ఉద్యానశోభవ్యవసాయ పంటలు

Coconut – Cocoa Crops: కొబ్బరి – కోకో పంటలలో చేపట్టవలసిన పనులు.!

2
Cocoa Crops
Cocoa Crops

Coconut – Cocoa Crops – కొబ్బరి:  ఈ మాసంలో పిందె రాలడం మరియు నీటి ఎద్దడి లక్షణాలు ఉన్న తోటలలో 15 రోజుల వ్యవధిలో నీటి తడులు ఇచ్చుకోవలసి ఉంటుంది. వేసవి కాలం ఆరంభమవుతుంది. కాబట్టి, పిందెరాలుట అధికమవుతుంది. అందువలన రైతుసోదరులు కొబ్బరి చెట్లకు బేసిన్‌లు తయారుచేసుకొని, నీటితడులను క్రమం తప్పకుండా ఇవ్వడం ద్వారా పిందెరాలుడును అరికట్టవచ్చు.

తోటలలో పడిపోయిన ఎండుటాకులను, ఎండు గెలలను సేకరించి తోటలను శుభ్రంగా ఉంచుకోవాలి.  కొబ్బరి కాయలను ప్రతి నెల క్రమం తప్పకుండా సరిjైున సమయంలో దింపు తీసుకోవాలి. నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాలలో కనీసం వారానికి ఒక్కసారైనా నీటితడులు పెట్టుకోవాలి. తద్వారా పిందెరాలుటను అరికట్టవచ్చును.  మెరక తోటలలో, వర్షాభావ పరిస్థితులు లేని తోటలలో ప్రతి 15 రోజులకు నీరు పెట్టవలెను.

కొబ్బరి చెట్టు మొవ్వు భాగము శుభ్రం చేయాలి (పొట్టిరకాలలో) నీటి లభ్యత తక్కువ ఉన్నచోట డ్రిప్పు పద్ధతి ద్వారా నీటిని రోజుకు సుమారు 50`60 లీటర్ల వరకు చెట్టుకు సేద్యపు నీరు తోటలకు అందించడము ద్వారా నీటిని బాగా పొదుపు చేయవచ్చును. ఎరువుల ఆదా కొరకు డ్రిప్‌ విధానం ద్వారా ప్రతి నెల చెట్టు ఒక్కింటికి 91 గ్రా. యూరియా, 74 గ్రా. డి.ఎ.పి. మరియు 178 గ్రా. మ్యూరేట్‌ ఆఫ్‌ పొటాష్‌ అందించడం ద్వారా అధిక దిగుబడులు పొందవచ్చు.
. కొబ్బరిని ఆశించు నల్లముట్టె పురుగు, సర్పిలాకార మరియు బండార్‌ గూడు తెల్లదోమ, ఆకుతేలు, గానోడెర్మా తెగులు మరియు నల్లమచ్చ తెగులు ఉనికిని పరిశీలిస్తూ ఉండాలి.

నల్లముట్టె పురుగు యాజమాన్యం:
. అధిక స్థాయిలో నల్లముట్టె పురుగు ఆశించిన క్రింది వరుస ఆకులను తొలగించి కాల్చివేయాలి.
. నల్లముట్టె పురుగు ఉధృతి తక్కువ స్థాయిలో ఉన్నప్పుడు గొనియోజస్‌ బదనిక చెట్టుకు 20 చొప్పున 15 రోజులకొకసారి విడుదల చేయాలి. ఉధృతి అధిక స్థాయిలో ఉన్నప్పుడు కనీసం ఎకరానికి 6,000 బదనికలు చొప్పున 15 రోజులకొకసారి విడుదల చేయాలి.
. యాజమాన్య పద్ధతులు పాటిస్తూ ఒక చెట్టుకి సిఫార్సు చేయబడిన ఎరువులు అనగా యూరియా 1 కేజీ, సింగిల్‌ సూపర్‌ ఫాస్ఫేట్‌ 2 కేజీలు మరియు 2 1/2 కేజీలు మ్యూరేట్‌ ఆఫ్‌ పొటాష్‌ మరియు సరిపడినంత నీటి పారుదల అందించాలి.
పైన తెలిపిన బదనికలు ఉద్యాన పరిశోధనా స్థానము, అంబాజీపేట, డా॥బి.ఆర్‌.అంబేద్కర్‌ కోనసీమ జిల్లా మరియు పరాన్నజీవుల పెంపకపు కేంద్రం, పెద్దపేట, శ్రీకాకుళం జిల్లా వారి నుండి పొందవచ్చును.

సర్పిలాకార, బొండార్‌ గూడు తెల్లదోమ యాజమాన్యము :
. సెప్టెంబర్‌ మాసం నుండి తెల్లదోమ ఉనికి కొబ్బరిపై గమనించవచ్చు. ముఖ్యంగా పొట్టిరకాలు మరియు హైబ్రీడ్‌ వంగడాలపై పురుగు స్థాయి త్వరగా పెరిగే అవకాశం ఉంటుంది. ఈ రెండు రకాలు కలిగిన తోటలలో రైతులు తెల్లదోమ ఉధృతి స్థాయిని గమనించుకోవాలి.
. నివారణ కొరకు మిత్రపురుగు ఎపరోÊక్రైసా ఆస్టర్‌ విడుదల మరియు ఇసారియా ఫ్యుమసోరోసియా శిలీంధ్రం జీవనియంత్రకాలను పిచికారీ చేసుకోవాలి.

ఆకుతేలు యాజమాన్యం :
. పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటే (ఆకుతేలు గొంగళి పురుగు దశలో ఉన్నపుడు) పిచికారికి అనుకూలంగా ఉన్న లేత తోటలలో బేసిల్లస్‌ తురింజియన్‌సిస్‌ 5 గ్రా. / లీటరు నీటికి మరియు క్లొరాంట్రనిలిప్రోల్‌ 0.3 మి.లీ./ 1 లీటరు నీరు కలిపి పిచికారీ చేయవలెను.
. ఈ పురుగు నివారణకు పెడోబియస్‌ ఇంబ్రియస్‌ అనే మిత్రపురుగును ఎకరానికి 600 బదనికలు చొప్పున 15 రోజుల కొకసారి విడుదల చేసుకోవాలి.

Also Read: Home Remedies Uses: మన ఇంటి పెరటి వైద్యం – ఆరోగ్య చిట్కాలు.!

Coconut - Cocoa Crops

Coconut – Cocoa Crops

గానోడెర్మా తెగులు యాజమాన్యం:
గానోడెర్మా తెగులు ఉన్న నేలల్లో కొబ్బరిచెట్టుకు ప్రతి సంవత్సరము 50 గ్రాముల ట్రైకోడెర్మా విరిడి అనే శిలీంధ్రపు పొడిని 5 కిలోల వేపపిండిలో కలిపి వేయాలి. ఈ ట్రైకోడెర్మా విరిడి శిలీంధ్రపు పొడిని ఖచ్చితముగా వేపపిండితో కలిపి వేయవలెను.
. గానోడెర్మా తెగులు అధికంగా ఉన్న నేలల్లో కొబ్బరి చెట్టుకు ప్రతి సంవత్సరము 125 గ్రా. ట్రైకొడెర్మా విరిడి G 125 గ్రా. సూడోమోనాస్‌ ఫ్లోరిసెన్స్‌ శిలీంధ్రపు పొడిని 5 కిలోల వేప పిండిలో కలిపి సంవత్సరమునకు ఒకసారి వేయాలి. కొబ్బరి తోటలో ఏ ఒక్క చెట్టుపై గానోడెర్మా తెగులు లక్షణాలు కనిపించినా, ఆ తోటలోని అన్ని చెట్లకు పైన వివరించిన విధముగా చర్యలు చేపట్టవలయును.

నల్లమచ్చ తెగులు యాజమాన్యం :
. కొబ్బరి చెట్టు కాండముపై ఎటువంటి గాయము కలిగించరాదు.
. ఈ తెగులు లక్షణాలు కాండముపై కనిపించిన వెంటనే, ఆ భాగముపై ట్రైకోడెర్మా యాస్పరిల్లమ్‌ శిలీంధ్రపు పొడిని పేస్ట్‌గా తయారుచేసి పూయవలెను (50 గ్రాముల పొడికి 25 మి.లీ. నీటిని కలిపిన పేస్ట్‌ తయారగును). (లేదా) ట్రైకోడెర్మా కాయిర్‌ పిత్‌ కేకును (1 కేకు ) కట్టాలి.

కోకో
. నేల స్వభావం మరియు వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా 15 ` 20 రోజుల వ్యవధిలో నీటితడులు ఇచ్చుకున్నట్లయితే, పూత మరియు కాయలు బాగా నిలబడతాయి.
. కోకోలో పక్వం చెందిన కాయలను క్రమం తప్పకుండా కోత కోసుకోవాలి. లేకపోతే ఎలుకలు పాడుచేస్తాయి.
. కోకో గింజలను సేకరించిన తరువాత పులియబెట్టిన తరువాత ఎండలో బాగా ఆరబెట్టుకోవాలి.
. బాగా ఎండిన గింజలను మార్కెటింగ్‌ చేసుకోవాలి.

కోకోలో పురుగులు, తెగుళ్ళు:
కోకోలో నల్లకాయ తెగులు ఉనికిని తోటల్లో గమనించుకోవాలి. దీని నివారణకు 1 శాతం బోర్డో మిశ్రమం లేదా 3 గ్రా. కాపర్‌ ఆక్సీక్లోరైడ్‌ లీటరు నీటికి కలిపి కాయలపై పిచికారీ చేయాలి
కోకోలో బెరడు తొలిచే పురుగు మొదలై ఉంటుంది. కనుక కోకో జార్కెట్లను విసర్జించిన పదార్ధాలతో ఏర్పడిన గోధుమ రంగు విసర్జాలను నిశితంగా పరిశీలించి, దీని నివారణ కొరకు లేంబ్డా సైహలోత్రిన్‌ మందు 1 మి.లీ. / లీటరు నీటికి కి కలిపి సిరెంజ్‌ ద్వారా జార్కెట్స్‌ దగ్గర ఉండే పురుగు ప్రవేశ ద్వారంలో ఇన్‌జెక్ట్‌ చేయాలి.

బి.నీరజ, సైంటిస్ట్‌ (ప్లాంట్‌ పేథాలజీ), ఎ.కిరీటి సైంటిస్ట్‌ (హార్టికల్చర్‌),
డా॥ వి.అనూష సైంటిస్ట్‌ (ఎంటమాలజీ), డా॥వి.గోవర్ధన్‌ రావు, సైంటిస్ట్‌ (ప్లాంట్‌ పేథాలజీ),
డా॥ఎన్‌.బి.వి.చలపతిరావు, ప్రిన్సిపల్‌ సైంటిస్ట్‌ (ఎంటమాలజీ),
డా॥జి.కోటేశ్వరరావు, రీసెర్చ్‌ అసోసియేట్‌ (హార్టికల్చర్‌),
డా॥బి.శ్రీనివాసులు, ప్రిన్సిపల్‌ సైంటిస్ట్‌ Ê హెడ్‌
ఉద్యాన పరిశోధన స్థానం,
డా॥వై.యస్‌.ఆర్‌.ఉద్యాన విశ్వవిద్యాలయం,
అంబాజీపేట, డా॥బి.ఆర్‌.అంబేద్కర్‌ కోనసీమ జిల్లా, ఆంధ్రప్రదేశ్‌

Also Read: Bengal gram Cultivation: శనగ కోత మరియు నిల్వలో పాటించాల్సిన మెళకువలు.!

Leave Your Comments

Fowl Pox Disease: ఫౌల్‌ పాక్స్‌ వ్యాధి – నివారణా చర్యలు.!

Previous article

Saline Soils Management: చౌడు భూములు – వాటి పునరుద్ధరణ (యాజమాన్యం)

Next article

You may also like