చీడపీడల యాజమాన్యంమన వ్యవసాయం

Late blight of tomato: టమాట ఫైటాఫ్తోరా ఎండు తెగులు లక్షణాలు మరియు నివారణ చర్యలు

0

Tomato భారతదేశంలో ఇప్పటికీ చాలా మంది ప్రజలు వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నివసించే చాలా మంది ప్రజలు వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. అయితే భారత రైతుల ఆర్థిక పరిస్థితి బాగా లేదు. ఇక్కడ వ్యవసాయాన్ని లాభాపేక్షలేని రంగంగా పరిగణిస్తారు. వ్యవసాయంలో నష్టం వాటిల్లడంతో పెద్దసంఖ్యలో రైతులు తమ గ్రామాలను వదిలి నగరంలో పని చేయాల్సి వస్తోంది. కానీ సరిగ్గా సాగు చేస్తే రైతులను ధనవంతులుగా మార్చగల అనేక పంటలు ఉన్నాయి. టమోటా పంట రైతులకు మంచి ఆదాయ వనరుగా మారుతుంది.

కారకం: ఈ తెగులు ఫైటాఫ్తోరా ఇన్ఫెస్టాన్స్ అను శిలీంధ్రం వలన కలుగుతుంది.

లక్షణాలు: నేల పైన ఉన్న మొక్క యొక్క అన్ని భాగాలకు తెగులు సోకుతుంది. ఆకుల పై గోధుమ వర్ణపు కణజాల క్షయపు మచ్చలు ఏర్పడి ఆకులు ఎండిపోవును. తెగులు తొలిదశలో పాలిపోయిన ఆకుపచ్చ వర్ణముతో ఉండి తరువాత గోధుమ వర్ణము నుండి నలుపు వర్ణపు మచ్చలుగా మారును. ఈ ఎండిపోయిన.. మచ్చలు ముందుగా ఆకుల చివరి భాగాలలో కాని అంచులలో కానీ ఏర్పడి అనుకూల వాతావరణ పరిస్థితులలో ఆకు అంతటా వ్యాపించును. అధిక తేమ గల ప్రాంతాలలో తెగులు తొందరగా వ్యాప్తి చెందును. పొడి వాతావరణంలో తెగులు వ్యాప్తి నెమ్మదిగా జేరుగును. తెగులు లక్షణాలు ముందుగా మొక్క క్రింది ఆకులపై కనిపించును. కాయలపై ముదురు గోధుమ వర్ణపు జిగురులాంటి మచ్చలు ఏర్పడును. ఈ మచ్చలు పెరిగి కాయ అంతటా వ్యాపించును. తెగులు సోకిన కాయ భాగం తొలిదశలో కాయకు అంటుకొని ఉండును. తేమ గల వాతావరణంలో కాయలలో పగుళ్ళు ఏర్పడి, తెల్లని శిలీంధ్రం పెరుగుదల కనిపించును. ఈ తెగులు విత్తనం ద్వారా వ్యాప్తి చెందదు. శిలీంధ్రబీజాలు వర్షము . నీటి ద్వారా లేక సాగు నీటి ద్వారా, ఆకులను తినే కీటకాల ద్వారా మరియు పొడి వాతావరణంలో గాలి ద్వారా వ్యాప్తి చెందును.

క్రింద తెలిపిన వాతావరణ పరిస్థితుల ఆధారంగా తెగులు సోకే సమయాన్ని గుర్తించవచ్చును. రాత్రి ఉష్ణోగ్రత పొగ మంచు ఏర్పడటానికంటే తక్కువగా ఉండాలి. ఈ ఉష్ణోగ్రత కనీసం 4 గంటలైనా ఉండాలి.

  • అత్యల్ప ఉష్ణోగ్రత 10°C ఉండాలి. మరుసటి రోజు మబ్బులు ఉండాలి.
  • 24 గంటలలో కనీస వర్షపాతం1 మి.మీ. ఉండాలి.

నివారణ:

  • నేలలో శిలీంధ్ర బీజాలు జీవించే ప్రదేశంలో టమాట పంటను వేయరాదు.
  • తెగులు లక్షణాలు కనిపించక ముందే జీనెబ్, మాంకోజెబ్, డెకోనిల్, డై పోలటాస్ వంటి మందులను (1.5 నుండి5 కిలోలు / హెక్టారుకు ఆకులు అడుగు భాగంలో పడువిధంగా పిచికారి చేయాలి.
  • పొలంలో తేమను తగ్గించడానికి మొక్కలను సిఫారసు చేసిన దూరంలో నాటాలి.
  • తెగులు సోకే ప్రదేశంలో నత్రజని, ఎరువుల మోతాదు తగ్గించాలి.

 

 

Leave Your Comments

Soil pollution : నేల కాలుష్యం కావడానికి కారణాలు

Previous article

Poultry farming: కడక్ నాథ్, అసిల్, బస జాతి కోళ్ల లక్షణాలు మరియు ఉపయోగాలు

Next article

You may also like