Biofertilizers: వ్యవసాయంలో సుక్ష్మ జీవుల పాత్ర చాల గొప్పది . ఎందుకంటె ఇవి నత్రజనిని స్థిరికరిస్తాయ్, పోషకాలను కరిగిస్తాయి , పోషకాలను విచ్చినం చేసే లక్షణాలను కలిగి ఉంటాయి . ఈ సుక్ష్మజివులు సహజంగానే భూమిలో ఉంటాయి . కానీ వీటి సంఖ్య త్వరితంగా తగ్గుతూ ఉంటుంది . పంటల దిగుబడిని పెంచడానికి వేరు మండలంలో ఉండి సుక్ష్మజివులను గ్రహించి , కృత్రిమంగా పెంచి ఎక్కువ సంఖ్యలోకి తెచ్చి సూటి అయిన ఘనపదార్థలలో కలిపి మరల భూమిలో వేయవచ్చు. వీటినే జీవన ఎరువులు అంటారు.
- జీవన ఎరువులు లేదా మైక్రోబియల్ ఇనాక్యులెంట్ అనేవి పొడి రూపంలో లేదా ద్రవ రూపంలో ఉన్నా ముఖ్యమైన ఉపయోగకరమైన సుక్ష్మజివులను కలిగి ఉండి విత్తనానికి కలిపే లేదా నేలలో వేసే ఎరువులు. ఈ జీవన ఎరువులలో ఉండే సూక్ష్మజీవులు మొక్క వేరు బుడిపెలలోకి లేదా వేరు మండలంలోకి ప్రవేశించి మొక్కలకు అవసరమైన పోషకాలను అందుబాటులోకి తెచ్చి మొక్క పెరుగుదలకు ఎంతగానో తోడ్పడతాయి.
Also Read: జీవన ఎరువులు పాముఖ్యత…
జీవన ఎరువులను వాటి క్రియాశీలతను, వాడె విదానాన్ని బట్టి వివిధ రకాలుగా విభజించారు
- నత్రజనిని స్థిరికరించే జీవన ఎరువులు
- భాస్వరంను కరిగించి మొక్కలకు అందించే సుక్ష్మ జీవులు
- పొటాషియం ను మొక్కలకు అందించేవి
- జింక్ ను కరిగించే సుక్ష్మ జీవులు
- సేంద్రియ పదార్థాలను విచ్చినం చేసే సుక్ష్మ జివులు
- వేరు మండలంలో ఉండి మొక్క పెరుగుదలకు దోహదం చేసే వేరు బాక్టీరియా.
జీవన ఎరువులు వాడుకొనే పద్ధతులు : ముఖ్యంగా జీవన ఎరువులను నాలుగు పద్దతులలో ఉపయోగించవచ్చు. 1. విత్తన శుద్ధి 2. నారును ముంచే పద్ధతి 3. నేల ద్వారా /భూమిలో చల్లడం 4. డ్రిప్ పద్ధతి
జీవన ఎరువులను వాడుకునేటప్పుడు తీసుకోవలసిన జాగ్రతలు:
- పొలంలో జీవన ఎరువులు వాడిన తర్వాత ఒక వారం రోజుల వ్యవదిలో రసాయనిక ఎరువులు వాడాలి.
- ఉదయం /సాయంత్రం నిడ ఉన్న సమయంలో జీవన ఎరువులు వాడటం మంచింది.
- జీవన్ ఎరువులను వాడేటప్పుడు లేదా మొదటిసారిగా వినియోగించేఅపుడుసంబందిత శాస్త్రవేత్తలను గాని/వ్యవసాయ అధికారులను గాని సంప్రదించి వారి సలహా మేరకు వాడుకోవటం మంచిది.
- భాస్వరం,పోటాష్ ,జింక్ సంబందిత జీవన ఎరువులు అన్ని రకాల పంటలలో వాడుకోవచ్చు.
Also Read: జీవన ఎరువుల వాడకం వలన అధిక ప్రయోజనాలు..