మన వ్యవసాయం

Agriculture: తొలకరికి రైతులు ఎలా సన్నాహాలు చేసుకోవాలి.!

0
Agruculture
Agruculture

Agriculture: గత అనుభవాలను, మన ఆర్థిక మరియు వ్యవసాయ వనరులను దృష్టిలో ఉంచుకొని గతంలో చేసిన పొరపాట్లను తిరిగి చేయకుండా తొలకరిలో సరైన సన్నాహాలను ఈ చేసుకొన్నట్లయితే లాభసాటి వ్యవసాయం సాధ్యమే. అలా చేయకపోతే భారీగా నష్టపోయే ప్రమాదం ఉంది.

Agriculture

Agriculture

  • మనకున్న నేలరకం, నీటి వసతి, పెట్టుబడి లభ్యత మరియు కుటుంబ పరిస్థితి వంటి విషయాలను దృష్టిలో ఉంచుకొని పంటలను మరియు రకాలను ఎన్నుకోవాలి.
  • మన పరిస్థితులకు అనుగుణంగా మన వ్యవసాయ ప్రణాళిక ఉండాలి. ఎప్పటికీ వేరే వాళ్ళను అనుకరించరాదు. కొన్ని దీర్ఘకాలిక, మరికొన్ని స్వల్పకాలిక ఆదాయ వనరులను సృష్టించే విధంగా ఉండాలి.

Also Read: Garlic Harvesting: వెల్లుల్లి కోత సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు

  • మొదటగా నేల సారవంతతను బాగా అభివృద్ధి చేయాలి. వీలున్నంత మేరకు చెరువు మట్టిని పంటపొలాలకు వేసవిలో తోలుకోవాలి. పశువుల ఎరువు లేదా కోళ్ళ ఎరువు లేదా గొర్రెల ఎరువును తప్పకుండా వ్యవసాయంలో వాడాలి.
  • గొర్రెల మందలను పెట్టాలి.
  • ఒకటి లేదా రెండు నీటి తడులు ఇచ్చే అవకాశం ఒకటి లేదా రెండు నీటి తడులు ఇచ్చే అవకాశం ఉన్నచోట వేసవిలో పచ్చిరొట్ట ఎరువులను (జీలుగ/పెసర/జనుము) వేసి అవి పూతదశకు చేరుకునే ముందే రొటవేటర్ సహయంతో నేలలో కలియదున్నాలి.
  • కేవలం స్థూలపోషకాలే కాకుండా సూక్ష్మపోషకాలకు సంబంధించిన ఎరువులను కూడా నేలలో వేయాలి.
  • పంటల ఎన్నిక ఏక పంటకు బదులుగా బహుళ పంటల పద్ధతిని ఎన్నుకోవాలి. దీర్ఘకాలిక పంటలకు బదులుగా 2-3 స్వల్పకాలిక పంటలు, తక్కువ పెట్టుబడి అవసరమున్న పంటలను ఎన్నుకోవాలి. అంతర పంటల సాగుకు ప్రాధాన్యం ఇవ్వాలి.
  • పంటలలో మన పరిస్థితులకు అనువైన రకాలను, అలాగే వనరులను మన ప్రాంతంలో వచ్చే చీడపీడలను తట్టుకొనే రకాలను ఎంచుకోవాలి.
  • ఎండాకాలంలో మట్టి నమూనా పరీక్షలు చేయించాలి.
  • భూగర్భజలాల వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకొని వాటికి అనుగుణమైన పంటలు సాగు చేయాలి.
  • తరచుగా కిసాన్ కాల్ సెంటర్ లేదా మండల వ్యవసాయ అధికారిని లేదా ఏరువాక కేంద్రాలను సంప్రదించాలి.
  • వ్యవసాయ శాఖ చేబడుతున్న వ్యవసాయ పథకాలను తెలుసుకొని వాటిని చక్కగా వినియోగించుకోవాలి.
  • పంటపొలాలకు పంటరుణాల వంటి వాటిని రైతులు వినియోగించు కోవాలి.
  • విత్తనాలను అధీకృత డీలర్ల దగ్గరనే కొనాలి. అలాగే రశీదు తీసుకొని భద్రపరచుకోవాలి.

ఈ విధంగా రైతులు సరియైన ప్రణాళికలను సూక్ష్మపోషకాలకు ఖరీఫు మందుగా రూపొందించుకొని, పంటలపై పెట్టుబడిని తగ్గించుకొని, పంటల ఉత్పత్తి మరియు ఉత్పాదకతను గా బహుళ పంటల పెంచుకొని, వ్యవసాయంతో పాటు వ్యవసాయ అనుబంధ కు బదులుగా 2-3 రంగాలపై కూడా దృష్టిని సారించి వ్యవసాయాన్ని ఈ ఖరీఫ్ సీజన్లో పండుగలాగా చేసుకోవాలి.

Also Read: Crossandra Harvesting: కనకాంబరం కోసే సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు

Leave Your Comments

Neem oil: వేప మందుల వాడకంలో రైతులు తీసుకోవలసిన జాగ్రత్తలు

Previous article

Fodder Crops: పశుగ్రాసాల ఎంపిక లో మెళుకువలు

Next article

You may also like