Sweet Corn Cultivation: రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులలో జొన్న సాగు విస్తీర్ణం నానాటికి తగ్గిపోతూ వుంది. మార్కెట్లో జొన్నకు డిమాండ్ తగ్గడం, జొన్నను చీడపీడలు ఆశించడం వలన గింజ నాణ్యత తగ్గిపోవడం, రైతులు వాణిజ్య పంటల వైపు మొగ్గు చూపడం లాంటివి దీనికి కారణాలుగా చెప్పుకోవచ్చు. అయితే అంతే తక్కువ వనరులను ఉపయోగించుకొని, తక్కువ సమయంలో కోతకు వచ్చే తీపి జొన్న సాగు చేపట్టినట్లయితే గింజ దిగుబడితో పాటు రైతు అదనపు ఆదాయం రాబట్టవచ్చు.
Also Read: Importance of Baby Corn: బేబీ కార్న్ ఉపయోగాలు
తీపిజొన్న – ఉపయోగాలు :
- తీపిజొన్న నుండి ఇథనాల్ సంగ్రహణలో ఎలాంటి పర్యావరణ కాలుష్యం ఉండదు.
- భారత ప్రభుత్వం జారి చేసిన నిబంధనల ప్రకారం 5% ఇథనాల్న పెట్రోల్ లో కలపవచ్చు. ఇప్పటివరకు చెరుకు నుండి మాత్రమే ఇథనాల్ను సంగ్రహించేవారు. కాని శాస్త్రవేత్తల పరిశోధన ప్రకారం తీపిజొన్న నుండి కూడా ఇధనాలు సంగ్రహించవచ్చు. అంతేకాకుండా తీపిజొన్న నుండి 1 లీటరు ఇధనాల్ సంగ్రహణకు పట్టే ఖర్చు (రూ॥13/-) చెరకు నుండి ఇథనాల్ సంగ్రహణకు పట్టే ఖర్చు (రూ॥16/-) కంటే కూడ తక్కువ. 1 హెక్టారు తీపి జొన్న గదల నుండి 2000-2500 లీటర్ల ఇధనాల్ను ఉత్పత్తి చేయవచ్చు.
- కాండములో చక్కెరను నిలువ చేసుకునే గుణం ఖరీఫ్ ఉంటుంది. ఈ చక్కెరతో బెల్లం, సిరప్లను తయారు చేయవచ్చు.
- శాస్త్రవేత్తల పరిశోధన ప్రకారం గింజల నుండి కూడా కేకులు, బిస్కెట్లు, బెల్లం, సిరప్లను తయారు చేయవచ్చు.
- కాండం నుంచి చక్కెర వేరుచేసాక మిగిలిన వ్యక్తంతో 3.25 మెగా వాట్ల శక్తి (1 హెక్టారు చొప్ప వ్యర్థం నుండి) ని ఉత్పన్నం చేయడమే కాక దీనితో పేపర్ను తయారు చేయవచ్చు మరియు పశువుల దాణాగా కూడా వాడవచ్చు.
- చెరకు కంటే కూడ తక్కువ నీటిని ఉపయోగించి, తక్కువ సమయంలో, తక్కువ పెట్టుబడితో అదనపు ఆదాయంను రాబట్టవచ్చు.
తీపిజొన్న సాగులో పాటించవలసిన ముఖ్యమైన మెళకువలు
- పూత మొదలైనప్పటి నుండి 40 రోజుల తర్వాత పంటకోత చేపట్టవచ్చు. పూత మొదలైనప్పటి నుండి గింజ గట్టిపడే దశ వరకు గడలో చక్కెర శాతం ఎక్కువగా వుంటుంది. కాబట్టి ఈ దశలో కోత చేపట్టినట్లయితే 1 హెక్టారుకు ఇథనాల్ సంగ్రహించే శాతాన్ని పెంచవచ్చు.
- కోసిన 48 గంటల లోపు ఇథనాల్ సంగ్రహణ మిల్లులకు చేర్చగలగాలి. లేనిచో ఇథనాల్ దిగుబడి తగ్గే ఆస్కారముంటుంది.
- చెరకు నుండి ఇధనాల్ సంగ్రహణకు వాడే డిస్టిల్లరి యూనిట్స్ తీపిజొన్న నుండి ఇథనాల్ సంగ్రహణకు వాడవచ్చును.
ఈ విధంగా తక్కువ నీటితో తక్కువ వనరులతో తీపి జొన్న సాగు చేపడితే రైతులకు అదనపు ఆదాయం చేకూరి ఆర్ధికంగా బలోపేతం అవుతారు.
Also Read: Maize Health Benefits: మొక్కజొన్నలో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు