Impact of Forest On Human Health: ప్రపంచ దేశాలు అడవిని తల్లిగా భావిస్తారు. అడవి భద్రంగా ఉంటేనే మనిషి మనుగడ సాధ్యం అవుతుంది. అడవి లేనిదే వర్షపాతం లేదు. వర్షపాతం లేనిదే మానవ మనుగడ లేదు. నిజానికి మనిషికీ, మొక్కకూ ఉండేది పేగు బంధం లాంటిది. మనిషి పుట్టుక మరియు మరణం వరకు అనుక్షణం సుఖసంతోషాలతో ముడిపడి, ఎడతెగని బంధంగా నిలిచేది ప్రకృతే. ఆ సత్యాన్ని గ్రహించకుండా ఎడాపెడా అడవులు నరకడమంటే పుడమి తల్లికి కడుపు కోతను మిగల్చడమే.
Also Read: Paddy Cultivation: వరిలో సమగ్ర సస్యరక్షణ చర్యలు.!
మధ్యప్రదేశ్‌లో దేశంలోనే అత్యధిక అటవీ విస్తీర్ణం ఉంది, తర్వాత అరుణాచల్ ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా మరియు మహారాష్ట్ర ఉన్నాయి. మొత్తం భౌగోళిక విస్తీర్ణంలో అటవీ విస్తీర్ణంలో మొదటి ఐదు రాష్ట్రాలు మిజోరం (84.53%), అరుణాచల్ ప్రదేశ్ (79.33%), మేఘాలయ (76.00%), మణిపూర్ (74.34%) మరియు నాగాలాండ్ (73.90%). ఉన్నాయి. మణిపూర్, నాగాలాండ్, త్రిపుర, గోవా, కేరళ, సిక్కిం, ఉత్తరాఖండ్, ఛత్తీస్‌గఢ్, దాద్రా & నగర్ హవేలీ మరియు డామన్ & డయ్యూ, అస్సాం, ఒడిశా వంటి పన్నెండు రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలలో 33% నుండి 75% వరకు అటవీ విస్తీర్ణం ఉంది.
అడవుల ప్రభావం:
శబ్దము మరియు గాలి కాలుష్యాలు అనేక వ్యాధులకు దారి తీస్తాయి. అడవులు సాధారణంగా గాలిని ఫిల్టర్ చేస్తాయి. అడవులు సాధారణంగా గాలిని ఫిల్టర్ చేస్తాయి. దుమ్ము, ధూళితో కూడిన గాలులు అడవులలో ప్రవేశించి, చెట్ల మొదళ్ళు, కొమ్మలు, ఆకులు, సూది ఆకారంలో వున్న ఆకులు మొదలగు వాటిపై దుమ్మును, ధూళిని జమచేస్తాయి. ఒక శాస్త్రవేత్త అంచనా ప్రకారము అడవుల యొక్క డస్ట్ ఫిటరింగ్ కెపాసిటి అద్భుతమైనది. ఒక హెక్టారు స్థలములోని పైన్ చెట్లు 32 టన్నుల దుమ్మును సమకూర్చుకుంటాయి.
అడవులు బొగ్గు పులుసు వాయువు (Co.,) భారి నుండి రక్షణ కల్పిస్తాయి. ఇవి (Co.,) వాయువును పీల్చుకొని ప్రాణవాయువైన SO ను గాలిలోనికి వదిలివేస్తాయి. హానికరమైన SO, వాయువును కూడ అడవులు ఫిల్టర్ చేస్తాయి.
ఇండస్ట్రీస్ వాహనాల నుండి వెలువడే శబ్దాలు మానవుల రక్తప్రసరన రేటును పెంచుతాయి. అడవుల కొంత శబ్దాన్ని శోషించుకునే సామర్థ్యం కూడ పెరుగుతుంది.
50 మీ. వెడల్పు గల ఒక పార్కు 20-30 (డెసిబెల్స్) ట్రాఫిన్ శబ్దాన్ని తగ్గిస్తుంది. కొనిఫెరస్ అడవులు బ్రాంకైటీస్ అనే వ్యాధిని తగ్గిస్తాయి అని కొందరి నమ్మకం, ఎందుకనగా ఆ మొక్కలు ఇథిరియల్ నూనెను శ్రవిస్తాయి.
Also Read: Ban On Single Use Plastic 2022: సింగల్ యూస్ ప్లాస్టిక్ కి ఇక స్వస్తి.!