Housing System of Poultry: కోళ్ల పెంపకం, దేశీయంగా లేదా వాణిజ్యపరంగా పక్షులను పెంచడం, ప్రధానంగా మాంసం మరియు గుడ్ల కోసం కానీ ఈకల కోసం కూడా. కోళ్లు, టర్కీలు, బాతులు మరియు పెద్దబాతులు ప్రాథమిక ప్రాముఖ్యత కలిగి ఉంటాయి, అయితే గినియా ఫౌల్ మరియు స్క్వాబ్‌లు (యువ పావురాలు) ప్రధానంగా స్థానిక ఆసక్తిని కలిగి ఉంటాయి. పౌల్ట్రీ పెంపకం ఇది వ్యవసాయ యుగం నుండి ఉద్భవించింది. గుడ్ల కోసం పెంచే కోళ్లను పొరలుగా పిలుస్తారు, మాంసం కోసం పెంచే కోళ్లను బ్రాయిలర్‌లు అంటారు.
Also Read: Bud Rot Symptoms in Coconut: కొబ్బరిలో మొవ్వు కుళ్ళు తెగులు లక్షణాలను ఇలా గుర్తించండి.!
కోళ్ళ గృహవ్యవస్థ (Housing System of Poultry):
మనము ఆశించిన ఆశయాలకు, కోళ్ళ పెంపకానికి గృహ నిర్మాణములు ఈ క్రింది కనబరిచిన విధాల ద్వారా ఆయా ప్రదేశాలకు అనుకూలంగా ఉండేలా నిర్మించుకోవచ్చును. ఈ గృహ నిర్మాణ విషయంలో కొన్ని ముఖ్య గమనికలను దృష్టిలో ఉంచుకుని నిర్మించవలయును.
ఎ) బ్యాటరీ సిస్టమ్ లేదా కేజ్ సిస్టమ్ :- ఈ పద్ధతి నూతనమైనది మరియు ఇటీవల కాలంలో కనుగొనబడినది. ఈ వ ద్ధతి వ్యాపార రీత్యా రైతులకు ఒక వర ప్రసాదము. ఈ పద్ధతిని తక్కువ స్థలం ఉన్న ప్రదేశాల్లో అవలంభించుటకు అను కూలంగా ఉండును. ఈ పద్ధతిలో కోళ్ళను గూటిలో పెట్టి వాటి కదిలికలను మితం చేసి పెంచెదరు. ఇందులో వాటికి అవస రమైన ఆహారం, నీరు వెలుపలి భాగంలో అమర్చెదరు. దీని క్రింద భాగంతో వాటి మల మూత్రములు వడుటకు వీలుగ వ్రేలను అమర్చిదరు. ఈ పద్ధతిలో కోళ్ళను అంతస్తులలో పెట్టి పెంచవచ్చును. కజ్ సిస్టమ్ వలన కలుగు
లాభాలు :
- రోగాలను నియంత్రించవచ్చును.
- తక్కువ మోర్టాలిటీ ఉండును.
- మందుల ఖర్చులను ఆదా చేయవచ్చు.
- ఎక్కువ గ్రుడ్లను ఉత్పాదన చేయవచ్చును.
- కూలీల ఖర్చు తగ్గించవచ్చును.
- మంచి నిర్వాహణ చేయవచ్చును.
- గ్రుడ్లను పొడుచుట మున్నగు వాటిని తగ్గించవచ్చును.
- సులభమైన పెంపకపు పద్ధతి.
- తక్కువ ప్రదేశంలో ఎక్కువ కోళ్ళను పెట్టి డబ్బును స్థలాన్ని ఆదా చేయవచ్చును.
- వయస్సును బట్టి కోడిపిల్లలకు గ్రోయ్స్కు, లేయర్స్కు విడివిడిగా ఉంటాయి.
Also Read: Poultry Farming: కోళ్లలో వచ్చే ఎగ్ డ్రాప్ సిండ్రోమ్ వ్యాధి లక్షణాలు మరియు యాజమాన్యం