Cotton Flower Dropping: పత్తిలో పూత, పిందె రాలడానికి అనుకూలమైన వాతావరణ పరిస్థితులు
సూర్యరశ్మి:
ప్రత్తి మొక్క తగినంత సూర్యరశ్మి ఉన్నప్పుడు కిరణజన్య సంయోగ క్రియ ద్వారా ఆహార పదార్థాలతో పాటు మొక్క ప్రత్యుత్పత్తి భాగాలు అభివృద్ధి చెందుతాయి. కానీ మిగవృత్తముయిన వాతావరణ పరిస్థితులలో పిందె రాలడం జరుగుతుంది.
మొక్కకు లభించే సూర్యరశ్మి మొత్తం కూడా పిందె రాలడన్ని ప్రభావితం చేస్తుంది. ప్రత్తి మొక్క ఎక్కువ పొడుగు పెరిగినప్పుడు ఆ మొక్క నీడలో అధిక కాలం పాటు ఉన్న పిందె రాలడం జరుగుతుంది.
Also Read: Cotton Cultivation: ప్రత్తి పంట లో వర్షాలు తగ్గిన తర్వాత రైతులు పాటించవలసిన యాజమాన్య పద్ధతులు
ఉష్ణోగ్రత:
ప్రత్తి మొక్క అధిక ఉష్ణోగ్రత వంటి ప్రతికూల వాతావరణం పరిస్థితులు తట్టుకోగలదు .
వరుసగా 17నుండి 20 రోజుల పాటు రాత్రి ఉష్ణోగ్రత 85డిగ్రీ ల ఫారన్హీట్ ఉంటే పూత, పిందె రాలడం జరుగుతుంది.
నేలలో తేమ శాతం:
నేలలో తేమ శాతం అధిక కాలం పాటు తక్కువగా ఉన్నపుడు పూత, పిందె రాలడం జరుగుతుంది.
అదే విధంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురవడం వలన పంటలో నీళ్ళు ఎక్కువ రోజులు నిల్వ ఉన్న పరిస్థితులుల్లో కూడా పూత, పిందె రాలడం జరుగుతుంది .
నీటి యాజమాన్యం:
సాగునీటి వసతి ఉన్న పరిస్థితులుల్లో నూతన యాజమాన్య పద్ధతులు పాటించడం వలన ఎక్కువగా గొడుగు కొమ్ములు, కాయ కొమ్ములు, మొక్కలో తయారు అయ్యే పిండి పదార్థంలో ఎక్కువ భాగం, ఈ కొమ్ముల అభివృద్ధి కి ఉపయోగపడి, పూత, పిందె రాలడం జరుగుతుంది. ఈ కారణాలే కాకుండా మొక్క లక్షణాలు కూడా పిందె రాలడాన్ని ప్రభావితం చేస్తాయి. వాటిలో ముఖ్యమైనది మొక్కకి పూత, పిందె సంఖ్య ఎక్కవ గా ఉన్నపుడు వాటి మధ్య పోషకాల కోసం పోటీ ఏర్పడి పూత పిందె రాలడం గమనించవచ్చు
నేల రకాలు:
పత్తి పంటను సమస్యాత్మక భూములలో చౌడు, ఆమ్ల, నేలలు సున్నం పాలు అధికంగా ఉన్న నేలలు సాగు చేసినపుడు పూత, పిందె రాలడం జరుగుతుంది.
సూక్ష్మ పదార్థ లోపాలు:
బోరాన్ సూక్ష్మ పదార్ధ లోపం ఉన్నప్పుడు పూల స్వరూపం మారి ఆకర్షణ పత్రాలు చిన్నవి అయ్యి లోపలకు ముడుచుకు పోతాయి. కొంత పలచగాను ఉండి అక్కడ అక్కడ రింగుల మచ్చలు ఏర్పడతాయి. కాయలు సరిగా అభివృద్ధి చెందక ఆకారం కోల్పోయి కాయ పెరిగే దశలో ఒక్కసారి నిలువుగా పగుళ్ల్లు ఏర్పడతాయి. బోరాన్ లోప నివారణకు పైరు వేసిన 60 మరియు 90 రోజుల తరువాత లీటర్ నీటికి 1-1.5 గ్రాముల బోరె్స్ వారం రోజుల వ్యవధి ల్లో రెండు సార్లు పిచికారీ చెయ్యాలి.
నివారణ:
నాఫ్తాలీన్ఏసిటిక్ యాసిడ్ 10పిపి యం ద్రావణన్ని విడిగా గాని లేక 1-3 శాతం డై అమ్మోనిమ్ ఫాస్ఫేట్ ద్రావణం తో కలిపి గాని ఒకటి లేదా రెండు సార్లు పిచికారీ చెయ్యడం ద్వారా పూత పిందె, రాలడాన్ని కొంత వరకు నివారిచావచ్చు.
బెట్టకు లేదా నీటి ముప్పుకు ప్రత్తి పొలం గురి అయినపుడు, తాగు యాజమాన్య చర్యలను సకాలంలో చేపట్టడం ద్వారా పూత, పిందె రాలడాన్ని అరికట్టవచ్చు. పొటాషియం నైట్రేట్ 1% లీటర్ నీటికి కలిపి పిచికారీ చెయ్యడం ద్వారా పూత, పిందె రాలడాన్ని అరికట్టవచ్చు.
సాధ్యం అయినంత వరకు పోషక పదార్థాలను, హార్మోన్ పిచికారీ చేసినప్పుడు, మంచి నీటిని ఉపయోగిస్తూ, సాయంత్రం సూర్యరశ్మి అధికంగా లేని సమయలో పిచికారీ చేసినట్టులు అయితే మొక్కలు వాటిని బాగా గ్రహిస్తాయి.
జీవ కారకలు
- రసం పీల్చే పురుగులు
- ట్యూబ్బాకో స్ట్రింక్ వైరసస్
పచ్చదోమ:
- ఆకు పచ్చ రంగు కలిగి దోమలు చురుగా ఉండి ఏ మాత్రం కదలక ఏర్పడిన ఎగిరిపోతాయి.
- ఇవి ఆకుల క్రింద భాగం నుండి రసం పీల్చిడం వలన ఆకుల క్రిందకి ముడుచుకొని అంచులు పసుపు మరియు ఎరుపు రంగు కి మారతాయి.
- ఈ పురుగు ఉదృతి వల్ల ఎక్కువ గా పూత, పిందె రాలడం జరిగితుంది
తెల్ల దోమ
తెలుపు రంగు కలిగిన దోమలు ఆకుల అడుగు భాగం ల్లో, లేత చిగుళ్ళపై గుప్పులుగా చేరి రసాన్ని పీల్చుకొని పూత, పిందె రాలడం జరుగుతుంది.
టాబ్బకో స్ట్రైక్ వైరస్ తెగులు
ఈ వెరైస్ తెగులు తామర పురుగులు ద్వారా పత్తిని సోకుతుంది.కొంత భాగం ఆకులు మాడిపోతాయి. వయ్యారిభామ, ఉత్తరేణి కలుపు మొక్కల ద్వారా ఈ వైరస్ లని అరికట్టవచ్చు.
నివారణ
దోమ, తామర పురుగులు తట్టుకునే రకాలను సాగు చెయ్యాలి.
కిలో విత్తనానికి తగినంత జిగిరు కలిపి 5గ్రాములు. థయోమిక్స్ తో విత్తన శుద్ది చెయ్యాలి.
తెల్ల దోమ, తామర పురుగు ఉదృతి ఎక్కువ గా ఉంటే పసుపు రంగు అట్టలు లేదా జిగురు పోసిన పసువు రంగు డబ్బాలు ఎకరానికి 12-15 చొప్పున ఉంచితే తెల్ల దోమలు అంటుకుంటాయి.
Also Read: High Density Planting in Cotton: అధిక సాంద్ర పద్దతిలో “తెల్ల బంగారం”సాగు