Azolla Intercropping In Rice: రాష్ట్రంలో ఏర్పడుతున్న వర్షాభావ పరిస్థితుల కారణంగా సన్న చిన్నకారు రైతులు కరవు కాటకాలకు గురవుతున్నారు. పాడి-పంటలు సమృద్ధిగా ఉన్నప్పుడే రైతుల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యవసాయ రంగంలో సమస్యలు తీరని స్థాయికి చేరుకున్నాయి. వ్యవసాయంలో సంభవించు ఆటు పోట్లను తట్టుకొనే ఆర్థిక వెసులు బాటు వేడి నీళ్ళకు చన్నీళ్ళు తోడు” లాగ వ్యవసాయంతోపాటు వ్యవ సాయ అనుబంధ కుటీర పరిశ్రమ లపై దృష్టి సారించాలి.

Azolla Intercropping In Rice
అందులో ప్రధానమైనవి 1. పాడి పరిశ్రమ, 2. కోళ్ళు, 3. పందులు, 4. మేకలు, 5. గొర్రెలు, 6. కుందేళ్ళు. 7. చేపల పెంపక పరిశ్రమలు. వీటి ద్వారా అదనపు ఆదాయాన్ని సమకూర్చుకోవటంతో పాటు వాటి మల మూత్రాలు వ్యవసాయ భూమికి సేంద్రియ ఎరువుగా ఉపయోగపడతాయి. వాతావరణంలో కాలుష్యాన్ని నివారించి విష అవశేషాలు లేని ఆహార ఉత్పత్తులను పండించుకోగలుగుతాం.
అజొల్లా: అజొల్లా మొక్క నీటిపై తేలుతూ నీటిలో పెరిగే మొక్క ఇది ఆకుపచ్చ ఫెర్న్ జాతికి చెందినది. తమిళనాడు, కేరళలో వినియోగం కొంతవరకు ప్రాచుర్యం పొందింది. మన రాష్ట్రంలో మాత్రం వెనుకంజలో ఉంది. విస్తరణ కార్యక్రమం మందకొడిగా కొనసాగుతుంది.
రైతు అనుభవాలు: గుంటూరు జిల్లా కూచిపుడి గ్రామంలో ఖరీఫ్ లో అర ఎకరం వరి వేశాను. అంతర పంటగా అజొల్లా పెంచాను. ఆశించిన విధంగా పెరుగుదల వచ్చింది. సులువుగా అజొల్లాను బయట తెచ్చేందుకు 15 సెంట్ల మడిలో జపాన్ వరిసాగు పద్ధతి పాటించాను. అంటే వరిని సాళ్లలో నాటాను. ప్లాస్టిక్ తాడు సాయంతో సాళ్ల మధ్య 45 .మీ. మొక్కకు మొక్కకు దూరం సుమారుగా 15 సెం.మీ. ఉండేలాగా వరుసగా నాటాలి.

Azolla intercropping in rice
మెలకువలు: వరి మాగాణిలో నీరు సాధారణంగా ఉండే స్థాయి (2-3 అంగు దల లు). పెరుగుదల ఒక వారానికి 8 రెట్లు కలిగి ఉంటుంది. దమ్ములో సింగిల్ సూపర్ పాస్పేట్ 100 కిలోలు/ ఎకరాకు వినియోగించాలి.
Also Read: Intercropping: సమగ్ర సస్యరక్షణలో అంతరపంటలు, ఎరపంటలు,కంచె పంటల ప్రధాన్యత
ఎండిపోతాయి. యూరియా వినియోగించరాదు.వరి పెరుగుటకు ఎలాంటి ఆటంకం కలగదు. నీరు లేకపోయినా తడి గల బురదలో జీవించి ఉంటుంది. 8. నేల బాగా ఎండితే చనిపోయి,ఎoడిపోతుంది. బాగా వృద్ధి చెందినపుడు కిక్కరిసి ఉండటం వల్ల నాచు ఒకదానిపై చేరి పైన ఉన్నదీ ఎండిపోతుంది. నీరు లోతుగా ఉన్న గట్టు వైపు న తెట్ట కట్టి, తరువాత ఎగువకు విస్తరిస్తుంది.నీరు తొలగించాల్సిన పరిస్థితు ల్లో నీరు పోయే అడ్డంగా కొన్ని చెత్తపరకలు ఉంచితే బయటకు కొట్టుకుపోదు. వాతావరణంలో 30-35 సెం.గ్రే. వేడిని మాత్రమే తట్టుకుం టుంది.వర్షాకాలం, చలికాలం పెరుగుదల బాగా ఉండి వేసవిలో పెరుగుదల తక్కువగా ఉంటుంది.50 శాతం నీడ, 50 శాతం సూర్యకాంతి పడేవిధంగా ఉన్నచోట పెరుగుదల బాగా ఉంటుంది.నేలకొరగని వరి రకాన్నే సాగు చేయాలి.వరిసాళ్లు తూర్పు-పడమర దిశలో ఉండే విధంగా నాటాలి. వరి నాటిన 20 రోజుల తరువాత అజొల్లాను చల్లాలి.
చీడపీడలు: చీడలు ఆశించిన తొలిదశలో గ్రహించి ఒక ఎకరాకు తగుమోతాదులో 5-10 కిలోల ప్యూరడాన్ గుళిక లు వాడి నివారించవచ్చు.శిలీంద్రం ద్వారా ఏర్పడే కుళ్ళుతెగులు సోకితే కార్బెండాజిమ్ 50 శాతం మందును ఒక లీటరు నీటికి 2 గ్రా. చొప్పున కలిపి పిచికారి చే యాలి.
-Rakesh Jhadi
Ph.D. Research Scholar
Department of Agronomy
Bidhan Chandra Krishi Viswavidhyalaya
Contact no:9505410171
Also Read: Benefits of Inter Cropping: అంతర పంటల సాగుతో ప్రయోజనాలు
Must Watch: