Ideal Tillage: నేలను దున్నుట – నేల సహజ సిద్దం గా గట్టిగా ఉండడం వల్ల విత్తుటకు ముందు నేలను గుల్ల గా తయారు చేసి విత్తనానికి నేలలో అనుకూల పరిస్థితులను కల్పించి (కలుపు నివారణ, సరిపడ్డ తేమ, గాలి, వేడి) విత్తులు బాగా మొలకెత్తుటకు ప్రప్రధమంగా చేయు వ్యవసాయపు పని నేలను దున్నుకొనుట. దీని ద్వారా మంచి దుక్కు సాధించవచ్చు. గట్టిగా ఉన్న నేల పై పొరను వివిధ రకాలైన పని ముట్లను ఉపయోగించి గుల్లగా తయారు చేసి గింజ మొలకెత్తుటకు అనుకూలం గా నేలను తయారు చేయుటను ” Tillage” అంటారు. Tillage అనగా దుక్కి దున్నుట.
దుక్కి: ( Tilth) దున్నిన తర్వాత గింజ మొలకెత్తుటకు కావలసిన అనుకూల పరిస్థితులకు నేలను తయారు చేయుటే ‘దుక్కి’ అంటారు. Tillage అనగా భూమిని దున్నే పని, Tilth అనగా దున్నడం వలన వచ్చిన ఫలితం అంటే నేల గుల్లగా తయారు చేయడం. అంటే వేల భౌతిక పరిస్థితి ని గింజ మొలకెత్తు టకు అనుకూలం గా తయారు చేయడం. మంచి దుక్కి రావాలంటే నేలలో మంచి పదును ఉన్న సమయం లో దున్ని తక్కువ ఖర్చు తో మంచి దుక్కి రాబట్టవచ్చు.
నేలను దున్నడం వలన లాభాలు: నేల భౌతిక లక్షణం గింజ బాగా మొలకెత్తే టట్లు చేయడానికి, కలుపు నివారణ, తేమ సంరక్షణ, మట్టి ఉష్ణోగ్రత ను పెంచుటకు,దున్నడం వలన నేలలో గల కీటకాల గ్రుడ్లు, కీటకాలు సూర్య రశ్మి నేరుగా తగిలి చనిపోతాయి. పచ్చిరొట్ట ఎరువులు కలియ దున్నడానికి, సేంద్రియ మరియు రసాయన ఎరువులు నేలలో కలియ దున్నుటకు, ముందుగా వేసిన పంట మోడులను తొలగించుటకు,నేలలోపలి గట్టి పొరలను పగుల గొట్టుటకు,నేలలో వ్రేళ్ళు బాగా చొచ్చు కొని పోవుటకు, విస్తరించడానికి, ఉపయోగకరమైన వాయువులు నేలలోనికి, హానికరమైనవి బయటకు మార్పిడికి, సూక్ష్మ జీవుల చర్యలను అభివృద్ధి పరచుటకు,నేలలోపలి పొరలలోనికి యదేచ్చ గా నీరు ఇంకు రేటు ను పెంచుటకు,పంట వేసే సమయానికి నేల “గ్రాన్యులార్” నిర్మాణం లో ఉండిన మొక్కకు సరిపడ్డ గాలి, నీటి లభ్యత జరుగుతుంది. అందువలన మొక్క లకు కావలసిన మోతాదు లలో అన్ని పోషకాల లభ్యత.
మంచి విత్తన మడి లక్షణాలు: స్థూల, సూక్ష్మ నాళికలు సమాన నిష్పత్తిలో ఉన్నపుడు నేలలో తగినంత గాలి, తేమ మొక్కలకు అందుతుంది. మురుగు నీరు నిలవ ఉండదు. రేణువుల పరిమాణం (granule size) నీటి పారుదల ప్రాంతాల్లో 5 మి. మీ మెట్ట ప్రాంతాల్లో 2 మి.మీ కన్నా ఎక్కువ ఉండాలి. లేనిచో నీటి ప్రవాహం వల్ల నేల కోతకు గురి అవుతుంది. విత్తనం వేసే నేల గుల్లగా ఉంది సేంద్రియ పదార్ధం సరిపడినంత చేయాలి.