చీడపీడల యాజమాన్యంమన వ్యవసాయం

Leaf spot in turmeric: పసుపు పంటలో ఆకు మచ్చ తెగులు నివారణ చర్యలు

2

Turmeric cultivation సుగంధ ద్రవ్యాల పంటల్లో పసుపు ఒకటి. మనదేశంలో పసుపును ప్రధానమైన పంటగా సాగుచేస్తున్నారు. మన భారతదేశంలో పసుపును ఎక్కువ విస్తీర్ణంలో సుమారు 50 శాతం వరకు ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలోనే పండిస్తున్నారు. పసుపులో రకాలను బట్టి (210 నుండి 270) రోజుల మధ్య దుంపలను, కొమ్ములను భూమిలో నుంచి వివిధ పద్ధతుల ద్వారా తీస్తున్నారు.

పసుపును ఆహారపదార్ధాలతోపాటు, సుగంధ ద్రవ్యాలు ,ఔషదాల తయారీలో వినియోగిస్తున్నారు. మార్కెట్లో పసుపుకు మంచి డిమాండ్ ఉండటంతో రైతులు పసుపు సాగువైపు ఆసక్తి చూపుతున్నారు.ఎంతో సువాసనతో, పసుపు విలువకు ప్రాధాన్యతనిచ్చే కుర్కుమిన్‌ పదార్ధం శాతం అధికంగా ఉంటుంది. పసుపు సాగు చేయాలనుకునే రైతులు పంట బాగా ఉండాలంటే ముందుగా విత్తన శుద్ధిలో జాగ్రత్తలు తీసుకోవాలి. జాగ్రత్తలు పాటించటం వల్ల పంట దిగుబడిని చీడపీడల నుండి కాపాడుకోవచ్చు.

లక్షణాలు:

  • ఈ తెగులు దాదాపు పసుపు పండించే అన్ని ప్రాంతాలలోను ఆశిస్తుంది.
  • ఈ శిలీంధ్రం పత్రదళంను కొన్నిసార్లు పత్రవృంతం పైన ఆశించి లక్షణాలను కలుగజేస్తుంది. ఆకుల పై దీర్ఘవృత్తాకార మచ్చలు వివిధ పరిమాణాలలో ఆకుకు రెండు వైపులా ఏర్పడును.
  • ఈ మచ్చలు క్రమేపి 4-5 సెం.మీ. పొడవు, 2-3 సెం.మీ. వెడల్పు పెరుగుతాయి.

  • ముదురు మచ్చల పై తెల్లని బూడిద రంగు మచ్చలు మధ్యలో ఉండి చుట్టూరా పసుపు రంగు వలయం ఉంటుంది.
  • మచ్చల మధ్య బాగం పల్చగా తయారవుతుంది.
  • తెగులు ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు ఈ మచ్చలన్నీ కలిసిపోయి ఆకులు ఎండిపోయి మొక్కకి వ్రేలాడబడతాయి.

వ్యాప్తి:

ఈ శిలీంధ్రం దుంపలలోనూ, పంట అవశేషాలలోనూ జీవించి గాలి ద్వారా వ్యాప్తి చెందును.

నివారణ:

  • తెగులు సోకిన ఆకులను ఏరి కాల్చివేయాలి.
  • విత్తన దుంపలను కాపర్ ఆక్సీ క్లోరైడ్25% మందు ద్రావణంలో 40 నిమిషాలు ముంచి నాటుకోవాలి.
  • . తెగులు గమనించిన వెంటనే మాంకోజబ్25% లేదా కార్బండిజం 0.1% మందు 15 రోజుల వ్యవధిలో ఆగష్టు నుండి డిసెంబరు మాసాల మధ్య పిచికారి చేసుకోవాలి.
  • తెగులు తట్టుకొనే రకాలయిన టి.ఎస్. 2, టి.ఎస్. – 4, టి.ఎస్. – 79, టి.ఎస్. – 88 వంటి రకాలను విత్తుకోవాలి.
Leave Your Comments

Eriophid Mite management in coconut: కొబ్బరిలో ఇరియోఫిడ్ నల్లి ని ఇలా నివారించండి

Previous article

Cotton Crop: ప్రపంచ వస్త్ర పరిశ్రమకు మూలాధారమైన పంట.!

Next article

You may also like