మన వ్యవసాయంవ్యవసాయ పంటలు

Groundnuts Cultivation: వేరుశనగలో ఎరువుల యజమాన్యం

2

Groundnuts Cultivation: ప్రస్తుతం మన రాష్ట్రంలో వేరుశనగ 17.91 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో సాగుచేయబడుతూ 10.45 లక్షల టన్నుల కాయ దిగుబడినిస్తుంది.

Groundnuts Plants

Groundnuts Plants

ఎరువుల వాడకం:

  • ఎకరాకు పశువుల ఎరువు 10 బళ్ళు,వేపపిండి 150 కిలోల చివరి దుక్కులలో వేయవలెను.
  • జింకులోపము సరిదిద్దుటకు విడిగా 20కిలోలు (ఎకరాకు) జింకు సల్ఫేట్ ఆఖరి దుక్కిలో వేయవలెను
  • భూసార పరిక్షననుసరించు రసాయనిక ఎరువుల మోతాదు నిర్ణయించవలెను.

Also Read: మినుముల వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

Groundnuts Planting

Groundnuts Planting

  • సాధారణంగా 1 ఎకరా వేరుశనగ పైరుకు(కిలో లలో) యూరియా సింగల్ సూఫర్ఫాస్ఫేట్ మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఖరీఫ్ 20 100 30 రబి 20 100 30 పైన చూపిన ఎరువులను విత్తేముందు వేయాలి.శాస్త్రజ్ఞుల పరిశోధనలో విత్తిన 30రోజులకు పై పాటుగా యురియా వేయడం వలన పెద్ద ఉపయోగం లేదని తేలింది.కావున రైతు సోదరులు ఎరువుల మీద పెట్టే వృధా ఖర్చు తగ్గించుకోగలరు.
  • తొలిపూతదశలో(30 రోజులు)1 ఎకరమునకు 200కి.గ్రా జిప్సమ్ ఎరువును మొదళ్ళుకు దగ్గరగా 5సె౦.మీ లోతులో వేయాలి.
  • జిప్సమ్ వేసేటప్పుడు భూమిలో తగినంత తేమ అవసరం.జిప్సంలోని కాల్షియం,సల్ఫర్ వలన గింజ బాగా ఊరటమే కాకుండా నూనె శాతం కూడా పెరుగుతుంది.
  • పంట ఖరీఫ్ యూరియా-20/సింగల్ సూపర్ ఫాస్ఫేట్-100 /మ్యూరేట్ ఆఫ్ పొటాష్-30
  • పంట రబి యూరియా-20/సింగల్ సూపర్ ఫాస్ఫేట్-100 /మ్యూరేట్ ఆఫ్ పొటాష్-30

Also Read: మల్బరీ సాగులో మెళుకువలు

Leave Your Comments

Green Gram Cultivation: పెసరలో వచ్చే తెగుళ్ళు మరియు వాటి యజమాన్యం

Previous article

Clostridium: గొర్రెల్లో వచ్చే చిటుక వ్యాధి

Next article

You may also like