Lemongrass Cultivation: నిమ్మగడ్డి 3 మీటర్ల ఎత్తువరకు పెరుగు బహువార్షికపు గడ్డి జాతికి చెందిన మొక్క దీని ఆకులు వరి ఆకులవలె నుండి 125 సెం.మీ, పొడవు, 1.7 సెం.మీ వెడల్పుతో ఉంటాయి. దీనిని మెట్టమొదట మనదేశంలోని మలబారు తీరంలో పండించేవారు. ప్రస్తుతము దీనిని దక్షిణ భారతదేశమంతటా పండిస్తున్నారు. ఇది ప్రకృతి సిద్ధంగా ఉష్ణమండల, సమశీతోష్ణ మండల ప్రాంతాలైన ఆసియా, ఆఫ్రికా, అమిరికా దేశాలలో పెరుగుతుంది.
నిమ్మగడ్డిని సుగంధ తైలం తీయడానికి, ప్రస్తుతం ఇండియాతోపాటుగా మధ్య అమెరికా, థైలాండ్, కొమొరోస్ దీవులు, మొడగాస్కర్, చైనా, ఇండోనేషియాలలో పండిస్తున్నారు. మన దేశంలో దీనిని గూర్చి అతి ప్రాచీన కాలంనుండీ తెలిసియున్నప్పటికీ, శాస్త్రీయంగా సుగంధ తైలాన్ని తీసేందుకు సేద్యం చేయడమ్ కేరళ- రాష్ట్రంలో ఉత్తర ప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాలు, ఆంధ్రప్రదేశ్లోను పండిస్తుచున్నారు.
మన రాష్ట్రంలోని అన్ని రకాల భూములలో ఈ పంట పండుతుంది. బంజరు భూములు, సేద్యము చేయకుండా వదలిన ఇతర భూములు, అరణ్య భూములు కూడా ఈ పంటకు అనుకూలమే.
వాతావరణం:
ఊగిన వేడిమి, నీటి తేమ, సూర్యరశ్మి ఈ పంటకు అవసరం. 150 నుండి 300 సెం.మీ వర్శపాతం గల ప్రాంతాలలో ఇది బాగా పెరుగుతుంది. 80 శాతము సూర్యరశ్మి లభించు కొబ్బరి తోటలు, యితర పండ్ల తోటలలో దీనిని అంతర పంటగా వేసుకొనవచ్చు.
ఈ పంటను విత్తనం ద్వారానూ, ఆరోగ్యవంతమైన స్లిప్పుల ద్వారాను ప్రవర్ధనం చేయవచ్చును. ఎకరానికి 1.5 కిలోల్ వెత్తనమ్ లేక 14500 స్లిప్పులు అవసరమవుతాయి. జనవరి – ఫిబ్రవరిలో సేకరించిన విత్తనాలను బెడ్లు చేసుకొని ఏప్రియల్ లేక మే నెలలో విత్తుకోవాలి. 50-70 రొజుల మొక్కలను వర్శారంభము తరువాత నాటుకోవాలి. అప్పటికి మొక్కలకు 3 లేక 4 ఆకులు వస్తాయి.
Also Read: Silkworm Chawki Rearing: చాకీ ఆకు నాణ్యత ఎలా ఉండాలి.!
రకాలు:
ముఖ్యంగా రెండు నిమ్మగడ్డి రకాలున్నాయి.
ఈస్టిండియన్ లేక ట్రూలెమని గ్రాస్: దీనినుండి తయారయ్యే ఆయిల్ను ఈస్టిండియన్ ఆయిల్ అని పిలుస్తారు. ఇది వాణిజ్య పరంగా ఉత్తమమైనది. ఇది కొచ్చిన్ నుండి ఎగుమతి అవుతుoది.
వెస్టిండియన్ లెమన్ గ్రాస్: ఇది ఇండో చైనా, మెడగాస్కరు, గ్వాటిమాలా, బ్రెజిల్, హేలి, ట్యాంగానికా, ఉన్నప్పటికి (75-86%) ఈస్టిండియన్ ఆయిల్ తేలికగా ఆల్కహాల్తో కలిసిపోతుంది. వెస్టిండియన్ లెమన్ గ్రాస్ ఆయిల్లో సిట్రాల్ తోపాటు ఇతర ఆల్డిహైడ్స్ ఉంటాయి.
నార్తు ఇండియన్ లెమనగ్రాస్ లేదా జమ్మూలెమన్ గ్రాస్ అను మరొక రకము జమ్మూ కాశ్మీరులోనూ, ఇతర ఉత్తర భారతదేశంలోనూ పండుతుంది.
ఎరువులు:
బాగ చివికిన పశువుల ఎరువును ఎకరానికి 10 టన్నులు వేసుకోవాలి. రసాయనిక ఎరువులు ఎన్.పి.కె. 20:18:14 కిలోలు భూమిలొ వేసుకోవాలి. 60 కిలోల నత్రజని ప్రతికోత తరువాత వేసుకోవాలి.
భూమి సిద్ధత:
వర్శాకాలారంభములోనే భూమిని లోతుగా, మెత్తగా దున్నుకొని ఎరువులు వేసుకొని బాగుగా కలిసేట్లు గుంటక తోలుకోవాలి.
నిమ్మగడ్డి నాటు:
నిమ్మగడ్డి అతిశీతల వాతావరణం గల అక్టోబరు, నవంబరు మరియు ఏప్రియల్ మే నెలలను విడిచి ఎప్పుడైనా నాటుకోవచ్చు. మెత్తగా దున్ని ఎరువులు వేసుకొని వుంచుకున్న భూమిలో నాగటితో అడుగుల వ్యవధితో సాళ్ళు తోలుకొని ఈ సాళ్ళలో ఒకటిన్నర అడుగుల అంతరంలో నిమ్మగడ్డి స్లిప్పులను ఎక్కువ స్లిప్పులు పట్టడమేగాక అంతర సేద్యానికి వీలుపడదు. ఎకరంలో 14500 స్లిప్పులు పడతాయి.
Also Read: Lemongrass Farming: మార్కెట్లో లెమన్‌గ్రాస్ మొక్కకు విపరీతమైన డిమాండ్