ఆహారశుద్దిమన వ్యవసాయంవ్యవసాయ వాణిజ్యం

 ప్రపంచ నూనెగింజల విస్తీర్ణం 20 % భారత్ లోనే

1
oil seeds

Oil Seeds : – ప్రపంచ నూనె గింజల పంటల సాగు విస్తీర్ణంలో 20 శాతం నూనెల ఉత్పత్తిలో 10 శాతం  మన దేశంలోనే జరుగుతోంది. గత 30 ఏళ్లలో దేశంలో నూనెగింజల పంటల  విస్తీర్ణం, నూనెల ఉత్పత్తి గణనీయంగానే వున్నా పెరుగుతున్న దేశ జనాభా అవసరాలకు ఏ మాత్రం చాలనందున అవసరమైన వంట నూనెల్లో 60 శాతం విదేశాల నుండి దిగుమతి చేసుకుంటున్నాం. గోధుమ, వరి పంట  ఆహారపంటలు సాగు విస్తీర్ణంతో పోలిస్తే నూనె గింజల పంటల సాగు పెరుగుదల తక్కువే. అందువల్ల నూనె గింజల ఉత్పత్తిలో దేశ ప్రజల అవసరాలు తీర్చడానికి పెద్ద ఎత్తున వివిధ వ్యవసాయ బౌగోళిక మండలాలో అక్కడి వాతావరణ పరిస్థితులకు అనువైన పంటల సాగు చేపట్టడం, ఉత్పాదకత పెంచడం ఎంతో అవసరం. 1989 -90 లలో మన దేశమే నూనెల ఎగుమతులు గణనీయంగా చేసినా మరో పదేళ్లకు వివిధ కారణాల వల్ల మళ్ళీ వంట నూనెల కొరత ఏర్పడింది. నూనె గింజ పంటల సాగు ప్రధానంగా మధ్య ప్రదేశ్( 28 శాతం), రాజస్థాన్ (21 శాతం),మహారాష్ట్ర (15 శాతం) జరుగుతోంది. గుజరాత్ ,ఆంధ్ర ప్రదేశ్,తెలంగాణ ,కర్ణాటక లోను నువ్వులు,వేరుశనగ,సోయా,పొద్దు తిరుగుడు,కుసుమ వంటి నూనె గింజల పంటలు సాగువుతున్నాయి. వంటనూనెలకు ఏటా 6 శాతం గిరాకీ పెరుగుతోంది.

Also Read : కందిలో తెగుళ్ళు – యాజమాన్యం

oil seeds

oil seeds ( నూనె గింజలు )

2009 – 10 లో కోటి 40 లక్షల టన్నులున్న నూనెల వాడకం 2018 -19 నాటికి 2 కోట్లు టన్నులకు పెరిగింది. సగటున ఒక్కొక్క మనిషి ఏటా 19 కేజీల వంట నూనెలు వాడుతున్నారు. దేశంలో నూనె గింజల ఉత్పత్తిని ప్రోత్సహించడానికి 1977 ఆగష్టులో హైదరాబాద్ లో నూనె గింజల పరిశోధనా సంస్థను ఏర్పాటు చేసారు. వరి, గోధుమ ,చెరకు పంటలకు ప్రోత్సహకాలు చేయటం వల్ల పంటల మార్పిడిలో భాగంగా రైతులు ఆ పంటల వైపు మొగ్గ నూనె గింజల సాగు తగ్గించారు. దేశంలోని నూనెగింజల పంటల ఉత్పత్తి,ఉత్పాదకతను పెంచడానికి నూనెగింజల పరిశోధన సంస్థ అనేక సాంకేతిక ప్రక్రియలను అధిక దిగుబడి కొత్త రకాలను అందుబాటులోకి తెచ్చింది. నూనె గింజల అధికోత్పత్తిని పెంచడానికి “ పసుపు విప్లవాన్ని “ ప్రారంభించిన రైతులలో తగిన అవగాహన లేకపోవడం , పంటల మార్పిడి వల్ల ఆశించిన ఫలితాలు రావడం లేదు.

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ పరిశోధనా కేంద్రాలు, విశ్వ విద్యాలయాలు సమన్వయంతో ఆయా రాష్ట్రాలకు అనువైన అధిక దిగుబడి నూనెగింజల విత్తనాలకు ఉత్పత్తి చేసి రైతుల సాగుకు రైతులను ప్రోత్సహిస్తే తప్ప సాగు విస్తీర్ణం, ఉత్పాదకత పెరగవు. ఈ సారి తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పెరిగిన నూనెగింజల సాగు పెరగకపోగా చాలా భూములు ఖాళీగా ఉండటం శోచనీయం. నూనె పంటల సాగు ఖర్చు బాగా పెరగడం లాభదాయకంగా లేకపోవడం వల్ల సాగు విస్తీర్ణం ఉత్పాదకత అంతా అవసరాల మేరకు పెరగడం లేదు.

oil seeds

oil seeds ( నూనె గింజలు )

ఈ వానాకాలం సీజన్ లో దేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి మునుపెన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో 15 కోట్ల టన్నులకు పెరగనుందని అంచనా కాగా నూనె గింజల పంటల సాగు విస్తీర్ణం ముఖ్యంగా వేరు శనగ, సోయాబీన్ విస్తీర్ణం గత ఏడాది కంటే తగ్గిందని అంచనా గత ఏడాదికి పోలిస్తే వంట నూనెల ధరలు రెట్టింపై ఎం కోనేటట్లు లేదు ఎం తినేటట్లు లేదని స్థితిని కల్పించాయి. కరోనా మహమ్మారి ప్రభావం లక్షలాది మంది ఉపాధి ఆదాయాలు కోల్పోగా ఒకవైపు నిత్యావసరమైన వంట నూనెల ధరలు పెరుగుతూనే ఉండటం జన జీవితం పై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ పరిస్థితిని గమనించే యాసంగి సీజన్ లో నూనె గింజలు, పప్పు దినుసుల పంటల సాగు ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం అనేక రాయితీ ఇవ్వనట్లు తెలిసింది. తూర్పు భారతదేశంలో 2.32 లక్షల హెక్టార్లలో నూనె గింజల పంటలు,6 .25 లక్షల హెక్టార్లలో పప్పు దినుసుల పంటల సాగుకు కేంద్రం ప్రణాలిక రూపొందించింది. వానాకాలం సీజన్ లో వేరుశనగ సాగు విస్తీర్ణం 4 శాతం తగ్గింది. వేరు శనగ పంట ఉత్పత్తి 82.5 లక్షల టన్నులు ఉండగలదని అంచనా మహారాష్ట్ర మధ్యప్రదేశ్ లలో అదునులో వర్షాలు రాక సోయాబీన్ ఉత్పత్తి 1.27 కోట్ల టన్నుల మేర ఉండగలదని అంచనా ,లక్ష 50 కోట్ల టన్నులు సోయాబీన్ పంటకోత గింజలు మార్కెట్ లోకి వస్తే నూనెల ఉత్పత్తి సరఫరా పెరిగి ధరలు కొంత మేరకు తగ్గగలవని అధికారులు భావిస్తున్నారు.

Also Read : గ్రామీణ స్త్రీలు – ఆహార సూత్రాలు

Leave Your Comments

గ్రామీణ స్త్రీలు – ఆహార సూత్రాలు

Previous article

విటమిన్ C తో ఆరోగ్యం మీ వెంట !

Next article

You may also like