Leptospirosis Symptoms in Cattle: వ్యాధి నివారణ చర్యలు – ఈ వ్యాధి అన్ని రకములైన పశువులలో (ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెలు, కుక్కలు మరియు మనుషులు) లెప్టోస్పైరా ప్రజాతికి చెందిన 3 వివిధ జాతులు అయినటువంటి కానికోలా, పామోనా, ఇకైరా, హిమోజెరికా అను వాటి ద్వారా కలుగు అతి తీవ్రమైన ప్రాణంతకమైన ఒక జునోటిక్ వ్యాధి. ఈ వ్యాధిలో తీవ్రమైన జ్వరం, జాండీ’స్ లక్షణాలు (హిమోగ్లో బినూరియా) మరియు అనీమియా లక్షణాలు ప్రధానంగా ఉంటాయి.
వ్యాధి కారకము:- ఇది లెప్టోస్పైరా ప్రజాతికి చెందిన బ్యాక్టీరియా వలన కలుగుతుంది. ఇది ఒక మెబైల్ బ్యాక్టీరియా స్పైరల్ ఆకారంలో వుంటుంది. ఇది ఫిలమెంట్ మాదిరి పలుచగా వుండి కదులుతూ వుంటుంది. దీనిని Dark Field Microscope ద్వారా మాత్రమే చూడగలము. వీటి పెరుగుదలకు ఆక్సిజన్ అవ సరము. ఈ ప్రజాతిలో సుమారు 23 సిరో గ్రూపులు మరియు 212 సిరోవర్స్ కలవు. ఈ బ్యాక్టీరియా వలన వివిధ పశువులలో కలుగు వ్యాధులు ఈ విధంగా ఉంటాయి.
వ్యాధి బారిన పడు పశువులు:- అన్ని వయస్సుల పశువులు, పందులు, మేకలు, గుర్రాలు మరియు మనుషులు. ఈ వ్యాధి వర్షాకాలంలో అధికంగా కలుగుతుంది.
వ్యాధి వచ్చు మార్గం:-
(1) రిజర్వాయర్ అతిధేయ జీవి అయిన ఎలుకల మూత్రం, ఈసుకుపోయిన పిండం, పిండ పదార్థాలు మరియు పాలతో కలుషితమైన ఆహారం, నీరు తీసుకోవుట ద్వారా
(2) క్రుత్రిమ గర్భోత్పత్తి లేదా సహజ సంపర్కం ద్వారా ఈ వ్యాధి ఇతర పశువులకు కలుగుతుంది.
వ్యాధి వ్యాప్తి చెందు విధానం:- బ్యాక్టీరియాతో కలుషితమైన ఆహారం, నీరు నోటి ద్వారా తీసుకొన్నపుడు అవి నేరుగా పొట్ట, ప్రేగుల ద్వారా రక్తంలో కలియును. శరీర గాయాల ద్వారా బ్యాక్టీరియాలు నేరుగా రక్తంలో చేరును. రక్తంలో సెప్టిసీమియాగా మారి, ఎర్ర రక్త కణములను అధిక సంఖ్యలో విచ్చిన్నం చేయును.
ఫలితంగా హిమోగ్లోబిన్ వర్ణం అధిక మొత్తంలో కాలేయంకు చేరును. కాలేయం ఈ వర్తకంను పూర్తిగా కాంజుగేషన్ చేయలేకపోవుట వలన ఈ వర్ణకం మూత్రం ద్వారా హిమోగ్లోబిన్యూరియా రూపంలో బయటకు విసర్జించబడుతుంది. మిగిలిన వర్ణకం శరీరంలో పేరుకుపోవుట వలన పచ్చ కామెర్లు కలుగుతుంది.
మూత్ర పిండాలలో నెఫ్రైటిస్ కలుగుతుంది. ఫలితంగా రక్తంలో అధిక మొత్తంలో యూరియా మరియు క్రియాటినిన్ శాతం పెరిగే అవకాశం కలదు. ఈ బ్యాక్టీరియాలు రక్తం ద్వారా పొదుగు కణజాలంకు చేరి పొదుగు వాపును కూడా కలుగజేయును. మెదడుకు చేరి మెనింజైటిస్ లక్షణాలను కూడా కలుగజేయును. పిండంతో ఉన్న పశువులు ఈసుకుపోయ్యే అవకాశం ఎక్కువ.
లక్షణాలు:-
· ఈ వ్యాధి అతి తీవ్రస్థాయి నుండి దీర్ఘకాలం వరకు వుంటుంది.
· తీవ్రమైన జ్వరం ఉంటుంది, ఆకలి ఉండదు. చూపు సరిగ్గా కనిపించదు. వినికిడి లోపం ఉంటుంది.
· కుక్కలలో ఇది అతి ప్రాణాంతకం నుండి ప్రాణాంతకంగా ఉంటుంది.
· రక్తంతో కూడిన మూత్రం, జాండిస్ లక్షణాలు, రక్తహీనత ఈ వ్యాధి ప్రత్యేక లక్షణాలు.
· కంటి పొరలోని శ్లేష్మపొర పాలిపోయి, పచ్చ కామెర్ల లక్షణాలుంటాయి.
· పొదుగు వాపు లక్షణాలుండి, పాల రంగు, రుచి, వాసన మారిపోయి ఉంటుంది. 7. చివరి దశలో తల, మెడ, ఛాతి భాగాలలో నీరు చేరి వాచిపోయి ఉంటుంది. 8. పశువులు 6-7 నెలల వయస్సులో సహజంగా ఈసుకుపోతుంటాయి.
Also Read: Casting of Animals: ఆవులు మరియు గేదెలను ఎలా నియంత్రించాలి.!
వ్యాధి కారక చిహ్నములు:- మూత్ర పిండాలలో శోధం ఉంటుంది. కాలేయ పరిమాణం పెరిగిపోయి వుండును. లివర్ కణాలు అన్ని విడిపోయి వుంటాయి. ఇతర అవయవాలలో పచ్చ కామెర్ల వర్ణకం పేరుకుపోయి, రక్తస్రావము కలిగి వుండును.
నిర్ధారణ:-
(1) వ్యాధి చరిత్ర ఆధారంగా
(2) వ్యాధి లక్షణాలు ఆధారంగా
(3)వ్యాధి కారక చిహ్నములు మరియు ప్రయోగశాల పరీక్షల ఆధారంగా
(a) రక్తంను పరీక్షించినపుడు అందులో వుండే రక్తకణాల సంఖ్య తగ్గిపోయి వుండును.
(b) మూత్రము, గర్భస్రావ పిండ ద్రవాలను గాజు స్లైడ్ పైన అలికి సిల్వర్ ఇంప్రిగ్నేషన్ పద్ధతి ద్వారా వర్ణకము చేసి సూక్ష్మదర్శిని ద్వారా చూసినపుడు స్ప్రింగ్ ఆకారపు సూక్ష్మజీవిని గుర్తించి ఈవ్యాధిని నిర్ధారించవచ్చు.
ఇతర వ్యాధులతో సరిపోల్చుకొనుట:-
(1) బాసిల్లరీ హిమోగ్లోబిన్యూరియా
(2) బేబిసియా
(3) పోస్టు పార్చురియంట్ హిమోగ్లోబిన్యూరియా
(4) ఆనాప్లాస్మోసిస్ మొ.నవి.
చికిత్స:-
వ్యాధి కారకాన్ని నిర్మూలించుటకు చేయు చికిత్స:- వ్యాధి కారక బ్యాక్టీరియాలను బ్రాడ్ స్పెక్ట్రమ్ ఆంటి బయోటిక్లు స్ట్రెప్టోమైసిన్, టెట్రాసైక్లిన్ వంటివి 7-10 రోజుల పాటు ఇవ్వవలెను.
వ్యాధి లక్షణములకు చేయు చికిత్స:- జ్వరాన్ని తగ్గించుటకు అంటి పైరెటిక్ ఔషధములను, ఇన్ఫ్లమేషన్ తగ్గించుటకు ఆంటి ఇన్ఫ్లమేటరి ఔషదములను, నొప్పులు తగ్గించుటకు అంటి ఆనాల్టై సిక్ ఔషధములను ఇవ్వవలెను. ఎండోమెట్రైటిస్ తగ్గించుటకు ఎకో బోలిక్స్, పెన్సరిస్ మరియు ఇంట్రా యుటిరైన్ ద్రావణములను ఇవ్వవలెను. పచ్చ కామెర్లు తగ్గించుటకు కాలేయ ఇంజక్షన్లు, రక్తహీనత తగ్గించుటకు ఐరన్ ధాతువులు కలిగిన ఇంజక్షన్లు ఇవ్వవలెను.
నివారణ:- కుక్కలలో ఈ వ్యాధి రాకుండా Megavac-6 వంటి టీకాను మూడు నెలల వయస్సులో మొదటి మోతాదును ఇచ్చి, బూస్టర్ మోతాదును 4 నెలలలో ఇవ్వాలి. తరువాత సంవత్సరానికి ఒక్కసారి ఈ టీకాను ఇస్తూ వుండాలి. దూడలలో ఈ వ్యాధి కారక టీకాను 3 నెలల వయస్సులో ఇవ్వవచ్చు.
Also Read: Heat Detection in Dairy Buffaloes: ఎదలో ఉన్న పాడి పశువులను ఎలా గుర్తిస్తారు.!