Tomato Integrated Plant Protection: నీరు నిల్వకుండా ఎతైన నారుమడులను తయారు చేసుకోవాలి. దీని ద్వారా నారుకుళ్ళు తెగులును నివారించవచ్చు. తప్పనిసరిగా విత్తన శుద్ది పాటించాలి. 3 గ్రా. థైరామ్ లేదా కెప్టెన్ తో చేయాలి. భూమిని లోతుగా దున్నీ, సూర్య రశ్మి ప్రసారం చేయడం ద్వారా కిటకాల కోశస్థ దశలను,శిలింద్రాణాలను నాశనం చేయవచ్చు. పంట దశలో కిటకాల గుడ్లను, లద్దె పురుగులను ఏరి వేసి పంటలను సంరక్షించుకోవాలి. గట్ల మీద కలుపు మొక్కలు లేకుండా నిర్మూలించడం ద్వారా చీడ పీడల బెడదను తగ్గించుకోవచ్చు.
ఎకరాకు నాలుగు లేదా ఐదు లింగాకర్షణ బుట్టలను లేదా దీపపు ఎరాలను ఏర్పాటు చేసుకోవడం వలన కీటకాల ఉధృతిని అరికట్టవచ్చు.
శనగ పచ్చ పురుగు, రబ్బరు పురుగుల ఉనికిని గుర్తు పట్టవచ్చు.
చీడ పీడలు ఆశించిన మొక్క భాగాలను కత్తిరించి తొలగించడం ద్వారా తీవ్రతను తగ్గించవచ్చు.
కీటకాల లార్వాలను పక్షులు తినడానికి వీలుగా పొలంలో 15-20 వరకు పక్షులు నిలబడటానికి పక్షి స్థావరాలను ఏర్పరచాలి.
సింథటిక్ పైరిత్రాయిడ్ ను వాడరాదు.
ఫ్రెంచ్ బీన్స్ తో పంటతో పంట మార్పిడి చేస్తే బాక్టీరియా ఎండు తెగులు నివారించవచ్చు.
ఆవాలు, బంతి, ధాన్యపు పంటలతో పంట మార్పిడి చేయడం వల్ల నులిపురుగుల ఉధృతి తగ్గుతుంది.
పంట మార్పిడి తో పాటు టమాటో పంటలో బంతిని ఎర పైరు గా చేయడం వలన పచ్చ పురుగు తగ్గించవచ్చు. ఒక వరుస బంతి ప్రతి 16 వరుసల టమాటో.
వృక్ష సంబంధ జీవ సంబంధ క్రిమి నాశినాలను వాడాలి.
Also Read: Tomato Cultivation: టమాటో సాగు.!
వైరస్ ద్రావణాన్ని ఎకరాకి 250 ఎల్. ఇ పిచికారీ చేస్తే కాయతొలుచు పురుగును నివారణ చేయవచ్చు.
ట్రైకో గ్రామా పాడ్స్ పూత దశకు ముందు ఏర్పర్చినట్లు అయితే శనగ పచ్చ పురుగు, లద్దె పురుగులను సమర్థవంతంగా అరికట్టవచ్చు.
బిటి 2 గ్రా. లీ. పిచికారీ చేయడం వలన శెనగ పచ్చ పురుగును, లద్దె పురుగును అరికట్టవచ్చు.
మొక్కలు వాడాలి పడిపోకుండా ఊతములను ఏర్పరచవలెను.
ప్రతి మూడు వరుసల టమాటో కి 2 వరుసల మొక్కజొన్నను వరుసలలో విత్తుకోవాలి.దీని వల్ల రసం పీల్చు పురుగుల ఉధృతి ని తగ్గించవచ్చు.
పొలంలో అక్కడక్కడా ఎకరాకు 4 చొప్పున పసుపు రంగు పూసిన రేకులను ఆముదం లేదా గ్రిజు పూసి పెట్టినట్లుయితే తెల్ల దోమలు అతుక్కుని నివారింపబడతాయి.
మొక్క పెరుగుదల దశలో లీటర్ నీటికి 5 మీ. లీ. వేపగింజల కాషాయాన్ని కలిపిన 15 రోజుల తేడాతో నాటిన 30 రోజుల నుండి పూత దశ వరకు పిచికారీ చేయాలి.
బాక్టీరియా ఎండు తెగులు ఉన్న చోట ఎకరాకు 6 కిలోల చొప్పున బ్లీచింగ్ పౌడర్ ను కలిపి నాటడానికి ముందు భూమిలో కలిసేలా వేయాలి.
రసం పీల్చు పురుగుల నివారణకు కార్బోఫ్యూరాన్ గుళికలు ఎకరానికి 10 కిలోల చొప్పున వేయాలి.
Also Read: Tomato Diseases: టమాట పంటలో పొగాకు లద్దె, అక్షింతల పురుగుల యాజమాన్యం.!