Mango Plant Protection: మన రాష్ట్రంలో మామిడి షుమారుగా 7,64,495 ఎకరాల విస్తీర్ణంలో సాగుచేయబడుతూ 24,45,824 టన్నుల మామిడి పండ్లు ఉత్పత్తి చేయబడుతుంది. మామిడిని ప్రధానంగా కృష్ణా, ఖమ్మం, విజయనగరం, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, శ్రీకాకుళం, కరీంనగర్, విశాఖపట్నం, చిత్తూరు, కడప, అదిలాబాదు మరియు నల్లగొండ జిల్లాల్లో విస్తారంగా సాగుచేస్తారు. దేశపు ఉత్పత్తిలో షుమారు 24 శాతం వాటా మన రాష్ట్రానిదే. మామిడి కాయల్లో విటమిన్ సి, ఇ, యాంటీ ఆక్సిడెంట్లు అధికం ఉంటాయి. అందువల్ల వీటిని తింటే రోగ నిరోధక శక్తి బాగా పెరుగుతుంది. సీజనల్‌గా వచ్చే దగ్గు, జలుబు, జ్వరం సమస్యల నుండి విముక్తి పొందవచ్చు. వ్యాధులు, ఇన్‌ఫెక్షన్లు రాకుండ అడ్డుకోవచ్చు. మామిడి ఫైబర్లో పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది. అజీర్ణం, మలబద్దకం, గ్యాస్ సమస్యలు తగ్గుతాయి.

Mango Plant Protection
Also Read: Mango cultivation: మామిడి లో మొక్కల వ్యాప్తి ఎలా జరుగుతుంది
మామిడి రకాలు: దాదాపు భారతదేశంలో 1000 మామిడి రకాలు ఉన్నాయి. అయితే వీటిలో దాదాపు 20 రకాలను మాత్రమే వాణిజ్య స్థాయిలో పండిస్తున్నారు. భారతదేశంలోని మామిడి యొక్క వాణిజ్య రకాలు దేశంలో వివిధ ప్రాంతాలకు ప్రత్యేకమైనవి.
మామిడిలో సమగ్ర సస్యరక్షణ
- మామిడిపై అతిగా దాడిచేసే తేనె మంచు పురుగులు, పూత, పిందె, గూడు పురుగులు, కాయతొల్చే టెంకెురుగులను దృష్టిలో వుంచుకొని నిఘా కార్యక్రమం చేపట్టాలి. తేనెమంచు పురుగుల్ని కొంత వరకు బనెషన్ (బంగినపల్లి) తట్టుకోగలదని గుర్తించబడింది.
- తోటలో ముఖ్యంగా ఎండు పుల్లలున్న కొమ్మల్ని విరిచి చెట్ల పరిసరాల్ని శుభ్రంగా ఉంచి, నిద్రదశలో ఉండే పురుగుల్ని బహిర్గత పరచాలి. గాలి వెలుతురు చొరబడగలిగిన చెట్లపై పురుగుల పెరుగుదల తక్కువ.
- చెట్ల మొదట్లో చెదపురుగులు వృద్ధి కాకుండా చేసి చెట్లకు 4-6 అడుగుల ఎత్తు వరకు బోర్డోపేస్ట్ సంవత్సరానికి రెండు సార్లు పుయ్యాలి.
- మామిడి పూత సమయంలో మొదలయ్యే తేనె మంచు, తామర పురుగుల అదుపుకై యిమిడాక్లోప్రిడ్ వంటి కొత్త త్వరం మందును వాడాలి. ఎజడిరెక్టిన్ (వేప సంబంధిత) మందు కూడా వీటిపై పని చేస్తుంది. ఇవి దొరకని ప్రాంతాల్లో ఎండోసల్ఫాన్ మందు వాడవచ్చు.
- అయితే పూతలేని సమయంలో ఈ దోమల పెరుగుదల కాండం మీద ఉంటుంది. వీటిని గుర్తించి, కృత్రిమ జిగురు పట్టిళ్లను మొదళ్లపై పరచి వీటి సంఖ్యను తగ్గించవచ్చు.
- ముట్టె పురుగుల ఉధృతిని గుర్తించే నిమిత్తం చెట్ల పరిసరాల్లో మొదలు పగుళ్లలో వెతికి వాటి అదుపుకై కాయ పెరిగే సమయంలో ఫెంతియాన్ అనే మందు చల్లుకోవాలి.
- మామిడిని పూత సమయంలో ఆశించే బూడిద పూతగెల మచ్చ తెగుళ్లను తగ్గించే నిమిత్తం కార్బండిజమ్ మందును చల్లుకోవాలి.
- మామిడి పండు ఈగల్ని తగ్గించే నిమిత్తం మిథైల్ యుజినాల్ ఎరల్ని వాడాలి.
Also Read: Mango Cultivation: మామిడిలో నేల తయారీ మరియు మొక్కలు నాటుటలో మెళుకువలు.!