మన వ్యవసాయం

Maize Cultivation: మొక్కజొన్న సాగులో జాగ్రత్త వహించవలసిన అంశాలు

5
Maize Plantation
Maize-Plantation

Maize Cultivation: మన రాష్ట్రంలో మొక్కజొన్న వర్షాధారంగాను మరియు సాగునీటి క్రింద ఖరీఫ్‌, రబీ కాలాల్లో పండించబడుతుంది. మొక్కజొన్న ఆహార పంటగానే గాక, దాణా రూపంలోను, పశువులకు మేతగాను, వివిధ పరిశ్రమల్లో ముడి సరకుగాను, పేలాల పంటగాను, తీపికండె రకంగాను మరియు కాయగూర రకంగాను సాగుచేయబడుతుంది.

Maize Cultivation

Maize Cultivation

మన రాష్ట్రంలో మొక్కజొన్న వర్షాధారం క్రింద సుమారు 5.3 లక్షల హెక్టార్లలో మరియు నీటి పారుదల క్రింద సుమారుగా 3.3 లక్షల హెక్టార్లలో సాగు చేస్తున్నారు. వర్షాధారం క్రింద ముఖ్యముగా మెదక్‌, మహబూబ్‌నగర్‌, వరంగల్‌, కరీంనగర్‌, జిల్లాలలో అధిక సాగులో ఉన్నది. నీటి పారుదల క్రింద గుంటూరు, పశ్చిమ గోదావరి, వరంగల్‌, కరీంనగర్‌ జిల్లాలలో ఎక్కువ సాగులో ఉన్నది.

Also Read: Nature of Agriculture: దేశంలో వ్యవసాయ స్వరూపం మారాలి- నిరంజన్ రెడ్డి

కార్బోహైడ్రేట్‌లు, ఫైబర్‌లు, కొవ్వులు మరియు ప్రోటీన్‌లు, ముఖ్యమైన సూక్ష్మపోషకాలు – విటమిన్‌లు మరియు మినరల్స్‌తో పాటు అన్ని అవసరమైన మాక్రో న్యూట్రియెంట్‌ లను  మొక్కజొన్న కలిగి ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యాన్ని ప్రోత్సహించడానికి సహాయపడుతుంది. మొక్కజొన్నలో రోగనిరోధక, చర్మం మరియు జుట్టు ఆరోగ్యాన్ని పెంచడానికి విటమిన్లు ‘సి’ మరియు ‘ఇ’ గణనీయమైన పరిమాణంలో ఉన్నాయి.

రోజూ నియంత్రిత భాగాలలో మొక్కజొన్న తినడం వల్ల నరాల ప్రేరణ ప్రసరణను మెరుగుపరచడంలో, మెదడులోని జ్ఞాపకశక్తి కేంద్రాలను సక్రియం చేయడంలో మరియు ట్రిప్టోఫాన్ అమైనో ఆమ్లం యొక్క అధిక స్థాయిల కారణంగా మనస్సును రిలాక్స్ చేయడంలో సహాయపడుతుంది. మొక్కజొన్నలో పూర్తిగా కొలెస్ట్రాల్ మరియు సోడియం ఉండదు, కాబట్టి కార్న్‌ఫ్లోర్‌తో చేసిన వంటకాలను గుండె జబ్బులు ఉన్నవారు సురక్షితంగా తీసుకోవచ్చు. ఇంకా, డైటరీ ఫైబర్స్ మరియు విటమిన్ B3 లేదా నియాసిన్ యొక్క సమృద్ధి HDL స్థాయిలను మెరుగుపరచడంలో మరియు చెడు LDL స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది

అంశాలు:

  • ఖరీఫ్లో వర్షాధారం క్రింద మొక్కజొన్నను పదును వర్షం కురిసిన తర్వాత మాత్రమే విత్తుకోవాలి.
  • ఖరీఫ్లో వర్షాధారం క్రింద మొక్కజొన్నలో అంతరం పెసర లేదా మినుము వేసుకోవాలి.
  • ఎకరానికి 8 కిలోల విత్తనాన్ని, 60×20 సెం.మీ., ఎడమలో విత్తుకొని 33,333 మొక్కలు ఉండేలా చూడాలి
  • కాండం తొలుచు పురుగు నివారణకు మోనోక్రోటోఫాస్6. మి.లీ., ఒక లీటరు నీటిలో కలిపి పైరు మొలకెత్తిన 10-12 రోజులకే పిచికారి చేయాలి.
  • విత్తిన 40-45 రోజుల వరకు పంటలో కలుపు లేకుండా. చూడాలి.
  • పైపాటుగా ఎరువులు వేసినప్పుడు నేలలో తేమ ఉండేలా చూడాలి.
  • మొక్కజొన్నలో సున్నిత దశలైన పూత మరియు గింజ పాలుపోసుకొనే దశలలో నీటి ఎద్దడి లేకుండా చూడాలి.

Also Read: Focus On Organic Farming: సేంద్రీయ వ్యవసాయంపై దృష్టి పెట్టండి- ఉప రాష్ట్రపతి

Leave Your Comments

Paddy Nursery Management: వరి నారుమడి పెంపకం లో మెళుకువలు

Previous article

Focus On Organic Farming: సేంద్రీయ వ్యవసాయంపై దృష్టి పెట్టండి- ఉప రాష్ట్రపతి

Next article

You may also like