Leaf Folder Management Rice: మన రాష్ట్రంలో వరి ప్రధానంగా ఖరీఫ్ మరియు రబీ పంట కాలాల్లో, పలు వాతావరణ పరిస్థితుల్లో సాగు చేయబడుతుంది. వరి ఖరీఫ్ సుమారుగా 28 .03 లక్షల హెక్టార్లలోను, రబీలో సుమారుగా 15 .84 లక్షల హెక్టార్లలో సాగుచేయబడుతూ సుమారు 142 .10 లక్షల టన్నుల ఉత్పత్తినిస్తుంది. ఖరీఫ్ లో దిగుబడి ఎకరాకు 1196 కిలోలు, రబీలో 1472 కిలోలు మరియు సరాసరి దిగుబడి 1295 కిలోలు.
గుర్తింపు చిహ్నాలు:
- రెక్కల పురుగులు చిన్నవిగా ఉండి లేత పసుపు రంగులో ఉంటాయి.
- మొదటి ఇత రెక్కల పైన రెండు గోధుమ రంగు చారలు ఉంటాయి.
- బద్దె పురుగులు ఆకుపచ్చ రంగులో ఉండి తల బూడిద రంగులో ఉంటుంది.
Also Read: పసుపు రైతుల కష్టాలు
లక్షణాలు:
- లద్దె పురుగులు ఆకు రెండు అంచులను కలిపి ఆకు చివరి భాగాన్ని మొదలుతో కలిపి ముడతగా చేస్తుంది. లద్దె పురుగు దీని లోపల ఉండి ఆకుపచ్చని పదార్థాన్ని గోకి తింటుంది. అందువల్ల ఆకులు ఎండిపోయినట్లు కన్పిస్తాయి.
- పురుగులు పెరుగుతున్న దశలలో ఎక్కువ ఆకులను కలిపి దగ్గరగా చేస్తాయి.
- పూర్తిగా పెరిగిన పురుగులు ముడతలోనే ఉండి కోశస్థ దశలు జరుపుకుంటాయి.
- ఆకు ముడతను తీసి చూసినట్లయితే లోపల లద్దె పురుగు మలం, కోశస్థ దశలు ఉంటాయి. ఈ పురుగులు వరి పైరు పిలకలు వేసే దశ నుండి ఆశిస్తాయి.
- చిరుపొట్ట దశ నుండి అభివృద్ధి చెంది వెన్ను వేసే దశలో దీని ఉధృతి అధికమౌతుంది. దీనినే “నాము తెగులు” అని కూడా అంటారు.
జీవిత చక్రం:
- ఒక తల్లి పురుగు 300 గుడ్లను పెడుతుంది. ఆకు అడుగు భాగంలో గుడ్లను పెడుతుంది.
- గుడ్లు తెలుపుతో కూడిన పసుపు రంగులో ఉంటాయి.
- గుడ్డు దశ 3-4 రోజులు. –
- లార్వా దశ 20-25 రోజులు.
- ప్యూపా దశ – 5-7 రోజులు
యాజమాన్య పద్ధతులు:
- నత్రజని ఎరువులు అధికంగా వాడినవుడు ఈ పురుగు ఎక్కువగా ఆశిస్తుంది. కనుక సిఫారసు చేసిన మోతాదులోనే నత్రజని ఎరువులు వేయాలి.
- మోనోక్రోటోఫాస్ 2ml/లీ నీటికి లేదా క్లోరోపైరిఫాస్ 2ml/లీ నీటికి లేదా ఎసిఫేట్5 గ్రా/లీ॥ నీటికి –
- లేదా కార్టాఫ్ హైడ్రోక్లోరైడ్ 2m /లీ నీటికి లేదా కార్టాఫ్ గుళికలు వేసుకోవాలి. అవసరాన్ని బట్టి 10 రోజుల తర్వాత మరల ఒకసారి ఈ మందులతో ఏదో ఒక మందు పిచికారి చేయాలి.
Also Read: తెలంగాణాలో పత్తి సాగును పెంచేలా చర్యలు
Leave Your Comments