ఉద్యానశోభ

Yasangi Maize Cultivation: యాసంగి మొక్కజొన్న సాగు సమగ్ర యాజమాన్యం.!

1
Maize Crop
Maize Crop

Yasangi Maize Cultivation: ఉభయ తెలుగు రాష్ట్రాలలో వరి తర్వాత మొక్కజొన్న పంటను ఎక్కువగా సాగు చేస్తున్నారు. ఈ పంటను ఆహారం గాను, వివిధ పరిశ్రమలలో, పశువులకు మేతగాను ఉపయోగిస్తున్నారు. వివిధ జిల్లాలలో నీటి లభ్యత ఆధారంగాను దీర్ఘకాలిక, మధ్యకాలిక మరియు స్వల్పకాలిక రకాలను  ఎన్నుకొని విత్తన శుద్ధి చేసి యాసంగిలో విత్తుకోవాలి.

Yasangi Maize Cultivation

Yasangi Maize Cultivation

నేలలు: సారవంతమైన మంచి నేలలు ఎన్నుకోవాలి.
విత్తే కాలం: ఈ పంటను  అక్టోబర్‌ 15 నుంచి 15 నవంబర్‌ 15 వరకు  విత్తుకోవాలి.
రకాలు: ఎంపిక ప్రభుత్వ మరియు సిఫార్సు చేసిన ప్రైవేట్‌ రంగ సంస్థల నుండి దీర్ఘకాలిక, మధ్యకాలిక , స్వల్పకాలిక రకాలను ఎన్నుకొని సాగు చేసుకోవాలి.

ప్రభుత్వ రకాలు:
డిహెచ్‌ఎం 117: ఈ రకం ఆకు ఎండు, కాండంకుళ్ళు తెగుళ్లను  మరియు కాండం తొలిచే పురుగులను తట్టుకుంటుంది.
డిహెచ్‌ఎం 121: ఈ రకం పాము పొడ ఆకు ఎండు మరియు పూత తర్వాత వచ్చే కాండం కుళ్ళు లేదా మసి కుళ్ళు తెగులును, కాండం  తొలిచే పురుగును  తట్టుకుంటుంది.
కరీంనగర్‌ మక్కా: ఈ రకం తుప్పు తెగులు  మరియు ఆకుమాడుతెగులు కొంత వరకు తట్టుకుంటుంది.
కరీంనగర్‌ మక్కా 1: ఈ రకం కాండం కుళ్ళు /ఎండు తెగులు,పాము పోడ తెగులు  మరియు ఆకుమాడు తెగులు కొంతవరకు తట్టుకుంటుంది.                 ప్రైవేటు రకాలు: కే 50, కె 8 3 22, బయో 9 5 44, పిఎసి 751, పిఎసి 741, పయనీర్‌ 3 59 2, ఎన్‌.కె 6 2 4 0, సిప్‌ 333 మరియు ఎస్‌ 6668  మొదలగు రకాలను ఎన్నుకొని విత్తుకోవాలి.
విత్తన మోతాదు ఎకరానికి 8 కిలోల విత్తనం సరిపోతుంది మొక్కకు మొక్కకు 20 సెంటీ మీటర్లు, సాలుకు సాలుకు 60 సెంటీ మీటర్లు ఎడమ ఉండేటట్లు విత్తుకోవాలి.

ఎరువుల యజమాన్యం: వ్యవసాయ విశ్వవిద్యాలయాలు మరియు వ్యవసాయ శాఖలు ఇచ్చిన భూసార పరీక్ష ఫలితాలను బట్టి ఎరువులను రైతులు ఈ పంటలో వాడాలి ఒక ఎకరాకు పది టన్నుల పశువుల ఎరువును ఆఖరి దుక్కిలో వేయాలి. యాసంగి మొక్కజొన్నలో 90 కిలోల నత్రజని, 32 కిలోల భాస్వరము , 32 కిలోల  పొటాషియం ఇచ్చే రసాయనకేరువులను ఒక ఎకరంలో వేయవలెను.  జింక్‌ ఒక ఎకరాకు 20 కిలోల జింకు సల్ఫేట్‌ ను రెండు నుంచి మూడు పంటలకు ఒకసారి దుక్కిలో వేయవలెను.

కలుపు యాజమాన్యం: ఈ పంట విత్తనాలు విత్తిన తర్వాత అట్రాజన్‌ 50% డబ్య్లుపి 800 గ్రాముల నుంచి ఒక కిలో లేదా  పెండిమిధాలిన్‌ 30% ఈసీ ఒకటి నుంచి 1.25 లీటర్ల మందును 200 లీటర్లలో కలిపి విత్తిన  ఒక్కటి నుంచి రెండో రోజు లోపే పిచికారీ చేయవలెను.

నీటి యాజమాన్యం: సాధారణంగా మొక్కజొన్న పంటకు నేల ఆధారంగా  6  నుంచి 10 తడులు యాసింగి మొక్కజొన్నకు అవసరం. ముఖ్యంగా మూడు దశలలో అనగా పూతకు ముందు, పూత దశలో మరియు గింజలు పాలు పోసుకునే దశలో నీరు తప్పకుండా ఈ పంటకివ్వాలి.  ఈ పంటకు పురుగులు మరియు  తెగుళ్లు ఆశించి నష్టం కలగజేసే అవకాశం ఉన్నది.

Also Read: Rabi Maize: రబీ మొక్కజొన్న లో ఎరువుల యాజమాన్యం.!

పురుగుల్లో ముఖ్యమైనది: కాండం తొలుచు  పురుగు ఈ పురుగును గుర్తించిన వెంటనే  కార్బోఫ్యూరాన్‌ 3 జి గుళికలను మూడు కిలోలు మొక్క సుడుల్లో లేదా మోనోక్రోటోఫాస్‌ 1.6 ఎశ్రీ   ఒక లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయవలెను.
కత్తెర పురుగు గత నాలుగు సంవత్సరాల నుంచి ఈ పురుగు ఉధృతి ఎక్కువ అవుతున్నది. కావున రైతులు విత్తే ముందు ఒక కిలో విత్తనానికి ఇమిడా క్లోప్రిడ్‌ 600 ఎఫ్‌.ఎస్‌ 4 మి.లీ. లో  పట్టించి విత్తుకోవాలి.

Pests in Maize

Pests in Maize

ఈ పురుగును గుర్తించిన వెంటనే 5 మి.లీటర్ల వేప నూనె (1500 పి.పి. యం.) ఒక్క  లీటరులో కలిపి  మొక్క సుడులలో పిచికారీ చేయవలెను. ఈ పురుగు ఉధృతి తగ్గనిచో ఇమామెక్టిన్‌ బెంజోయేట్‌ 0.4 గ్రాములు  లేదా  క్లోరాంత్రానిలిప్రోల్‌ 0. 3 జి లేదా 0. 5 %ఎశ్రీ% స్పైనటోరం. వీటిలో ఏదైనా ఒక మందును ఒక్క లీటరు నీటిలో కలిపి పైరు మొత్తం తడిచే విధంగా పిచికారీ చేయవలెను.
తెగుళ్లు వివిధ రకాల తెగుళ్లు ఆశించి నష్టం కలిగే చేసే అవకాశం ఉన్నది. వీటిలో ముఖ్యమైనవి ఆకుమాడు తెగులు, తుప్పు తెగులు, కాండం కుళ్ళు తెగులు లేదా మసి కుళ్ళు లేదా ఎండు తెగులు.
తుప్పు తెగులు గుర్తించిన వెంటనే ఒక లీటరు నీటిలో 2.5 గ్రాముల మాంకోజెబ్‌  పిచికారీ చేయవలెను. ఆకుమాడు తెగులు గుర్తించిన వెంటనే ఒక లీటరు నీటిలో 1.0 కార్బండిజమ్‌ మందును పిచికారీ చేయవలెను.

ఎండుతెగులు: ఈ తెగులు పూత దశ తర్వాత నేలలో నీటి శాతం తగ్గడం, బెట్ట పరిస్థితులు ఏర్పడడం, వాతావరణంలో మార్పుల వల్ల ఈ తెగులు ఎక్కువగా వస్తుంది. పంట కోత సమయంలో ఈ తెగులు లక్షణాలు ఎక్కువగా కనబడతాయి. తెగులు వచ్చే ప్రాంతంలో తట్టుకునే రకాలైన డిహెచ్‌ఎం 117, డిహెచ్‌ఎం 121, కరీంనగర్‌ మక్కా, కరీంనగర్‌ మక్కా 1 రకాలను ఎన్నుకొని  విత్తుకోవాలి. పంట మార్పిడి పద్ధతిని పాటించవలెను. ఈ తెగులు రాకుండా ఉండడానికి పూత దశ నుండి తేమ తగ్గకుండా మొక్కజొన్న పంటకు నీటితడులు ఇవ్వాలి.
పంట కోత :మొక్కజొన్న లో కండెల ల పై పొరలు ఎండి మొక్కలపై వేలాడుతూ గింజలు గట్టిపడి 2.0  నుండి 3.0  శాతం ఉన్నప్పుడు ఈ పంటను కొయ్యాలి. కోసిన కానడేలను ఎండలో మూడు నుంచి నాలుగు రోజుల వరకు ఎండబెట్టాలి. గింజలను ఒలిచిన తర్వాత తేమ 10  నుంచి 12 శాతం వరకు ఆరబెట్టి నిల్వ చేయాలి.

లిలి  పైన చెప్పిన విధంగా రైతులు సరైన సమయంలో కొంతవరకు తట్టుకునే రకాలు ఎన్నుకొని, విత్తన శుద్ధి చేసి ,సిఫారసు మేరకు ఎరువుల మోతాదును, తొలి దశలో పురుగులను మరియు  తెగుళ్లను గుర్తించిన తరువాత  సస్య రక్షణ చర్యలను చేపట్టినట్లయితే యాసంగిలో అధిక దిగుబడులను  పొందవచ్చును.
-డా. ఏ. విజయభాస్కర్‌, సీనియర్‌ తెగుళ్ల శాస్త్రవేత్త, డా.మధుకర్‌ రావు,                       డా. ఉషారాణి, డా. శ్రావణి,  డా.మంజులత, డా.మాదన్మోహన్‌ రెడ్డి మరియు   డా.రాజేంద్రప్రసాద్‌, వ్యవసాయ పరిశోధన స్థానం, కరీంనగర్‌, ఫోన్‌ : 9849817896

Also Read: Maize(Corn) Products and Varieties: మొక్క జొన్న ఉప ఉత్పత్తులు మరియు రకాలు.!

Must Watch:

Leave Your Comments

Pesara and Millet Crop: పెసర, మినుము పంటను ఆశించే వివిధ రకాల పురుగులు వాటి యాజమాన్యం.!

Previous article

Pests Control In Rice Crop: వరి పంటలో తెగుళ్ళు, లక్షణాలు, నివారణ.!

Next article

You may also like