Natural Pest Control: ప్రకృతిలో ఒక వైపు నష్టపరిచే చీడపురుగు వృద్ధి చెందుతుంటే మరొక వైపు వాటిని భక్షించే బదనిక పురుగులు కూడా వృద్ధి చెంది సహజ సిద్ధంగా హానిచేసే పురుగులు మేలుచేసే పురుగుల సంతతితో సమతుల్యం అవుతుంది. ఈ సమతుల్యాన్ని పరిరక్షించుకోవటానికి మానవుడు నిత్యం ప్రయత్నించాలి. అలాకాకుండా తన స్వార్థం కోసం ప్రకృతిలోని సమతుల్యాన్ని అవహేళన చేసినచో అనేక ఇబ్బందులకు గురి కావల్సివస్తుంది.
అధికాహారోత్పత్తికి హైబ్రిడ్ రకాలను ఎన్నోఫైర్లలో రూపొందించి సాగు చేస్తూ ఉన్నారు. అధిక దిగుబడి వంగడాలను హైబ్రిడ్ వంగడాలకు ఎక్కువ మొత్తంలో రసాయనిక ఎరువులు వాడుతున్నారు. దేశవాళీ రకాలతో పోల్చుకున్నచో ఈ అధిక దిగుబడులు ఇచ్చే రకాలను చీడపీడలు ఎక్కువగా ఆకర్షించి నష్ట పరుస్తూ ఉంటాయి. ఈ నష్టాన్ని అరికట్టటానికి మనం చేస్తున్న ప్రయత్నాలలో కీటక సంహారక మందులు వాడటం ప్రాధాన్యత వహిస్తుంది. ఈ ప్రక్రియ రైతాంగాన్ని ఎక్కువగా ఆకర్షిస్తుంది.
Also Read: Primary Tillage: ప్రాథమిక దుక్కి ఎప్పుడు చెయ్యాలి.!
సహజ నివారణ చర్యలు:
వాతావరణ పరిస్థితులు (Climatic Conditions):
వాతావరణ పరిస్థితులు చీడ పురుగుల సహజ నివారణకు చాలా ముఖ్యమైనవి,సమర్థవంతమైనవి. వరాలు, తత్ఫలితంగా ఏర్పడే మెత్తని భూమి, కొన్ని రకాల లద్దె పురుగులు, ఎర్ర గొంగళి పురుగులు, కోశస్థ దశకు మారడానికి, వాటి రెక్కల పురుగులు భూమికి వెలువడడానికి అవసరము. కాని, అధిక వర్షాల వలన మొక్కల రసాన్ని పీల్చే పేనుబంక, పేను పురుగుల ఉదృతి తగ్గుతుంది. అదే విధంగా గాలిలోని ఉష్ణోగ్రతలేమ అనుకూలంగా లేనట్లయితే పురుగుల సాంద్రత తగ్గుతుంది.
సహజ అవరోదాలు (Natural Barriers):
భౌగోళిక పరిస్థితులు అనగా కొండచరియలు, సముద్రాలు వివిధ ప్రాంతములకు పురుగుల వ్యాప్తిని అరికట్ట గలవు. భూమి రకము కూడా పురుగుల అభివృద్ధిని నిరోధించ గలవు.ఉదాహరణకు భూమిలో నివసించే వేరు పురుగులు తేలిక రకపు భూములలోను, ఎర్రనేలలోను ఎక్కువగా అభివృద్ది చెంద గలవు. కానీ నల్లరేగడి భూమిలో అభివృద్ధి చెందలేవు.
సహజ శత్రువులు (Natural Enemies):
ప్రతి కీటకానికి ప్రకృతిలో అనేక సహజ శతృవులున్నవి. ఇవి కీటకాలను భక్షించి వాటిని అదుపులో పెట్టగలవు. వీటిని బదనిక పురుగులు అని, పరాన్న జీవులని / పరాన్న భుక్కులని వ్యవహరిస్తాం. ఇవి కాక కొన్ని రకాల వైరసులు, బాక్టీరియా, శిలీంద్రంలు కీటకాలకు ఆశించి రోగములు కలుగ జేయగలవు. అందు వలన కీటక సంతతి ప్రకృతి సిద్ధముగా నివారించ బడుతుంది.
Also Read: Mechanical Methods for Pest Control: యాంత్రిక పద్ధతులు ఉపయోగించి చీడ పురుగులను ఎలా అరికట్టాలి.!