Kora Meenu Fish Farming: తెలంగాణ ప్రభుత్వం నీలి విప్లవం స్పూర్తితో ఉచిత చేప పిల్లల పంపిణి పథకం ద్వారా రైతులను చేపల పెంపకం వైపు ప్రోత్సహిస్తుంది. ఇతర వ్యవసాయాధార ఉపాదులతో పోలిస్తే చేపల పెంపకంలో తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం పొందవచ్చు. నిర్వహణ కూడా చాల సులభం ,కూలిల అవసరం చాల తక్కువ .చేపల పెంపకం రైతులకు ఆదాయాన్ని పెంచడం తొ పాటు నిరుద్యోగ యువతకు ఉపాది కల్పనకు తోడ్పడుతుంది. కోడి, మేక మాంసంతో పోలిస్తే చేపలు ఆరోగ్య రిత్య చాల మంచివి.
- ప్రజలు ఎక్కువగా ఇష్టపడి తినే కోరమిను తెలంగాణ రాష్ట్ర చేపగా గుర్తించారు . కోరమిను అనేది నలుపు రంగు , గట్టి దేహంతో హుషారుగా ఉండే చేప రకం .ఈ చేప రకాన్ని శాస్త్రీయంగా చెన్నాస్ట్రయేటా అంటారు.
- ఈ చేపలో 2-3 శాతం కొవ్వు , 16-18 శాతం మాంసకృతులు ,ఐరన్ ,విటమిన్ సమృద్దిగా ఉంటాయి.వీటి తల పాము తలను పోలి ఉంటుంది ,కాబట్టి వీటిని స్నేక్ హెడ్ మరల్స్ అని కూడా అంటారు.
పెంపకానికి అనువైన వనరులు: కోరమిను చేపలు అన్ని రకాల మంచి నీటి వనరులలో పెరుగుతాయి . బురద చిత్తడి నేలలు ,ఒండ్రు మట్టి తొ నిండిన నీటి ప్రాంతాలు ,కలుపు మొక్కలతో నిండిన నీటి లోను కోరమిను పెంచుకోవచ్చు.
నర్సరీ యాజమాన్యం :15 నుంచి 20 రోజుల చేప పిల్లలు సున్నితంగా ఉంటాయి వీటిని నేరుగా పెద్ద చెరువులో కాకుండా ముందుగ నర్సరీ చెరువులో పెంచి , తర్వాత పెంపక చెరువులో పెంచాలి.కోరమిను చేపల నర్సరీ చెరువు విస్తీర్ణం 200 నుండి 400 చ.మీ ఉండాలి , లోతు 0.5 నుండి 0.75 మీ ఉంటె చాలు.ఎరువుల వాడకం వలన ప్లవకాల (plankton) ఉత్పత్తి అవతుంది,చేప పిల్లలకు ఆహారంగా ఉపయోగపడుతుంది.
చేప పిల్లల స్టాకింగ్: ఆరోగ్యవంతమైన 15-20 రోజుల వయసు గల చేపలను ఎకరానికి 50000 నుండి 80000 వరకు వదులుకోవచ్చు .వాతావరణం నుండి నేరుగా గాలి పీల్చుకోవడం వీటి ప్రత్యేకత.
పెంపక చెరువు యాజమాన్యం : నీటి లోతు 3-4 అడుగులు ఉండాలి.చెరువులో ఆక్సిజన్ స్థాయి తగ్గింత మాత్రన ఈ చేపలు చనిపోవు కానీ ఒత్తిడికి గురై ఇతర వ్యాదులు వచ్చే అవకాసం ఉంటుంది.చెరువులో నీటి ఆక్సిజన్ 3-5 PPM ఉండాలి, PH-7-8.5 వరకు ఉండవచ్చు.
Also Read: చేపల చెరువు కలుపు మొక్కల యజమాన్యము
ఉత్పత్తి -ఆదాయం : ఒక హెక్టారుకు 5000 కోరమిను చేప పిల్లలు వేసుకుంటే 80 శాతం మనుగడ ఉన్నట్లయితే దదాపు నాలుగు టన్నుల ఉత్పత్తి సాదించవచ్చు . ఇందుకోసం సుమారు 6-8 టన్నుల మేత వాడాల్సి ఉంటుంది . ఒక్క కేజీ కోరమిను ధర కనీసం 250 రూపాయలు వరకు ఉంటుంది . అంటే సుమారు హెక్టారుకు పది లక్షల వరకు దిగుబడి వస్తుంది .రైతుకు నికర ఆదాయం 4-5 లక్షల వరకు ఉంటుంది.
కొరమిను చేప ఔషధ ప్రాముఖ్యత : ఉబ్బసం వ్యాదిని నివారించడానికి ప్రతి ఏట మృగశిర కార్తె రోజున బత్తిని సోదరులు పంపిణి చేసే మందులో ఈ చేపలను వాడతారు.
Also Read: కుంటలలో చేపలను వదిలిపెట్టే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు