Dragon Fruit Nursery: డ్రాగన్‌ఫ్రూట్ అనేదీ కాక్టేసి ఫ్యామిలీ కి చెందినది. ఇది సూర్యరశ్మిని బాగా ఇష్టపడే మొక్క(హీలియోఫైట్). కావున నర్సరీని పెంచడానికి స్థలాన్ని ఎంచుకునే సమయంలో బహిరంగంగా మంచి సూర్యకాంతి వచ్చే ప్రదేశాన్ని ఎంచుకోవాలి. కానీ ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు మాత్రం ఈ నర్సరీని సహజ నీడలో అనగా చెట్ల క్రింద లేదా కృత్రిమ నీడలో (అక్కడ ఉన్న స్థలం పరిస్థితిని బట్టి; 25-50శాతం నీడ) ఉండేలా ఏర్పాటు చేసుకోవాలి. నర్సరీ పెంచే సమయంలో నీటి ఎద్దడి లేకుండా చూసుకోవాలి.
డ్రాగన్ ఫ్రూట్ కోతలను నాటుకోవడానికి 30 × 12 సెం.మీల పరిమాణం ఉన్న పాలీబ్యాగ్‌లను ఎంచుకోవాలి. ఈ పాలీబ్యాగ్‌లను మట్టి+ఇసుక+ పశువుల ఎరువును 3:1:1 సమతౌల్యంలో లేదా మట్టి + ఇసుకమీడియంను 3:1 పరిమాణంలో నింపుకోవాలి. కొన్నిసార్లు, రైతులు బాగా కుళ్ళని పశువుల ఎరువును ( FYMని) వాడటం వలన తెగులు మరియు వైట్‌గ్రబ్ల సమస్య ఎందురుకుంటారు కావున బాగా కుళ్ళిన ఎరువును గ్రోత్ మీడియంగా పాలీ బ్యాగులలో నింపుకోవాలి. చెదపురుగుల బాద నివారణకు ముందుగానె 2-3 మి.లీ క్లోర్‌పైరిఫాస్ 40 EC ను లీటరు నీటిలో కలుపుకొని వాడుకోవాలి. నర్సరీలో బ్యాగ్‌ల కింద ప్లాస్టిక్ షీట్‌ను పరుచుకోవాలి కావున నర్సరీలోకి చెదపురుగుల ఉదృత్తి నివారిస్తుంది.
Also Read: Dragon Fruit Cultivation: డ్రాగన్ ఫ్రూట్ సాగు ద్వారా ఏడాదికి 10 లక్షల సంపాదన
డ్రాగన్‌ఫ్రూట్స్ అనేవి తక్కువ తక్కువ నీటి అవసరం ఉండే పంట. కావున తరుచుగా కొద్ది కొద్దిగా నీటిని ఇచ్చుకోవడం వలన మంచి ఉపయేగం పొందవచ్చు. పాలీ బ్యాగులలో నీటి ఎద్దడిని ఉండకుండా నివారించుకోవాలి. నర్సరీ బ్యాగ్‌లలో తగినంత నీటి శాతం ఉండటానికి వారానికి ఒక్కసారి నీటిని ఇచ్చుకోవాలి. నాటుకున్న కోతలపై నీటిని చిలకరించుకోవాలి, అందువలన వాటి వేళ్ళకు నీరు మంచిగా అంది మొలకెత్తడానికి మరియు పెరిగేందుకు మంచి వాతావరణాన్ని కల్పిస్తుంది.
నర్సరీలో గమనించే తెగులు మరియు వ్యాధులు:
పాలిథిన్ సంచులలో నీరు నిల్వడం వలన లేదా కోతలకు ఇంకా వేళ్ళకు గాయం తగలడం వలన కోతలకు పసుపు కాండం కుళ్లు వ్యాధి వచ్చే అవకాశం ఉంది. ఈ వ్యాధి రావడం వలన, ఆకుపచ్చని కాండం కాస్త పసుపు రంగులోకి మారడం ప్రారంభమవుతుంది. ఇది కింద భాగం నుండి కాండం పై కొన భాగం వైపు వ్యాప్తిస్తుంది.తరువాత ఆ మొక్క పెరుగుదల ను ఆపెస్తుంది. ఇందు మూలాన నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి.
తల్లి మొక్క నుండి కాయలను కోసె సమయంలో స్టెరిలైజ్ చేసిన కత్తిని ఉపయేగించి కోతల చివరి భాగం లో ఎలాంటి గాయం కాకుండా వేరు చేసుకోవాలి. పసుపు కాండం తెగులు సోకకుండా నివారించడానికి తగినంత కాల్సింగ్ చేయాలి. పసుపు భాగాన్ని కాయల నుండి వేరు చేసి తీసెసిన తర్వాత కాపర్ ఆక్సిక్లోరైడ్ 50% WP ను పెట్టాలి. టెర్మై ట్లు కూడా ఈ వ్యాధి తీవ్రతను పెంచుతాయి.చేద పురుగుల ప్రభావం ఉన్న ప్రాంతాలలో అవి కూడా నర్సరీని వ్యాపిస్తాయి. దాని నివారణ కొరకు ముందు జాగ్రత్త చర్యలో భాగంగా క్లోరిపైరిఫాస్ 40 ఇసి ను లీటరు నీటిలో 2-3 మి.లీ కలిపి నానబెట్టుకోని తరువాత నాటుకోవాలి.
Also Read: Dragon Fruit Health Benefits: రోగుల చికిత్సలో డ్రాగన్ ఫ్రూట్