Management of Acidic Soils: ఆమ్ల నేలలను రెండు విధాలుగా నియంత్రించవచ్చు.ఒకటి ఆమ్ల నేలల pHకి సరిపోయే పంటలను పండించడం, మరొకటి ఆమ్లత్వాన్ని తగ్గించడం కోసం అమెండ్మెట్లను ఉపయోగించడం. ఆమ్ల నేలలకు సున్నం వేయడం ద్వారా ఆమ్లత్వం తగ్గి ఆ నేలలు వ్యవసాయ వినియోగానికి అనుకూలంగా మారుతాయి.దీనిని లైమింగ్ అని అంటారు.ఇలా లైమింగ్ చేయడం వలన మూలాధార స్థితిని పెంచుతుంది, పోషకాల లభ్యతను పెంచుతుంది ఇంకా వాటిని తీసుకునేందుకు సరైన వాతావరణాని అందిస్తుంది,అల్లుమీనియం మరియు మాంగనీస్ వంటి విషపూరిత ఖనజాల శాతాన్ని దాని న్యూట్రలైజింగ్ గుణంతో తగ్గిస్తుంది, నేల నిర్మాణాన్ని మెరుగుపరుస్తుందిమరియు వేర్ల పెరుగుదలను ప్రోత్సాహిస్తుంది.

Management of Acidic Soils
Also Read: TechKnow Intellectual Property Database: ప్రజల అందుబాటులోకి వ్యవసాయ మేధోసంపత్తి.!
లైమింగ్ లో ఉపయోగించే పదార్థాలు:
1. కాల్షియం కార్బోనేట్ (CaCO3)
2. కాల్షియం మెగ్నీషియం కార్బోనేట్ (CaCO3 MgCO3)
3. కాల్షియం ఆక్సైడ్ (CaO)
4. కాల్షియం హైడ్రాక్సైడ్ (Ca (OH2))
5. బేసిక్ స్లాగ్
సున్నం వేసే సమయంలో పాటించాల్సిన జాగ్రత్తలు:
1. లైమింగ్ పదార్థం పొడి రూపంలో ఉంటే ఈ ప్రక్రియ వేగంగా అవుతుంది.నిర్దిష్ట PH సాధించడానికి ఆ పదార్థం ముతకగా ఉండటం కన్నా సూక్ష్మంగా ఉంటే తక్కువ మొత్తం అవసరమవుతుంది.
2. పంట సాగుకు ముందుగా సున్నం వేయాలి ఆ తర్వాత దానిని మట్టిలో బాగా కలపడం వలన ఈ చర్య వేగంగా జరుగుతుంది.
3. నేలను దున్న కుండా ఈ లైమింగ్ పదార్థాలను వేస్తే ఇది ప్రభావవంతంగా ఉండదు.
4. సున్నం వేసే సమయంలో అది బాగా పనిచేయడం కోసం పొలం తడిగా ఉండాలి
5.ప్రబల ఆమ్ల నేలలలో ఒక ఎకరానికి 3-6 టన్నుల సున్నం వేయడం వలన బాగా
సమర్థవంతంగా పనిచేస్తుంది.
Also Read: Rytu Vedika For Farmers: సమగ్ర వ్యవసాయాభివృద్ధికి రైతు వేదిక.!