RICE మన రాష్ట్రంలో వరి ప్రధానంగా ఖరీఫ్ మరియు రబీ పంట కాలాల్లో, పలు వాతావరణ పరిస్థితుల్లో సాగు చేయబడుతుంది. వరి ఖరీఫ్ సుమారుగా 28 .03 లక్షల హెక్టార్లలోను, రబీలో సుమారుగా 15 .84 లక్షల హెక్టార్లలో సాగుచేయబడుతూ సుమారు 142 .10 లక్షల టన్నుల ఉత్పత్తినిస్తుంది. ఖరీఫ్ లో దిగుబడి ఎకరాకు 1196 కిలోలు, రబీలో 1472 కిలోలు మరియు సరాసరి దిగుబడి 1295 కిలోలు.
నాట్లు వేయటానికి పొలాన్ని తయారు చేయటం :
నాట్లు వేయటానికి 15 రోజుల ముందే పొలాన్ని దమ్ము చేయుట ప్రారంబించి 2 – 3 దఫాలుగా మురగ దమ్ము చేయాలి . పొలమంతా సమానంగా దమ్ము చెక్కతోగాని. అడ్డతోగాని చదును చేయాలి. రేగడి భూముల్లో నాట్లు వేయటానికి 2 రోజుల ముందుగానే దమ్ము పూర్తి చేసి, ఆ తర్వాతనే నాట్లు వేస్తే మంచిది.
నాట్లు :
నారు తీసేటప్పుడు మొక్కలు లేతాకుపచ్చగా ఉంటేనే మూన త్వరగా తిరుగుతుంది. నాలుగు నుండి ఆరు ఆకులున్న న్నరును ఉపయోగించాలి ముదురు ఆకును నాటితే దిగుబడి తగ్గుతుంది . నటుపైపైన నాటితే పిలకలు ఎక్కువగా తొడిగే అవకాశముంది. నాట్లు వేసేటప్పుడు భూసారాన్ని అనుసరించి ఖరీఫ్ లో చ||మీ||కు 33 మూనలు , రబీలో 44 మూనలు ఉండేలా చూడాలి. నాటిన తర్వాత ప్రతి రెండు మీటర్లకు 20 సెం. మీ. బాటలు తీయటం వలన పైరుకు గాలి, వెలుతురు బాగా సూకీ చీడపిడల ఉధృతి కొంత వరకు అదుపు చేయవచ్చు . ఎరువులు, పురుగు మందులు, కలుపు మందులు వేయటానికి ఇంకా పైరు పరిస్థితిని గమనించటానికి ఈ బాటలు బాగా ఉపయోగపడతాయి . వరి రకాల కాలపరిమితిని బట్టి కుదుళ్ళ సంఖ్యను నిర్ధారించాలి .
ఆలస్యంగా నాటడానికి మొలకల వయస్సు
అసహజ వాతావరణ పరిస్థితులు మరియు/లేదా ఇంటెన్సివ్ క్రాపింగ్ సిస్టమ్ కారణంగా వరి నాటు ప్రక్రియ క్లిష్టమైన కాలం కంటే కూడా ఆలస్యంగా జరుగుతుంది. అటువంటి పరిస్థితిలో, కపుర్తల నుండి నాటడం ఆలస్యం కావడం వల్ల నష్టాన్ని పూడ్చుకోవడానికి కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకోకుండా ఆర్థికంగా లాభదాయకమైన దిగుబడి సాధ్యం కాకపోవచ్చు, 65 రోజుల వయస్సు గల మొక్కలు 45 మరియు 30 రోజుల వయస్సు గల మొక్కల కంటే 10 మరియు 31% అధిక దిగుబడిని ఇచ్చాయని నివేదించింది. పాత మొలకలు బలంగా పెరిగాయి, ఎక్కువ పొడి పదార్థాన్ని సేకరించాయి, అధిక స్పైక్‌లెట్ సంతానోత్పత్తి, పానికిల్ బరువు మరియు 1,000-ధాన్యం బరువును చూపించాయి. అరవై రోజుల వయసున్న మొలకలు ముందుగా 50% పుష్పించే మరియు పరిపక్వతను చూపించాయి మరియు తక్కువ ఉష్ణోగ్రత నుండి తప్పించుకున్నాయి, అయితే 30 రోజుల వయస్సు గల మొలకలు పూయలేదు మరియు 45 రోజులు ఆలస్యంగా నాటడం ద్వారా పూర్తి పానికల్ ఎక్సర్షన్‌ను ప్రదర్శించలేదు.