Integrated Farming: చిన్న సన్న కారు రైతులేక్కువగా పంటలతో పాటు పాడి పశువులు , గొర్రెలు , మేకలు , కోళ్ళు, చేపలు , పట్టు పురుగులు వగైరా పెంపకం చేపడితే ఖచ్చితమైన ఆదాయం పొందడమే కాకుండా భూ సారాన్ని కూడా కాపాడుకోవచ్చు. సమగ్ర వ్యవసాయ విదానాల వల్ల రైతుకు ఒక దానిలో నష్టపోఇన మరో దానిలో రాబడి వచ్చి ఆర్థికంగా నిలదొక్కుకొనే వీలుంటుంది . రైతులకు నిరంతర ఉపాధి ,స్థిరమైన ఆదాయం లభిస్తుంది.
- వ్యవసాయన్నీ అనుబంధ రంగాలతో కలిపి చేయడాన్ని సమగ్ర వ్యవసాయం అంటారు. 70-80 శాతం భూమిలో ఆహర పంటలు మిగతాది అనుబంధ రంగాలను ఎంచుకోవాలి .
- వర్షాధార తేలిక నేలల్లో రైతులు కేవలం ఖరిఫ్ లో జొన్న , మొక్క జొన్న , ఆముదం , వేరుసెనగ , పొద్దుతిరుగుడు, పత్తి, కంది , పెసర , సజ్జ వంటి పైర్లు సాగు చేస్తారు .దీనికి బిన్నంగా సగటున 3 ఎకరాలు ఉన్నా సన్నకారు రైతు ఒక ఎకరంలో జొన్న +కంది , ఒక ఎకరంలో వేరుసెనగ, అర ఎకరం చొప్పున రాగి ,ఆముదం పైర్లు విత్తుకొన్ని, గట్ల పైన సుబాబుల్, తుమ్మ, సేస్బానియ వంటి మేతనిచ్చే చెట్లు, రేగు , సితాఫలం , నేరడు పండ్ల మొక్కలు నాటాలి. పశువుల మేతకు పనికి రాని వ్యర్థాలతొ కంపోస్ట్ చేసి వాడాలి. పాడి పశువులు, జీవాలు, పెరటి కోళ్ళు పెంపకం చేపట్టాలి.
Also Read: సమగ్ర వ్యవసాయంలో అధిక లాభాలు ఆర్జిస్తున్న యువరైతు..
- బోరు బావుల కింద : ప్రణాళిక బద్దంగా ఖరిఫ్ , రబీలో పంటలతో పాటు అనుబంధ పరిశ్రమలు ఏర్పాటు చేసుకొని ఖచ్చితమైన ఆదాయం పొందవచ్చు . గట్ల పైన పశుగ్రాస చెట్లు, కంచెగా కరోండా మొక్కలు నాటాలి. సేంద్రియ ఎరువులు, వెర్మి కంపోస్ట్ తయారు చేసి వాడాలి. రాయితీతో గోబర్ గ్యాస్ ప్లాంట్ , సోలార్ పంప్ సెట్లు నెలకొల్పుకోవాలి .
- 3 ఎకరాలున్న రైతు అర ఎకరంలో పెసర+కంది , అర ఎకరంలో రాగి,వేరుసెనగ ,అర ఎకరంలో వరి, అర ఎకరంలో పశుగ్రసాలు కొ-4,కొ-5 , లూసర్న్ , అర ఎకరంలో కూరగాయలు , అర ఎకరంలో జామతోట పెంచుకోవాలి . దీనికి తోడూ 3 ముర్రే గేదెలు, 5 మేకలు, 30 పెరటి కోళ్ళు , కుందేళ్ళ పెంపకం వంటివి చేపడితే రూ 2 -2.3 లక్షల వరకు నికరాదాయం పొందవచ్చు.
- ఆయకట్టు ప్రాంతంలో ప్రాజెక్టులు , చెరువుల కింద రైతు లంత ఎక్కువగ వరి సాగు చేస్తారు. ఇక్కడ వరి తొ పాటు బహు వార్షిక పశుగ్రసాలు సాగుచేసి పాడిపశువుల్ని పెంచాలి. ముంపు ప్రాంతాల్లో చేపలు పెంచుకోవచ్చు.
Also Read: ప్లాస్టిక్ మల్చింగ్ యొక్క ప్రయోజనాలు – సమగ్ర యాజమాన్య పద్ధతులు
Leave Your Comments