రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారిస్తే అధిక లాభాలు గడించవచ్చు. నీటి వినియోగం తక్కువ ఉండి, తక్కువ కాలంలో ఎక్కువ దిగుబడి పొందవచ్చు. ఇప్పుడు అధిక లాభాలు గడించే పంటలలో బంతిపూల సాగు ఒకటి. తోరణాలను అలంకరించడం మొదలు కొని పూజల వరకు, ఇతర కార్యాల్లోనూ ఎక్కువగా ఈ పూలను ఉపయోగిస్తారు. అయితే నిజానికి ఈ పూలను చాలా తక్కువ మంది పెంచుతున్నారు. కానీ కష్టపడితే ఈ పూలను పెంచడం ద్వారా ఎక్కువగా ఆదాయం సంపాదించవచ్చు. బంతి పూలకు మార్కెటులో మంచి గిరాకీ ఉంటుంది. పసుపు, నారింజ, ఎరుపు వంటి ఆకర్షణీయమైన రంగులో కనువిందు చేసే ఈ పూల పంటను సంవత్సరం పొడుగునా సాగు చేయవచ్చు. ప్రణాళికతో పంట సాగు చేసి చిన్నచిన్న మెళకువలు పాటిస్తే పుష్కలంగా దిగుబడి వస్తుంది. మార్కెటుకు పూల సరఫరాను అక్టోబర్ నుంచి ఏప్రిల్ వరకు చేయవచ్చు. పూల తోటలకు ప్రభుత్వ ఉద్యాన శాఖ ద్వారా ఎంఐడీహెచ్ పథకం కింద బిందు సేద్యంకు, మల్చింగ్‌కు రెండున్నర హెక్టార్లకు రూ.16 వేల నుంచి రాయితీ ఇస్తున్నది. ఎస్సీ, ఎస్టీ రైతులకు 100 శాతం, సన్న, చిన్నకా రు రైతులకు 90 శాతం వర్తిస్తుంది.
పెత్రమాస, బతుకమ్మ, దీపావళి, కార్తీక మాసం పండుగలకు బంతి పూలు తెంపుతారు. కిలోకు వంద నుంచి150 వరకు ధర పలుకుతుంది. ఇప్పుడు కొంచెం ధర తగ్గిందని, అయినా పెట్టుబడికి మించి లాభాలు వస్తున్నాయని రైతులు చెప్తున్నారు. .బంతి పూలను ఉదయం కాని సాయంత్రం కాని కోయాలి. కోతకు ముందు నీటి తడి ఇస్తే పూలు కోత తర్వాత ఎక్కువ కాలం తాజాగా ఉంటాయి. సాధారణంగా ఎకరానికి 4-5 టన్నుల వరకు పూలదిగుబడి వస్తుంది. బంతిపూలలో ఎన్నో రకాలు ఉన్నాయి . వీటిలో ఆఫ్రి కన్ , ఫ్రెంచ్ బంతి రకాలు ఎంతో ముఖ్యమైనవి . ఆ ఫ్రికన్ బంతి రకాలకు వాణిజ్యపరంగా మార్కెట్లో ఎంతో డిమాండ్ ఉంటుంది . ఆఫ్రికన్ రకం బంతి ఏపుగా , ఎత్తుగా పెరుగుతుంది . ఈ జాతి బంతిలో పలు రకాల రంగులు ఉన్నాయి . పెద్ద సైజు లో పూసి , ఆకర్షణీయంగా ఉంటాయి . ఫ్రెంచ్ రకం బంతి మొక్కలు పొట్టిగా పెరిగి, ధృడత్వాన్ని కలిగి ఉంటాయి
నీరు త్వరగా ఇంకిపోయే, నీరు నిల్వ ఉండని నేలలు అనుకూలం. సారవంతమైన, నల్ల రేగడి నేలల్లో బంతి పూలను సాగు చేయవచ్చు. ఈ పూలను నాటడానికి మట్టిగడ్డలు లేకుండా చేసుకోవాలి. అప్పుడు హెక్టారుకు 25 నుండి 30 టన్నుల బాగా కుళ్ళిన ఆవు పేడతో 50 కిలోల ఎన్, 200 కిలోలు కలపాలి. విత్తడానికి ముందు భాస్వరం, 200 కిలోల పొటాష్‌ను మట్టిలో బాగా కలపాలి. సీజన్‌లో బంతి పువ్వు పెరిగితే, వర్షపు ఒత్తిడిలో 10 నుండి 15 రోజుల వ్యవధిలో 1-2 సార్లు నీరు అవసరం ఉంటుంది. శీతాకాలం కోసం 8 నుండి 10 రోజుల వ్యవధి, వేసవి కాలంలో 5 నుండి 7 రోజుల వ్యవధిలో నీరు పెట్టాలి. ఇలా చేస్తే మనం అనుకున్నదానికంటే అధికంగా బంతి పువ్వుల పంట వస్తుంది.
#MarigoldFlowers #AgricultueNews #EruvaakNews #DailyTeluguNews #Farming