మన వ్యవసాయం

Layer Poultry Farming: గుడ్లు పెట్టే సమయం లో కోళ్ల పోషణ

0

Layer Poultry Farming: లేయర్ కోళ్ళకు కావలసిన పోషణ పదార్థాలన్నింటిని తగుపాళ్ళ మిశ్రమం తయారు చేసుకోవాలి. రైతులు తమ ప్రాంతంలో తక్కువ ధరకు దొరికే దినుసులు ఉపయోగించి మిశ్రమం తయారు చేసుకోవచ్చు. దీనివల్ల 72 వారాల్లో 300–320గుడ్లు వరకు దిగుబడినిచ్చే అవకాశం ఉన్నది. 16-18 వ వారం నుంచి గుడ్ల ఉత్పత్తి ప్రారంభమై 25-26 వ వారం వరకు 90శాతం లేదా అంతకు మించి గుడు దిగుబడి ఉండే అవకాశం ఉంది .

Layer Farm For Egg Production

Layer Farm For Egg Production

కోళ్ల పోషణ:

  • ఈ దశలో ఏ విధమయిన ప్రయాస కలుగకుండా చూసుకోవడం, అతిముఖ్యం. టీకాలు, ముక్కులు రెండవసారి కత్తిరించటం మున్నగు కార్యక్రమాలు కోళ్ళు గుడ్లు పెట్టె దశకు చేరకముందే పూర్తి చేయాలి.
  • ఈ దశలో కోళ్ళకు రోజుకు 14 నుంచి 16గం. వెలుతురు అవసరం. అనగా పగటి వెలుతురుతోబాటు అదనంగా 4-5 గంటలు వెలుతురు రాత్రుల్లో ఇవ్వాల్సి ఉంటుంది (వారానికి 1 గంట చొప్పున). కాబట్టి 19-20 వ వారం నుంచి క్రమంగా వెలుతురు సమయాన్ని 24 వారాలకు 16 గంటలు వచ్చేవరకు పెంచాలి.
Layer Poultry Farming in India

Layer Poultry Farming in India

Also Read: టర్కీ కోళ్ళ పెంపకం లో పోషక యాజమాన్యం

  • షెడ్ లోని వెలుతురు, కోళ్ళ గుడ్ల ఉత్పత్తికి దోహదం చేస్తుంది కాబట్టి, ఈ విషయాన్ని విస్మరించకూడదు. ప్రతి 200 చ.అ. స్థలానికి ఒక 40 వాట్ల బల్బును కాని, ట్యూబులైటునుకాని అమర్చాలి.
  • ఒక్కొక్క కోడికి కనీసం 3-4 అం. మేత స్థలం, 1 అం. నీటి స్థలం లభించేలా చూడాలి. ఇందుకోసం తొట్టెల సైజును పెంచుకోవాలి. 10-12 కిలోల పరిమాణంగల మేత తొట్టి సుమారు20-25కోళ్ళకు సరిపోతుంది. దాణా మిశ్రమం ఒక రకం నుండి వేరొక రకానికి క్రమంగా మార్చాలి.
  • లిట్టరుతడిగా ఉండి, అమ్మోనియా వాసన వచ్చే పరిస్థితుల్లో 10 చ.అలకు. 1 కిలో సున్నాన్ని కలిపితే చెడువాసన నివారింపబడి కోళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి.
Layer Poultry Farming

Layer Poultry Farming

  • ప్రతి కోడికి 1.5 నుండి 2 చ.అ. స్థలాన్ని కేటాయించాలి. దగ్గరలోని ఫారంలో కాని, అదే ఫారంలోకాని ఏవైనా రోగాలు ప్రబలినపుడు అవసరాన్ని బట్టి మందులు లేదా టీకాలు వేసి కోళ్ళను కాపాడవచ్చు.
  • పెరిగే దశలో ఎక్కువ సమయం వెలుతురునిస్తే గర్భసంచి బయటకు వచ్చి (ప్రాలాప్స్) చాలా సమస్యలు కలిగిస్తుంది.
  • గుడ్లు పెట్టని కోళ్ళను ఏరివేయటం, కోళ్ళ పెంపకం లాభసాటిగా జరగడానికి, నాసిరకమైన కోళ్ళను తరచు ఏరివేయటం ముఖ్యం.
  • నాసిరకపు కోళ్ళు అవకుండా తగు యాజమాన్య పద్ధతులను – గృహవసతి, నాణ్యతగల దాణా, రోగనిరోధక శక్తి, రోజువారి పోషణలో సక్రమమైన చర్యలను చేపట్టాల్సి ఉంటుంది.

Also Read: కోళ్ల జాతులు మరియు వాటి ప్రత్యేకత

Leave Your Comments

Aloe Vera Cultivation: కలబంద సాగులో మెళుకువలు

Previous article

Sheep Transport: గొర్రెల రవాణా సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

Next article

You may also like