నల్లగొండ జిల్లాల్లో విస్తారంగా సాగుచేస్తారు. దేశపు ఉత్పత్తిలో షుమారు 24 శాతం వాటా మన రాష్ట్రానిదే. మామిడి కాయల్లో విటమిన్ సి, ఇ, యాంటీ ఆక్సిడెంట్లు అధికం ఉంటాయి. అందువల్ల వీటిని తింటే రోగ నిరోధక శక్తి బాగా పెరుగుతుంది. సీజనల్‌గా వచ్చే దగ్గు, జలుబు, జ్వరం సమస్యల నుండి విముక్తి పొందవచ్చు. వ్యాధులు, ఇన్‌ఫెక్షన్లు రాకుండ అడ్డుకోవచ్చు. మామిడి ఫైబర్లో పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది. అజీర్ణం, మలబద్దకం, గ్యాస్ సమస్యలు తగ్గుతాయి.
Also Read: Soils in Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ నేలల లక్షణాలు మరియు యాజమాన్య పద్ధతులు
మామిడి రకాలు: దాదాపు భారతదేశంలో 1000 మామిడి రకాలు ఉన్నాయి. అయితే వీటిలో దాదాపు 20 రకాలను మాత్రమే వాణిజ్య స్థాయిలో పండిస్తున్నారు. భారతదేశంలోని మామిడి యొక్క వాణిజ్య రకాలు దేశంలో వివిధ ప్రాంతాలకు ప్రత్యేకమైనవి.
నేల తయారీ మరియు మొక్కలు నాటుట:
వడగాల్పులు పెనుగాలులు వీచే ప్రాంతాలలో సరుగుడు యూకలిప్టస్ లేక ఎర్రచందనం మొక్కలు గాలి వీచే దశలో 2 వరుసలలో 2మీటర్ల దూరంలో నాటుకోవాలి. తోట వేయుటకు నిర్ణయించిన నేలను బాగా దున్ని చదును చేసి నిర్దేశించిన దూరంలో 1×1×1 మీటర్ల గుంతలను తవ్వాలి. మొక్కలు నాటుటకు ముందు గుంతలలో 50 కేజీల పశువుల ఎరువు కేజీల సూపర్ పాస్పేట్ మరియు చెదలు పట్టకుండా 100 గ్రాముల పాలిడాల్ 2% పొడిని తవ్విన మట్టిలో కల్పి గుంతలను నింపాలి. మొక్కలను సూమారు 7-10 మీటర్ల దూరంలో నాటాలి. బాగా సారవంతలైన నేలల్లో 12. మీటర్ల దూరంలో కూడా నాటుకోవచ్చు. మొక్క నాటునప్పుడు అంటు మొక్కను మట్టి గడ్డలతో సహా తీసి వేళ్ళు కదలకుండా గుంతలో నాటాలి. అటు పిమ్మట మొక్క చుట్టూ మట్టిని గట్టిగా నొక్కి గాలికి పడిపోకుండా కొయ్యతో కట్టవలెను. నాటిన వెంబడే నీరు పోయాలి. అటు తర్వాత నేల తేమను బట్టి 15 రోజులకొకసారి వర్షాలు లేనప్పుడు. నీళ్ళు పోసి 2 సం.ల వరకు కాపాడాలి.
Also Read: Direct Seeding Methods: వరి పంటలో నేరుగా విత్తే పద్ధతులు.!