ఆరోగ్యం / జీవన విధానంమన వ్యవసాయం

Jamun Cultivation: నేరేడు సాగుతో అన్నదాతలకు లక్షల్లో ఆదాయం.!

0
Jamun Cultivation
Jamun Cultivation

Jamun Cultivation: నేరేడు సాగుతో అన్నదాతలు అత్యంతగా ఆదాయాన్ని ఆర్జించ గలుగుతున్నారు. అనంతపురంజిల్లాలోని బెళుగుప్ప మండలంలో రైతులు నేరేడు తోటల ద్వారా మంచి ఆదాయాన్ని పొందుతున్నారు. రైతులు కనీసం రెండు ఎకరాలలో 100 చెట్లకు రూ. 3 లక్షలు సంపాదిస్తున్నారు. మండలంలోని నర్సాపురం గ్రామానికి చెందిన శశికుమార్ అనే రైతు మాట్లాడుతూ.. తూర్పుగోదావరిలోని కడియం గ్రామానికి చెందిన నేరేడు తోటలు నాటేందుకు రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్ట్(ఆర్డీటీ) వారు సహకరించారని చెప్పారు. కడియం నుంచి 160మొక్కలను కొన్నాడు. అవి 2019 నుంచి నేరేడు పళ్ళు కాస్తున్నాయి. 2 ఎకరాల పంటకు అతను 2019లో రూ. 70,వేలు, లక్షరూపాయలు, ఇప్పుడు 2022లో ఎకరాకు రూ.1.40 లక్షలు సంపాదిస్తున్నాడు. మొత్తం మీద రెండు ఎకరాల నేరేడు పంట ద్వారా రూ. 3 లక్షలకుపైగా సంపాదిస్తున్నారు. ఇప్పటి వరకూ వాణిజ్య పంటల ద్వారా ఇంతగా సంపాదించడం సాధ్యం కావడంలేదని నేరేడు రైతులు అంటున్నారు.

Jamun Cultivation

Jamun Cultivation

Also Read:

బెళుగుప్ప గ్రామానికి చెందిన మరో రైతు మాట్లాడుతూ ఎరువులు, పురుగు మందుల నిర్వహణలో మెరుగైన మెళకువలు నేర్చుకుని నేరేడు తోటలను లాభసాటిగా మార్చుకోవచ్చని చెబుతున్నారు. “కేవలం100 చెట్లు ద్వారా దాదాపు 3 లక్షలు మేర ఆదాయం వచ్చిందని ఆయన పేర్కొన్నారు. ఫిబ్రవరి నుంచి నేరేడు తోట పుష్పించే దశకు వచ్చింది. పుష్పించే దశ నుంచి ఫలాలు వచ్చే దశ వరకు, ఉత్తమ నిర్వహణ పద్ధతులు అనుసరించడం ద్వారా మరింత దిగుబడి పొందగలిగానని అతను చెప్పాడు. నేరేడు పండ్లకు మార్కెట్‌లో అధిక డిమాండ్ ఉంది. రక్త హీనతనుతగ్గించడానికి, క్యాన్సర్‌ను అధిగమించడంలో నేరేడు పండ్ల పాత్ర కీలకమైంది. ప్రస్తుతం మార్కెట్ లో నేరేడు పండ్లు కిలో రూ.200 నుంచి రూ.150 పలుకుతున్నాయి. నేరేడు పంట ద్వారా ఎక్కువ ఆదాయం రావడంతో చాలా మంది రైతులు నేరేడును సాగుచేసేందుకు ముందుకు వస్తున్నారు. ఉద్యానవన శాఖ ఆయా రైతులకు సబ్సిడీలు, ప్రోత్సాహకాలు అందిస్తున్నారు.

Also Read:

Leave Your Comments

Role of Calcium in Plants: మొక్కల ఎదుగుదలలో కాల్షియం పాత్ర.!

Previous article

Paddy Main Field Management: వరి ప్రధాన పొలం తయారీ లో మెళుకువలు.!

Next article

You may also like