మత్స్య పరిశ్రమమన వ్యవసాయం

చేపల పెంపకంలో నీటి గుణాలు ప్రాముఖ్యత యాజమాన్య పద్ధతులు

0

                            ఆంధ్రప్రదేశ్ లో సుమారు లక్ష హెక్టార్లకు పైగా విస్తీర్ణంలో మంచినీటి చెరువుల్లో కార్పు రకాలు చేపలు పెంపకం, 25 వేల హెక్టార్లకు పైగా ఫాంగాషియస్, రూప్ చంద్ రకాల చేపల పెంపకం పాక్షిక సేంద్రీయ పద్ధతిలో చేపట్టడం జరుగుతున్నది. వీటితో పాటు ఆరు లక్షల హెక్టర్లలో ఉన్న పంచాయితీ చెరువులు, కమ్యూనిటీ చెరువులు,రిజర్వాయర్లలో చేపల పెంపకం సాంప్రదాయ పద్ధతిలో అంటే వర్షాకాలంలో చేప పిల్లలను విడిచిపెట్టి ఫిబ్రవరి-మార్చి నెలలో “పట్టుబడి చేయడం ద్వారా చేపట్టబడుతున్నది”. ఉత్తరాంధ్ర జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో సుమారు మూడు వేల హెక్టార్లలో చేపలు రొయ్యలు (మిశ్రమ పంపకం) పాక్షిక సాంద్ర పద్ధతిలోనే మూడు వేల హెక్టార్లలో ఉన్న పంచాయితీ, కమ్యూనిటీ చెరువులో సంప్రదాయ పద్ధతిలో చేపల పెంపకం చేపడుతున్నారు.

చేపల పెంపక దారులు, సాంప్రదాయ మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలు:
చేపల పెంపక దారులు ముఖ్యంగా ఎదుర్కొంటున్న సమస్య నాణ్యమైన చేప పిల్లల లభ్యత. రైతులు ప్రధానంగా చేపపిల్లలను ఉదయ గోదావరి జిల్లాలో, కృష్ణా జిల్లాలలో ఉన్న చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాల నుండి రవాణా చేసుకోవడం జరుగుతున్నది. అందువల్ల నాణ్యమైన చేప పిల్లల ఎంపిక సమస్యగా ఉన్నది.
ఈ విధంగా ఎక్కువ దూరం రవాణా చేయడం వలన చేప పిల్లల పై ఒత్తిడి ఏర్పడి చెరువుల్లో విడిచిపెట్టిన తరువాత మరణాల శాతం అధికమవడం లేదా సరైన పెరుగుదల లేకపోవడం జరుగుతున్నది. రైతులు అధిక దిగుబడులు సాధనకై అధిక సాంద్రతలో చేపల సాగు చేపడుతున్నారు. ఈ పరిస్థితులలో సహజ ఆహారమైనా ప్లాంక్టన్ పెరుగుదల కోసం అధిక మోతాదులో ఎరువులు, మేతలు వాడకం వలన చెరువు నీటిగుణాల్లో మార్పులు ఏర్పడి, చేపల పై ఒత్తిడి ఏర్పడుతుంది. తద్వారా చేపలు వివిధ వ్యాధుల బారినపడి పెరుగుదల ఆగిపోవడం లేదా మరణాలు సంభవించడం జరుగుతున్నది.                    చేపల పెంపకానికి అనువైన నేల-నీరు లక్షణాలు:
చేపలు నీటిలో పెరిగిన, చెరువు నేలసారంపై వాటి పెరుగుదల ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. చెరువులోని నీటిలక్షణాలు మట్టి గుణాలకు అనుగుణంగా మారుతూ ఉంటాయి. నల్లరేగడి, గరుపు నేలలు చేపల సాగుకు అనుకూలంగా ఉంటాయి. అధికంగా ఆమ్లగుణం ఉండేవి చౌడునేలలు నీరు త్వరగా ఇంకిపోయే ఇసుక నేలలు చేపల పెంపకానికి పనికిరావు.
కలుషితం లేనటువంటి నీటిగుణాలలో తేడా ఎక్కువగా లేనటువంటి, సమృద్ధిగా నీరు లభించే వనరులు కలిగిన ప్రదేశం లో చేపల పెంపకం చేపట్టాలి. పెంపక కాలంలో మీరు ఇంటికి పోయినప్పుడు ఆవిరయ్యేప్పుడు, ఆక్సిజన్ లోపం సమస్య తలెత్తినప్పుడు, వ్యాధులు ప్రబలినప్పుడు నీటి మార్పిడికి అనుకూలంగా ఉండే ప్రదేశంలో చేపల సాగు చేపట్టాలి. చేపలు/రొయ్యల కదలికలు సహజ ఆహారం వృద్ది, చేపల పెరుగుదల, ఆరోగ్యం, ఉత్పాదకత వంటి అంశాలు సాంప్రదాయ పద్ధతిలో గానీ, ప్రధానంగా నీటి గుణాల పై ఆధారపడి ఉంటాయి. అందుచేత నీటి గుణాలలో ఏర్పడే తేడాలను తరచూ పరీక్షించుకుని అనుకూల స్థాయిలో ఉంచేందుకు యాజమాన్య పద్ధతులు పాటిస్తే చేపలు పెరుగుదల సక్రమంగా ఉంటుంది.

నీటి గుణాల మార్పునకు గల కారణాలు:
భౌతిక, రసాయనిక మరియు జీవ సంబంధమైన కారణాల వల్ల నీటి గుణాల్లో హెచ్చుతగ్గులు ఏర్పడి నీటి నాణ్యత కోల్పోవడం జరుగుతుంది. వాతావరణంలో వచ్చే మార్పులు నీటి గుణాల పై ఎక్కువగా ప్రభావాన్ని చూపిస్తాయి. చెరువులో ఉండే ప్లవకాలు, నీటి మొక్కలు, చేపలసాంద్రత ప్లవకాల అభివృద్ధికి వాడే ఎరువులు, సున్నం, చేపలకు అనుబంధంగా ఇచ్చే ఆహారం చేపల విసర్ఫితాలు. అన్ని కలిపి నేటి గుణాలలో మార్పునకు కారణమవుతాయి.
చేపల పెరుగుదల లేదా ఆరోగ్యంపై ఎక్కువగా ప్రభావం చూపే నీటిగుణాలలో నీటి ఉష్ణోగ్రత, నీటి రంగు, ఉదజని సూంచీ(pH), నీటి కాఠిన్యత(Hardness), నీటిలో కరిగి ఉండే ఆమ్లజని(Dissolved Oxygen), నీటిలో ఉండే పోషకాలు, నీటిలో ఉండే హానికారక వాయువులు (Toxic gases) ముఖ్యమైనవి.

నీటి ఉష్ణోగ్రత:
చేపలు శీతల రక్త జీవులు, వీటి పెరుగుదలకు అనుకూల ఉష్ణోగ్రత 28°C నుండి 32°C. నీటి ఉష్ణోగ్రత 28°C కన్నా తక్కువైతే చేపలలో జీవక్రియ రేటు తగ్గి, చేపలల్లో చురుకుదనం తగ్గిపోతుంది. మేతలను తక్కువగా తీసుకుంటాయి. తరచూ వ్యాధుల బారిన పడుతాయి. మేతలు తక్కువగా తీసుకోవడం వలన పెరుగుదల తగ్గిపోతుంది. అందుచేత శీతకాలంలో తక్కువ. ఉష్ణోగ్రతలు ఉంటాయి కాబట్టి మేతలను సాధారణ స్థాయికన్నా 10-20 శాతం తక్కుగా ఇవ్వడం వలన మేత వృథాను తగ్గించి, నీరు కలుషితం కాకుండ చూసుకోవచ్చును.
ఉష్ణోగ్రత పెరిగితే జీవక్రియ రేటు పెరిగి. ఆక్సిజన్ వినియోగం పరిమాణం పెరుగుతుంది. అందుచేత ఎరియేతర్ల వినియోగం పెంచుకోవాలి. నీరు అవిరివడం వలన నీటి ఉప్పదనం (Salinity), కఠినత్వం పెరిగి చేపలు వత్తిడికి గురివతాయి.

నీటి రంగు:
నీటి రంగు అందులో ఉండే సూక్ష్మజీవుల, లవణాలు, గానపదార్ధలను, సేంద్రియ పదార్ధాలను సూచిస్తుంది. నీటిలో ఉండే ప్లవకాల రకం, సాంద్రతలపై నీటి రంగు ఏర్పడి ఉంటాయి. లేత ఆకుపచ్చ రంగు నీరు చేపల పేరుదలకు అనుకూలం. ముదురు ఆకుపచ్చ, నీలం రంగు పెంపకానికి అనుకూలం కాదు. నీటి రంగును బట్టి చెరువులో ఉండే ప్లాంక్టన్ సాంద్రతను నిర్ధారించుకుని, ఎరువుల వాడకం చేపడితే నీటి రంగు మారకుండా. చేపల పెరుగుదలకు అనుకూలంగా ఉంటుంది.

ఉదజని సూచి(పి.హెచ్ విలువ):
పెంపక చెరువులో నీటి ఉదజని సూచి లేదా పి.హెచ్ 6.5 నుండి 8 ఉన్నపుడు చేపలు ఆరోగ్యవంతంగా ఉంది పిరుదులను చూపిస్తాయి. నీటికి ఆమ్ల గుణం (పి.హెచ్ 6 కన్నా తక్కువ) లేదా కార్పగుణం (పి.హెచ్ 8.5 కన్నా ఎక్కువ) చేపలపై నేరుగా ప్రభావం చూపిస్తుంది. నీటి పి.హెచ్ స్థాయిలో వచ్చే కొద్దిపాటి తేడాలు వల్ల చేపల పై ప్రత్యక్ష ప్రభావం లేనప్పటికి ఇవి మిగిలిన నీటి గణాలను బాగా ప్రభావం చేస్తాయి కనుక ph ను ఎప్పుడు అనుకూల స్థాయిలో ఉంచుకోవాలి. pH ఎక్కువ అయినప్పుడు అమ్మోనియం వంటి విషవాయువుల ప్రభావం బాగా ఎక్కువవుతుంది. pH స్థాయి తక్కువ ఉంటే సున్నం వాడి సరిచేసుకోవచ్చును. అదే గుణం కలిగి ఉన్నట్లుయితే జిప్సం పొడి తగించుకోవచ్చు. కానీ చెరువులో ఒక రోజులో pH లో మార్పు 0.5 నుండి 1.1 కన్నా ఎక్కువ ఉండకుండా చూసుకోవాలి.

నీటిలో కరిగి ఉన్న ఆక్సిజన్ (D.O):
చేపలు/రొయ్యలు ఇతర జీవ జాతులు వాటి జీవక్రియ కోసం అవసరమయ్యే ఆక్సిజన్ కోసం నీటిలో కరిగి ఉన్న ఆక్సిజన్ పై అధారపడతాయి. అందువల్ల చేపల/రొయ్యల సాగులో పెరుగుదలను, ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే నీటి గుణాలలో కరిగి వున్న ఆక్సిజన్ (D.O) చాలా ముఖ్యమైనది. గాలిలో ఉండే ఆక్సిజన్ నేరుగా నీటిలో కరగడం వలన చెరువులో ఉండే ప్లవకాలు కిరణజన్య సంయోగక్రియ జరపడం వలన నీటిలో ఆక్సిజన్ పరిమాణం పెరుగుతుంది. నీటిలో ఉన్న ఆక్సిజన్ పరిమాణం నీటి ఉష్ణోగ్రత, చేపలసాంద్రత, సేంద్రీయ పదార్ధాసాంద్రత పై ఆధారపడి ఉంటుంది.
ఆక్సిజన్ తగ్గిన చేపలలో చురుకుదనం తగ్గి పెరుగుదల ఆగిపోవడం, వత్తిడికి గురయి వవ్యాధుల బారిన పడడం జరుగుతుంది. D.O 2. పి.పి.యం కన్నా తగ్గితే చేపలు కొన్ని గంటల లోనే అధిక సంఖ్యలో చనిపోతాయి. గాలిలో ఉండే ఆక్సిజన్ నీటిలో కరిగి ఉన్నప్పటికి అది చాలా తక్కువ మోతాదులో ఉంటుంది కనుక ఆక్సిజన్ తగిన పరిమాణంలో ఉంచుకోవడానికి ప్లవకాల సాంద్రతను తగినంతగా ఉంచుకోవాలి. ప్లవకాల సాంద్రత అధికమయినపుడు సూర్యరాశిమి చెరువు లోపల ప్రవేశించదు కనుక ఉపరితలంలో అధిక ఆక్సిజన్ పరిమాణం ఉన్నప్పటికి అడుగుభాగంలో ఆక్సిజన్ లోపం ఏర్పడి చేపల పై వత్తిడి ఏర్పడుతుంది.
వేకువజామున ఆక్సిజన్ పరిమాణం సాధారణంగా తక్కువ స్థాయిలో ఉంటుంది. రెండు మూడు రోజుల పాటు మబ్బులుగా ఉన్న వాతావరణ పరిస్తితులలో కూడ ఆక్సిజన్ లోపం ఏర్పడుతుంది. ఇలాంటి పరిస్థితులలో ఆక్సిజన్ పరిమాణం 3 ppm కన్నా తక్కువ కాకుండా చూసుకోవాలి.
చెరువులలో ఆక్సిజన్ పరిమాణం పెంచడానికి, అప్పటికప్పుడు ఏర్పడే D.O సమస్యను అధిగమించడానికి వేగంగా ఆక్సిజన్ నీ విడుదల చేసే కాల్షియం పెరాక్సైడ్ ఎకరాకు 1 kg లేదా హైడ్రోజన్ పెరాక్సైడ్ ఎకరాకు 1 లీ చొప్పున వేసుకోవాలి.
*వీలైతే కొత్తగా నీటిని 10 – 15 శాతం వరకు పెట్టుకోవాలి.
*మోటర్ల సాయంతో చెరువులో ఉన్న నీటిని తిరగతోడడం.
*ప్లవకాల సాంద్రతను సమతుల్యంగా ఉంచుకోవడం.
*మేతల వృథాను తిగ్గించడం వలన చెరువు నీటిలో ఆక్సిజన్ పరిమాణం పెంచుకోవచ్చును.

ప్లవకాల(ప్లాంక్టన్) పెరుగుదలను నియంత్రించే నీటి గుణాలు:
ప్లాంక్టన్ పెరుగుదలను క్రమబద్ధకరించడానికి ముఖ్యంగా నీటి కాఠిన్యత(Hardness), అందులో ఉండే ముఖ్య పోషకమైన ఫాస్పరస్ పరిమాణం ఎక్కువగా ప్రభావం చూపిస్తాయి. నీటి కఠిన్యత 80-300 ppm. మధ్యలో ఉంటే ప్లాంక్టన్ అభివృద్ధి సమతాస్థితిలో ఉంటుంది. నీటిలో ఉండే ఫోస్పరస్ 0.2 నుండి 0.4 ppm మధ్య ఉన్నపుడు చేపల సహజ ఆహారం. ప్లదకాల అభివృద్ధి సమతుల్యంగా ఉంటుంది. ఫాస్పరస్ పరిమాణం పెరిగినట్లైతే “ప్లాంక్టన్ బ్లూమ్” గామశ ప్రమాదం ఉంటుంది. ఫాస్పరస్ పరిమాణం తగ్గితే ప్లాంక్టన్ పెరుగుదల ఆగిపతుంది. నీటిలో ఉండే ఫాస్పరస్ స్థాయిని పరీక్షించుకుంటూ తక్కువైతే సూపర్ ఫాస్ఫేట్ ఎరువులను వాడాలి.

హానికారక వాయువులు:
చేపలకు/రొయ్యలకు హని కలిగించే నీటి గుణాలలో ముఖ్యంగా కార్బన్ డయాక్సైడ్(Co2), అమ్మోనియా (NH3), హైడ్రోజన్ సల్ఫైడ్ (H2S) లు చేపలపై నేరుగా ప్రభావం చూపిస్తాయి.
*కార్బన్ డయాక్సైడ్ 20-40 ppm వరకు చేపలకు ఎటువంటి హాని ఉండదు.అంతకన్నా ఎక్కవైనా పరిస్థితులలో ప్లాంక్టన్ ఒక్కసారిగా చనిపోతుంది. ఈ పరిస్థితిని “ప్లాంక్టన్ క్రాష్” అంటారు. ఈ పరిస్థితులలో నీటి pH కూడా తగ్గి చపలపై వత్తిడి ఏర్పడుతుంది. దీనిని అధిగమించడానికి వ్యవసాయ సున్నం ఎకరాకు 10-15  చొప్పున వాడి సరిచేసుకోవచ్చును.
*అమ్మోనియా పరిమాణం 0.1 ppm కు మించితే చేపలపై వత్తిడి ఏర్పడి పెరుగుదల మందగించడం, వ్యాధుల బారినపడడం జరుగుతుంది. అమ్మోనియా విషప్రభవం వలన చేపలు మొప్పల ద్వారా ఆక్సిజన్ గ్రహించ శక్తి తగ్గిపోతుంది.
*అమ్మోనియా ప్రభావం గమనించినప్పుడు మేతలను తాత్కాలికంగా ఆపేయాలి. చెరువులో మురుగు ఎక్కువగా చేరకుండా జాగ్రత్త తీసుకోవాలి. వీలైతే అడుగున ఉన్న నీటిని తీసి 10-15 శాతం వరకు నీటి మార్పిడి చేసుకోవాలి. అమ్మోనియా ప్రభావం ఎక్కుగా ఉంటే ఎకరాకు 10-15 kg ల జియలైట్ ఇసుకలో కలిపి వేసుకోవాలి.
*హైడ్రోజన్ సల్ఫైడ్ పరిమాణం 0.01 ppm కన్నా పెరిగితే చేపలపై వత్తిడి పెరుగుతుంది. నీటిలో ఆక్సిజన్ పరిమాణం పెంచుకున్నట్లియితే విషవాయువుల ప్రభావం తగ్గించుకోవచ్చు.

నీటి గుణాలు అనుకూలస్థాయి:
చేపలు/ రొయ్యలు పెరుగుదలకు, ఆరోగ్యానికి నీటి గుణాలు తరచూ పరీక్ష చేసుకుంటూ అనుకూల స్థాయిలో ఉండేలా యాజమాన్య చర్యలు చేపట్టాలి, కాలువల నుండి, చెరువుల నుండి నీరు పెట్టెప్పుడు 40 నెం. సైజు మెష్ ద్వారా వడగట్టి పెట్టుకోవాలి. ఈ విధంగా నీరు వచ్చేతూములు వద్ద వలలను అమర్చడం ద్వారా పెంపక చెరువుల్లోకి ఇతర జీవజాతులు, వరభక్షక, కలుపు చేపలు రాకుండా నిరోధించవచ్చు. చెరువులో ఎప్పుడు 1.5 మి నుండి 2 మి లోతు ఉన్నట్లు గా జాగ్రత్త తీసుకోవాలి.

పెంపక చెరువుల్లో ముఖ్యమైన నీటి గుణాలు అనుకూల స్థాయిలు
నీటి ఉష్ణోగ్రత – 28°C-32°C
pH(ఉదజని సూంచి) – 7.0-8.5
నీటిలో కరిగి ఉన్న ఆక్సిజన్ – 4-8 ppm
నీటి కాఠిన్యత(Hardness) – 80-300 ppm
నీటి రంగు – లేత ఆకుపచ్చ రంగు
ఫాస్పరస్ – 0.2-0.4 ppm
అమ్మోనియా – 0.1 ppm కన్నా తక్కువ
హైడ్రోజన్ సల్ఫైడ్ – 0.01 ppm కన్నా తక్కువ

Leave Your Comments

జామ ఆకుల టీ – ఆరోగ్య ప్రయోజనాలు

Previous article

అధిక ఆదాయాన్ని అందించే “అగర్ వుడ్”

Next article

You may also like