Livestock Housing: పశువులకు గృహ వసతి ఎందుకు కల్పించాలి?
- వాన, ఎండ మరియు చలి నుండి పశువులను కాపాడుకొనుటకు
- కూర మృగాల నుండి కాపాడుటకు
- మంచి యాజమాన్య పద్ధతులు పాటించుటకు
- ఎక్కువ పాల దిగుబడి పొందటానికి.
- శాస్త్రీయ పద్ధతుల్లో పోషక పదార్థాలను లేదా ఔషధములను పశువుకు ఇవ్వడానికి,
- వ్యాధులను సులువుగా గుర్తించి నివారించడానికి మరియు పశువులలో మరణాల శాతాన్ని తగ్గించడానికి.
పశువులకు గృహ వసతి కల్పించే ముందు గుర్తుంచు కోవాల్సిన అంశాలు
1. షెడ్ నిర్మాణాన్ని ఎత్తైన ప్రదేశంలో నిర్మించాలి. ఫలితంగా ఈ క్రింది లాభాలు కలవు. నీరు డైరీ లోపలికి రాక, మురికి నీరు వంటివి డైరీ చుట్టు ప్రక్కల చేరకుండా ఉంటుంది.
అ) వర్షపు నీరు డైరీ లోపలికి రాక, మురికి నీరు వంటివి డైరీ చుట్టు ప్రక్కల చేరకుండా ఉంటుంది.
(ఆ) గాలి మరియు వెలుతురు కావలసినంత డైరీ ఫారమ్ లోకి వచ్చును.
2. డైరీ ఫారమ్ చుట్టు ప్రక్కల ఉష్ణోగ్రత, అర్థత మరియు గాలి యొక్క వెలాసిటి 18-25 డిగ్రీల ఉష్ణోగ్రత, 70-75 శాతం ఆర్ద్రత, సూర్యరశ్మి మరియు గాలి గృహవసతిలోని నేలకు మరియు వెలుపలకు సమృద్ధిగా ఉండేటట్లు చూడవలెను.
Also Read: Calf Diptheria Disease in Cattle: పశువులలో కాఫ్ డిప్తీరియా వ్యాధిని ఇలా నయం చెయ్యండి.!
3. డైరీ ఫారమ్ రోడ్డు రవాణాకు అందుబాటులో ఉండాలి. ఫలితంగా ఫారమ్కు కావలసిన ముడి సరకులను కాని ఫారమ్ నుండి ఏదైనా బయటకు రవాణా చేయుటకు కాని లేదా పని వారు ఫారమ్కు చేరుకొనుటకు కాని సులభం అవుతుంది.
4. ఫారమ్ యందు నీటి సౌకర్యం డైరీ ఫారమ్ నిరంతర నీటి సౌకర్యం ఉండాలి. ఫలితంగా పశువులకు సమయానికి నీటిని ఇవ్వవచ్చును మరియు డైరీలోని పరికరాలను, పాత్రలను శుభ్ర పరుచుకోవచ్చును మరియు షెడ్ను, షెడ్లోని పశువులను ఎప్పటికప్పుడు కడగవచ్చును.
5. డైరీ ఫారమ్ యందు కరెంటు సౌకర్యం విద్యుత్ సరఫరా ఎల్లప్పుడు ఉండునట్లు చూసుకోవాలి. దీని వలన రాత్రి పూట కూడా ఫారమ్ పరికరాలను మరియు నీటి సౌకర్యాలను, పశువులకు గల ఇబ్బందులను, పశువులు దాణా సరిగ్గా తింటుందో లేదో తెలుసుకోవచ్చును. విద్యుత్ ఉండుట వలన పశువులకు కావలసిన దాణాను తయారు చేసుకోవడం మరియు పాల మిషన్ను ఉపయోగించి పాలను తీయడం సులభం అవుతుంది. ఫారమ్ విద్యుత్ ఉంటేనే నీటి మోటర్లు కూడా పని చేయగలిగి పశువులకు నీటి సరఫరా జరుగుతుంది. అందుకే రైతులు డైరీ ఫారమ్ను మొదలుపెట్టే ముందు విద్యుత్ సరఫరా మరియు నీటి సౌకర్యం చూసుకోవలసి ఉంటుంది.
6. మార్కెటుకు దగ్గరగా డైరీ ఫారమ్ అన్ని అనుకూలంగా వుండేలా చూసుకోవాలి. ఫలితంగా పశువుల పాల ఉత్పత్తిని మరియు ఇతర ఉత్పత్తులను సులభంగా రవాణా చేసుకోవచ్చును.
7. ఫారములో పని చేయువారికి వారి పిల్లలకు హాస్పిటల్ మరియు స్కూల్ అందుబాటులో వుండాలి.
8. ఫారము టెలిఫోన్ సౌకర్యం కల్పించబడి ఉండాలి.
Also Read: Actinomycosis Disease in Cows: ఆవులలో వచ్చే దవడవాపు వ్యాధియాజమాన్యం.!