Cotton American Bollworm: మన భారత దేశంలో పెంచే ప్రధాన వాణిజ్య పంటల్లో పత్తి ముఖ్యమైన పంట. ఈ పంట వస్త్ర పరిశ్రమకు వెన్నెముకగా నిలుస్తుంది. పత్తి పంటను అనేక తెగుళ్ళు మరియు కీటకాలు దాడి చేస్తాయి. ఏది ఏమైనప్పటికీ, పత్తి ఉత్పత్తిలో ప్రధాన నష్టాలు దాదాపు 162 రకాల కీటకాలు, తెగుళ్ల వలన ఉంది.
Also Read: Types of Castor Oil: ఆముదం నూనె రకాలు
పత్తి పంటలో కాయ తొలుచు పురుగుల (అమెరికన్ బోల్వర్మ్) వలన 40 -50% పంట నష్టం జరిగే అవకాశం ఎక్కువుగా ఉంది. మరియు ఈ కాయ తొలుచు పురుగులు పురుగుల మందుల నుండి రోగనిరోధకశక్తిని పెరిగింది కావున వాటి నిర్వహణ సవాలుగా మారింది. పరిశోధనలో శాస్త్రవెత్తలు ట్రాన్స్జెనిక్ కాటన్ (పత్తి) హైబ్రిడ్లను అభివృద్ధి చేసారు. వాటిని బిటి కాటన్ అని పిలుస్తారు. కాటన్(పత్తి) హైబ్రిడ్ మొక్కలు పై కాయ తొలుచు పురుగులను (అమెరికన్ – బోల్వా్ వామ్) ఎలాంటి పురుగుమందులను వాడాల్సిన అవసరం ఉండదు.
కాయ తొలుచు పురుగును యొక్క గుర్తింపు మరియు పర్యవేక్షణ: ఇది పత్తి పంటలో ఒక ప్రధాన తెగుళ్ళు. జూలై-అక్టోబర్ మరియు ఫిబ్రవరి-ఏప్రిల్ నెలల్లో చాలా ఎక్కువగా కనిపిస్తుంది. వయోజన కీటకం దృఢంగా పసుపు గోధుమ రంగులో ఉంటుంది. ముందు రెక్కలపై ముదురు మచ్చలు ఉంటాయి ఇంకా బూడిదరంగు గీతలు మరియు నలుపు కిడ్నీ ఆకారంలో గుర్తులు కలిగి ఉంటుంది.
వెనుక రెక్కలు తెల్లగా అంచులలో నల్లటి పాచ్‌లు ఉంటాయి. దీని లార్వా 35 మి.మీ పొడవు, ఆకుపచ్చని గోధుమ రంగులో శరీరం వైపులాముదురు బూడిద పసుపు చారలతో ఉంటుంది. 65 నుండి 100 రోజులు ఉన్న పంటలో, ఒక మొక్కకు ఒక గుడ్డు లేదా లార్వా లేదా 5 నుండి 10 శాతం నష్టం జరిగిన కాయలు ఉన్నప్పుడు ఆర్థిక పరిమితి స్థాయి చేరిందని అర్థం(ETL).
ఈ పురుగు వలన కలిగే నష్టాలు:మొదట లార్వా ఆకులను తింటుంది తరువాత బోల్స్ మరియు గింజల్లోకి దాని తలను నెట్టి, మిగిలిన శరీరాన్ని బయట వదిలేసి రంధ్రాలు చేస్తుంది.ఈ రంధ్రాలు బోల్ యొక్క అడుగు భాగంలో పెద్దగా గుండ్రంగా ఉంటాయి.ఒక లార్వా 30-40 బోల్స్‌కు నష్టచేయగలదు.
Also Read: Weed Management in Cotton: పత్తి సాగులో కలుపు యాజమాన్య పద్ధతులు