Problematic Soils – తెల్ల చౌడు నేలల యాజమాన్యం: మండు వేసవిలో వాటి లక్షణాలను ప్రస్పుటం గా కనబరుస్తాయి.వేసవిలో పొలాన్ని చిన్న చిన్న మడులుగా కట్టి వాటిలో మంచి నీటిని పెట్టిన తర్వాత నీటిలో మట్టి బాగా కలిసేటట్టు నాగలితో దున్ని, దమ్ము చేయాలి. దీనివలన నీటిలో లవణాలు బాగా కరుగుతాయి. రెండు రోజుల తర్వాత మట్టి అడుగుకు చేరుతుంది. నీరు తేటగా పైన నిలుస్తుంది. ఆ నీటిని మురుగు కాల్వల ద్వారా బయటకు పంపించాలి.ఈ ప్రక్రియకు నీటి లభ్యత, నీటి నాణ్యత ను దృష్టి లో ఉంచుకొని 2-3 సంవత్సరాలు చేసిన నేలలో లవణ సాంద్రత తగ్గి సాగుకు అనుకూలo.
నల్ల చౌడు నేలల యాజమాన్యం (Alkali Soils):
ఈ నేలల్లో లవణ సాంద్రత సమస్య కాదు.ఉదజని సూచి 8.5 – 10.0 వరకూ ఉండడం, బంక మట్టి రేణువుల మీద సోడియం (Na) ఆయాన్లు 15 కన్నా ఎక్కువగా అంటిపెట్టుకుని ఉండడం వల్ల నేలలో మట్టి రేణువులు విడిపోయి నేల ఆకృతి క్షీణిస్తుంది. అందువల్ల నీరు నేలలో నికి ఇంకదు.వేసవి లో నేల పెద్దగా బీటలు ఏర్పడి చీలి పోతుంది.బాగా గట్టి పడుతుంది.
సాగు కష్టతరమవుతుంది.ఈ నేల పునరుద్ధరణకు మట్టి రేణువుల పై అంటియున్న Na + ఆయాన్ల ను తీసివేసి లేదా తగ్గించే ప్రయత్నం చేయాలి. దీనికి ఉప్పం (CaSO4. 2H2O) హెక్టారుకు 2 టన్నుల (నేల క్షారాన్ని బట్టి) పొడిని పొలం మీద జల్లి తర్వాత నేలను కలియదున్ని నీరు పెట్టాలి.రసాయన ప్రక్రియ వల్ల Na+ అయాన్లు బంకమట్టి నుండి తొలగిపోతాయి.
Also Read: Primary Tillage: ప్రాథమిక దుక్కి ఎప్పుడు చెయ్యాలి.!
జిప్సం లోని సల్ఫేట్ అయాన్లు సోడియం తో కలిసి Naso4 లవణాలు గా ఏర్పడి నీటిలో కరిగి మురుగు నీరు ద్వారా పొలం నుండి బయటకు పోగొట్టాలి. ఇలా చాలా సార్లు చేసిన నేల బాగుపడుతుంది.. అంతేగాక జీలుగ, సీమ జీలుగ, పిల్లి పెసర వంటి పచ్చి రొట్ట పంటలు ఈ క్షార నేలల్లో పెంచి కలియదు న్నడం వల్ల ఈ నేలలు పునరుద్దరింపబడతాయి.
నీటిని పోషక పదార్ధాల నిల్వ సామర్ధ్యం లేని నేలల యాజమాన్యం:
సేంద్రియ ఎరువులు, చెరువులు, ఆనకట్టల వద్ద పేరుకు పోయిన ఒండ్రు మట్టిని ఎక్కువగా వేయుట వలన నీటిని పోషక పదార్థాల నిల్వ సామర్ధ్యం పెరుగుతుంది. మురుగు నీరు పోవు సౌకర్యం లేని నేలల నిర్వహణ:సేంద్రియ ఎరువులు ఎక్కువగా వేయుట.మురుగు నీరు పోవుటకు వాలుగా కాల్వలు చేయుట.
Also Read: Mechanical Methods for Pest Control: యాంత్రిక పద్ధతులు ఉపయోగించి చీడ పురుగులను ఎలా అరికట్టాలి.!