ఉద్యానశోభ

Chrysanthemum Flowers: శీతాకాలం రాబోతుంది.. ఇంకా ఈ పువ్వులకి మంచి డిమాండ్ ఉంటుంది.!

2
Chrysanthemum Flowers
Chrysanthemum

Chrysanthemum Flowers: చామంతి శీతాకలంలో పూస్తుంది. సాగులోనున్న చామంతి రకాలను నక్షత్ర చామంతి (చిన్నపూలు), పట్నం చామంతి (మధ్యస్థపూలు) విభజించవచ్చు. తేలికపాటి నేలలు అనుకూలం. ఉదజని సూచిక 6.5-7.0 మధ్య ఉండాలి. మురుగు నీటి పారుదల సరిగా లేని ఎడల మొక్కలు చనిపోతాయి.

చామంతి మొక్కలు పగటి సమయం ఎక్కువగా ఉన్నపుడు కొమ్మలు మాత్రమే బాగ పెరుగుతాయి. పగటి సమయం తక్కువగా ఉండి రాత్రి సమయం ఎక్కువగా వుంటే చామంతిలో పూత బాగా ఏర్పడుతుంది. అందు కొరకు జూన్- జులై మాసాల్లో నారు మొక్కలను నాటినట్లయితే నవంబర్ -డిసెంబర్ మాసాల్లో పూస్తాయి.

పిలకలు, కొమ్మ కత్తిరింపుల ద్వారా ప్రవర్ధనంచేస్తారు. పూల కోయటం అయిపోయిన తరువాత ఫిబ్రవరి-మార్చి నెలలందు మొక్కల నుంచి పిలకలను కత్తిరించి నారుమడిలో నాటుకోవాలి. మొక్కలని కొమ్మ కత్తిరింపుల ద్వారా ప్రవర్ధనం చేసుకుంటే మొక్కలు ఆరోగ్యంగా వుండి పూల నాణ్యత బాగుంటుంది. వేర్లు తొడిగిన పిలకల్ని జూన్-జులైలో నాటుకోవాలి. మొక్కలను 30-20 సెం.మీ. ఎడంగా నాటుకోవాలి. ఎకరాకు 55,000 నుండి 60,000 మొక్కలు అవసరమవుతాయి.

నారు నాటిన నాలుగు వారాల తరువాత చామంతి మొక్కల తలలను తుంచివేయాలి. ఈ విధంగా చేయడం వలన నిలువు పెరుగుదల ఆగి ప్రక్క కొమ్మలు ఎక్కువగా వస్తాయి. దీని వలన పూల దిగుబడి అధికంగా వస్తుంది మరియు పంట కూడ కొంత ఆలస్యంగా వస్తుంది.

నాటుటకు ముందు ఒక ఎకరాకు 10 టన్నుల పశువుల ఎరువు, 60-80 కిలోల నత్రజని 30-40 కిలోల భాస్వరం, 60-80 కిలోల పొటాష్ ఇచ్చె ఎరువులు వేసుకోవాలి.100 పి.పి.యమ్. నాఫ్తలిన్ ఎసిటిక్ ఆమ్లాన్ని మొగ్గదల కంటే మందుగా పిచికారి చేస్తే పూతను కొంత ఆలస్యం చేయవచ్చు. 100-1500 పి.పి.యమ్. జిబ్బరిలిక్ ఆమ్లాన్ని పిచికారి చేస్తే 15-20 రోజుల్లో త్వరగా పూతకొస్తుంది.

నాటిన మొదటి నెలలో వారానికి 2-3 వారానికి ఒక తడి యివ్వాలి. చామంతి మొక్కలు వంగి పోకుండా వెదురు కర్రతో ఊతమివ్వడం మంచిది. చామంతి పంటకు ముఖ్యంగా పచ్చ పురుగులు, ముడత మరియు ఆకు తొలుచు పురుగు ఎక్కువగా నష్టం కలుగ చేస్తాయి.

Also Read: Disease Management in Black Gram: మినుము లో వచ్చే వైరస్ తెగుళ్ల సమగ్ర యాజమాన్యం.!

Chrysanthemum Flowers

Chrysanthemum Flowers

పచ్చపురుగు : ఈ గొంగళి పురుగులు ఆకులను తినివేయుటే కాక పువ్వులను కూడా పాడుచేస్తాయి. నివారణకు మలాధియాన్ 5 శాతం పొడి 8 కిలోలను గాని లేక క్వినాల్ ఫాస్ పొడి 8 కిలోలు ఎకరం విస్తీర్ణంలో చల్లుకోవాలి. లేదా ఎండో సల్ఫాన్ 2 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేసుకొని నివారించవచ్చు.

త్రిప్సు : ఇవి గుంపులు గుంపులుగా చేరి రసాన్ని పీల్చివేయటం వల్ల ఆకులు ముడతలు పడి ఎండిపోతాయి. పూలు కూడ వాడిపోతాయి. నివారణకు డైమిథోయేట్ 1.5 మి.లీ. లేక కార్బరిల్ 50% పొడిని 3 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

ఆకుమచ్చ : నల్లటి లోతైన గుండ్రటి మచ్చలు ఆకులపై ఏర్పడటం వల్ల ఆకులు ఎండి వడలి పోతాయి. నివారణకు మంకోజెబ్ 3 గ్రా. లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి.

వేరుకుళ్ళు తెగులు : మొక్కలు అకస్మాత్తుగా వడలిపోతాయి. భూమిలో నాటిన కటింగ్ లు క్రుళ్ళిపోతాయి. దీని నివారణకు మురుగునీరు నిలువకుండ ఏర్పాటు చేయాలి. బ్లెటాక్స్ 3గ్రా. లేదా కాప్టాన్ 2.5 3గ్రా. లీటరు నీటిలో కలిపి న మందుతో నేలను బాగా అరికట్టవచ్చు.

నారు నాటిన తర్వాత షుమారు నెలరోజులకు చామంతి మొక్కల తలలను త్రుంచివేయడం వలన ప్రక్క కొమ్మలు ఏర్పడి అధిక పూల దిగుబడి పొందవచ్చు. ఒక్కొక్క మొక్క నుంచి 75- 120 పూలను పొందవచ్చు. జూన్ – జులైలో నాటిన మొక్కలు డిసెంబరు మరియు జనవరి వరకు పూతపూసి కోతకొస్తాయి. ఒక పంటకాలంలో దాదాపు 10-15 సార్లు పూలు కొయవచ్చు. ఎకరాకు దాదాపు 5 నుంచి 8 టన్నుల దిగుబడి వస్తుంది.

Also Read: Pomagranate Farming: అధునాతన పద్ధతిలో దానిమ్మ సాగు లక్షల్లో ఆదాయం

Leave Your Comments

Pomagranate Farming: అధునాతన పద్ధతిలో దానిమ్మ సాగు లక్షల్లో ఆదాయం

Previous article

Crossandra Flowers: ఈ పువ్వుల సాగుతో మంచి దిగుబడితో పాటు లాభాలు ఎలా సంపాదించాలి?

Next article

You may also like