గ్యానోడెర్మా పేరు కుళ్ళు తెగులు: కొబ్బరి తోటలను ఆశించు తెగులలో గ్యానోడెర్మా తెగులు ముఖ్యమైనది మరియు చాలా ప్రమాదకరమైనది. దీనినే సిగ తెగులు, ఎర్ర లక్క తెగులు, బంక కారు తెగులు, పొట్టు లక్క తెగులు అని కూడా అంటారు. ఈ తెగులు నల్ల నేలలలో కంటే తేలిక నేలల్లోని కొబ్బరి తోటలలో ఎక్కువగా కనిపిస్తుంది. ఈ తెగులు గానోడెర్మా లుసిడం అనే బూజు జాతి శిలీంధ్రం వల్ల కలుగుతుంది. సాధారణంగా నవంబరు నుండి జూన్ వరకు ఉండే వాతావరణ పరిస్థితులు ఈ తెగులు వ్యాప్తికి దోహదపడతాయి.
Also Read: Precautions After Mango Planting: మామిడి మొక్కలు నాటిన తర్వాత రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.!
లక్షణాలు
ఈ తెగులు ముందు భూమిలో ఉండే వేర్లను ఆశీన్చును. ఈ దశలో మనము తెగులును గమనించలేము. అధిక శాతం వేర్లు కుళ్ళిన తరువాత కాండములోకి వ్యాపించి కణాలు పూర్తిగా కుళ్ళేలా చేస్తుంది. ఈ కుళ్ళు భూమిలోను, కాండంలోనూ అంతర్గతంగా ఉండడం వల్ల బయటకు కనిపించదు. క్రమంగా ఈ తెగులు వేర్ల నుండి కాండంలోనికి ప్రవేశించి కాండము మొదలు చుట్టూ ఉన్న చిన్న, చిన్న పగుళ్ళ నుండి ముదురు గోధుమ రంగు గల చిక్కటి జిగురు కారడం గమనించవచ్చు.
కాండంలోని కణాలు పూర్తిగా కుళ్ళిపోవడం వల్ల చెట్టుకు అవసరమైన నీరు, పోషక లవణాలను భూమిలో నుండి తీసుకోలేక పోతుంది. ఈ దశలో కాండము మొదలు చుట్టూ చిన్న చిన్న పగుళ్ళ ద్వారా జిగురు కారును. ఈ బంక కారుట క్రమేణా పైకి వ్యాపించి తెగులు సోకిన చెట్టు ఆకులు పసుపు రంగుకి మారి వడలిపోయి గోధుమ రంగుకి మారెను. క్రొత్త ఆకులు ఆలస్యంగా రావడం వలన తెగులు సోకిన చెట్టు పై ఆకుల సంఖ్య తక్కువగా ఉంటుంది.
- తెగులు సోకిన మొక్కలలో పుష్పాల సంఖ్య బాగా తగ్గి మగ పుష్పాల సంఖ్య పెరిగి ఆడ పుష్పాల సంఖ్య తగ్గుతుంది.
- పిందెలు, కాయలు రాలడం కూడా ఈ తెగులు లక్షణాలు.
- పేర్లు పూర్తిగా కుళ్ళిపోయి నలుపు రంగులోకి మారతాయి. తెగులు తీవ్రంగా ఉన్నప్పుడు 70% పేర్లు కుళ్ళిపోయి ఉంటాయి.
- తెగులు తీవ్రంగా ఉన్న చెట్లలో ఆకులు పసుపు రంగులోకి మారి వడలి వ్రేలాడుతుంటాయి. తర్వాత మొవ్వు భాగం మొత్తం వడలిపోయి చెట్టు ఎండిపోతుంది. ఆకులు కూడా రాలిపోతాయి.
- ఆకులు పూర్తిగా రాలిపోవడం వల్ల కాండం మోడిగా తయారయి చెక్కిన పెన్సిల్ మొన మాదిరిగా కనిపిస్తుంది.
- తర్వాత 5-6 నెలలలో చెట్టు చనిపోతుంది.
- తెగులు సోకి చివరి దశలో ఉన్న చెట్ల మొదల్లపై పుట్టగొడుగులు మొలచుట గమనించవచ్చు.
- ఈ పుట్టగొడుగుల పై భాగము ఎర్ర రంగులో ఉండి క్రింది భాగము తెలుపు లేదా బూడిద రంగులో ఉండును.
- ఈ పుట్టగొడుగుల నుండి కోట్లకొలది శిలీంధ్ర బీజాలు వెలువడి గాలి ద్వారా వ్యాప్తి చెందును.
- తడికి ఈ శిలీంధ్ర బీజాలు మొలకెత్తి దగ్గరలో ఉన్న కొబ్బరి చెట్లును తెగులుకు గురి చేయును.
Also Read: Rhizome Weevil in Banana: అరటి లో దుంప తొలుచు ముక్కుపురుగు యాజమాన్యం